ఆయుధానామహం వజ్రం
ధేనూనామస్మి కామధుక్,
ప్రజనశ్చాస్మికందర్పః
సర్పాణామస్మివాసుకిః.
నేను ఆయుధములలో వజ్రాయుధమును, పాడియావులలో కామధేనువును, ప్రజల (ధర్మబద్ధమగు) యుత్పత్తికి కారణభూతుడైన మన్మథుడును, సర్పములలో వాసుకియు అయియున్నాను.
******************************************************************************************* 28
అనంతశ్చాస్మి నాగానాం
వరుణో యాదసామహమ్,
పితృణామర్యమా చాస్మి
యమస్సంయమతా మహమ్.
నేను నాగులలో అనంతుడను, జల దేవతలలో వరుణుడను, పితృదేవతలలో అర్యమయు, నియమించువారిలో యముడను అయియున్నాను.
******************************************************************************************* 29
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం
కాలః కలయతామహమ్,
మృగాణాం చ మృగేంద్రోహం
వైనతేయశ్చ పక్షిణామ్.
నేను అసురులలో ప్రహ్లాదుడను, లెక్కపెట్టువారిలో కాలమును, మృగములలో మృగరాజగు సింహమును, పక్షులలో గరుత్మంతుడను అయియున్నాను.
******************************************************************************************* 30
పవనః పవతామస్మి
రామశ్శస్త్రభృతామహమ్,
ఝషాణాం మకరశ్చాస్మి
స్రోతసామస్మి జాహ్నవీ.
నేను పవిత్ర మొనర్చువానిలో (లేక వేగవంతులలో) వాయువును, ఆయుధమును ధరించిన వారిలో శ్రీరామచంద్రుడను, చేపలలో మొసలిని, నదులలో గంగానదిని అయియున్నాను.
******************************************************************************************* 31
సర్గాణామాదిరంతశ్చ
మధ్యం చైవాహమర్జున,
అధ్యాత్మవిద్యా విద్యానాం
వాదః ప్రవదతామహమ్.
ఓ అర్జునా! సృష్టులయొక్క ఆది మధ్యాంతములు (ఉత్పత్తి, స్థితి, లయములు) నేనే అయియున్నాను. మఱియు విద్యలలో ఆధ్యాత్మ విద్యము, వాదించువారిలో (రాగద్వేషరహితముగ, తత్త్వనిశ్చయము కొఱకు చేయబడు) వాదమును నేనైయున్నాను.
******************************************************************************************* 32
అక్షరాణామకారోస్మి
ద్వంద్వః సామాసికస్య చ,
అహ మేవాక్షయః కాలో
ధాతాహం విశ్వతోముఖః.
నేను అక్షరములలో 'అ' కారమును, సమాసములలో ద్వంద్వసమాసమును అయియున్నాను. మఱియు నాశములేని కాలమును (కాలమునకు కాలమై నట్టి పరమేశ్వరుడను), సర్వత్రముఖములు గల కర్మఫల ప్రదాతయును (లేక, విరాట్స్వరూపుడగు బ్రహ్మదేవుడను) నేనే అయియున్నాను.
******************************************************************************************* 33
మృత్యుస్సర్వ హరశ్చాహ
ముద్భవశ్చ భవిష్యతామ్,
కీర్తిశ్శ్రీర్వాక్చ నారీణాం
స్మృతిర్మేధా ధృతిః క్షమా.
సమస్తమును సంహరించునట్టి మృత్యువును, ఇక ముందు ఉత్పత్తికాగల సమస్తముయొక్క పుట్టుకయు నేనే అయియున్నాను. మఱియు స్త్రీలలోగల కీర్తి, సంపద, వాక్కు, స్మృతిజ్ఞానము, ధారణాశక్తి గల బుద్ధి, ధైర్యము, ఓర్పు అను ఈ ఏడుగుణములున్ను నేనే అయియున్నాను.
******************************************************************************************* 34
బృహత్సామ తథా సామ్నాం
గాయత్రీ ఛందసామహమ్,
మాసానాం మార్గశిర్షోహం
ఋతూనాం కుసుమాకరః.
సామవేద గానములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రియు, మాసములలో మార్గశిరమాసమును, ఋతువులలో వసంతఋతువును నేనైయున్నాను.
******************************************************************************************* 35
ద్యూతం ఛలయతామస్మి
తేజస్తేజస్వినామహమ్,
జయోస్మి వ్యవసాయోస్మి
సత్త్వం సత్త్వవతామహమ్.
వంచక వ్యాపారములలో నేను జూదమును అయియున్నాను. మఱియు నేను తేజోవంతులయొక్క తేజస్సును (ప్రభావము), (జయించువారల యొక్క) జయమును, (ప్రయత్నశీలుర యొక్క) ప్రయత్నమును, సాత్వికుల యొక్క సత్త్వగుణమును అయియున్నాను.
******************************************************************************************* 36