జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి
యజ్జ్ఞా త్వామృతమశ్నుతే,
అనాదిమత్పరంబ్రహ్మ
న సత్తన్నా సదుచ్యతే.
ఏది తెలియదగిన బ్రహ్మస్వరూపమో, దేనిని తెలిసికొని మనుజుడు అమృతస్వరూపమగు మోక్షమును బొందుచున్నాడో అద్దానిని బాగుగచెప్పబోవుచున్నాను. అది లేనట్టి పరబ్రహ్మమనబడు అయ్యది సత్తనిగాని (ఉన్నదనిగాని) అసత్తనిగాని (లేదనిగాని) చెప్పబడదు .
******************************************************************************************* 13
సర్వతః పాణిపాదం త
త్సర్వతోక్షిశిరోముఖమ్,
సర్వతః శ్రుతిమల్లోకే
సర్వమావృత్య తిష్ఠతి.
అది ( ఆ బ్రహ్మము, ఆత్మ ) అంతటను చేతులు, కాల్ళు గలదియు, అంతటను కన్నులు, తలలు, ముఖములు కలదియు, అంతటను చెవులు గలదియు నయి ప్రపంచమునందు సమస్తమును ఆవరించి (వ్యాపించు కొని) యున్నది.
******************************************************************************************* 14
సర్వేంద్రియగుణాభాసం
సర్వేంద్రియ వివర్జితమ్,
అసక్తం సర్వభృచ్చైవ
నిర్గుణం గుణభోక్తృచ
బహిరంతశ్చ భూతానా
మచరం చరమేవ చ,
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం
దూరస్థం చాంతి కే చ తత్.
అవిభక్తం చ భూతేషు
విభక్తమివ చ స్థితమ్,
భూతభర్తృ చ తజ్జ్ఞే యం
గ్రసిష్ణు ప్రభవిష్ణు చ.
జ్యోతిషామపి తజ్జ్యోతి
స్తమసః పరముచ్యతే,
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం
హృది సర్వస్య విష్ఠితమ్.
(జ్ఞేయస్వరూపమగు) ఆ బ్రహము సమస్తములైన ఇంద్రియములయొక్క గుణములను ప్రకాశింపజేయునదియు, సమస్తేంద్రియములు లేనిదియు, దేనిని అంటనిదియు, సమస్తమును భరించునదియు (సత్త్వరజస్తమో) గుణరహితమైనదియు, గుణముల ననుభవించునదియు, ప్రాణులయొక్క వెలుపలను, లోపలను ఉండునదియు, కదలనిదియును, కదలునదియు, అతి సూక్ష్మమై యుండుటవలన ( అజ్ఞానులకు)తెలియబడనిదియు, దూరముగానుండునదియు, దగ్గరగాకూడా నుండునదియు, విభజింపబడనిదియైనను ప్రాణులందు విభజింపబడినదానివలె నున్నదియు, ప్రాణులను సృష్టించినదియు, పోషించునదియు, లయింపజేయునదియు అని తెలిసికొనదగినది. మఱియు నది ప్రకాశించెడు సూర్యచంద్రాగ్న్యాది పదార్థములకు గూడ ప్రకాశమునిచ్చునదియు, తపస్సు (అజ్ఞానము) కంటె వేఱైనదియు (లేక అతీతమైనదియు), జ్ఞానస్వరూపమైనదియు (చిన్మయరూపమును), తెలియదగినదియు, (అమానిత్వాది) జ్ఞానగుణములచే బొందదగినదియు, సమస్త ప్రాణులయొక్క హృదయమునందు విశేషించి యున్నదియునని చెప్పబడుచున్నది.
******************************************************************************************* 15,16,17,18
ఇతి క్షేత్రం తథా జ్ఞానం
జ్ఞేయం చోక్తం సమాసతః,
మద్భక్త ఏతద్విజ్ఞాయ
మద్భావాయోపపద్యతే.
ఈ ప్రకారము క్షేత్రము, అట్లే జ్ఞానము, జ్ఞేయముకూడ సంక్షేపముగ చెప్పబడినవి. నా భక్తుడు (నాయందు భక్తి గలవాడు) విని నెఱింగి నా స్వరూపమును (మోక్షమును, భగవదైక్యమును) బొందుట కర్హుడగుచున్నాడు.
******************************************************************************************* 19
ప్రకృతిం పురుషం చైవ
విద్ధ్యనాదీ ఉభావపి,
వికారాంశ్చ గుణాంశ్చైవ
విద్ధి ప్రకృతిసంభవాన్.
(ఓ అర్జునా!) ప్రకృతిని పురుషుని - ఉభయములను ఆది లేనివారినిగ నెఱుగుము. (మనోబుద్దీంద్రియాదుల) వికారములను, (సత్త్వరజస్తమో) గుణములను ప్రకృతివలన గలిగినవిగా నెఱుగుము.
******************************************************************************************* 20
కార్యకారణకర్తృత్వే
హేతుః ప్రకృతి రుచ్యతే,
పురుషస్సుఖదుఃఖానాం
భోక్తృత్వే హేతురుచ్యతే.
కార్యకారణములను గలుగజేయుట యందు ప్రకృతి హేతువనియు సుఖదుఃఖముల ననుభవించుటయందు పురుషుడు హేతువనియు చెప్పబడుచున్నది.
******************************************************************************************* 21
పురుషః ప్రకృతిస్థో హి
భుజ్కే ప్రకృతిజాంగుణాన్,
కారణం గుణసజ్గోస్య
సదసద్యోని జన్మసు.
ప్రకృతియందున్నవాడై పురుషుడు (జీవుడు) ప్రకృతివలన బుట్టిన (సుఖదుఃఖాది) గుణములను అనుభవించుచున్నాడు. ఆయా గుణములతోకూడికయే ఈ జీవునకు ఉత్తమ నికృష్టజన్మము నెత్తుటయందు హేతువైయున్నది.
******************************************************************************************* 22