Followers

Wednesday, 5 August 2015

కర్మయోగః 5 (అథ తృతీయోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత


శ్రీ భగవానువాచ :-

కామ ఏష క్రోధ ఏష
రజోగుణ సముద్భవః,
మహాశనో మహాపాప్మా
విద్ధ్యేనమిహ వైరిణమ్‌.


శ్రీ భగవానుడు చెప్పెను. ఓ అర్జునా! నీవడిగిన ఈ హేతువు రజోగుణమువలన పుట్టిన కామము. ఇదియే క్రోధముగ పరిణమించుచున్నది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికిని తృప్తి బొందనిదియు, మహాపాపములకు కారణభూతమైనదియు అయి యున్నది. కావున దీనిని ఈ మోక్షమార్గమున శత్రువుగా నెఱుగుము.

*******************************************************************************************  37

ధూమేనావ్రియతే వహ్ని
ర్యథాదర్శో మలేన చ
యథోల్బే నావృతో గర్భ
స్తథా తేనేద మావృతమ్‌‌‌.


పొగచేత అగ్నియు మురికిచేత అద్దమున్ను, మావి చేత గర్భమందలి శిశువున్ను కప్పబడియుండులాగున ఆ కామము చేత ఈ ఆత్మజ్ఞానమున్ను కప్పబడియున్నది.

*******************************************************************************************  38

ఆవృతం జ్ఞానమేతేన
జ్ఞానినో నిత్యవైరిణా,
కామరూపేణ కౌంతేయ
దుష్పూరేణానలేన చ.


ఓ అర్జునా! నిండింప శక్యముకానిదియును, అగ్నివలె తృప్తిజెందనిదియు, ఆకాశరూపమైనదియు, జ్ఞానికి నిరంతర శత్రువునగు ఈ కామముచేత (ఆత్మ) జ్ఞానము కప్పబడియున్నది.

*******************************************************************************************  39

ఇంద్రియాణి మనోబుద్ధి
రస్యాధిష్ఠాన ముచ్యతే,
ఏతైర్విమోహయత్యేష
జ్ఞాన మావృత్య దేహినమ్‌.


ఈ కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఆశ్రయములని చెప్పబడుచున్నది. ఆ యింద్రియాదులచేత కామము ఆత్మజ్ఞానమును గప్పివైచి మనుజుని మిగుల మోహపెట్టుచున్నది..

*******************************************************************************************  40

తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ
నియమ్య భరతర్షభ,
పాప్మానం ప్రజహి హ్యేనం‌
జ్ఞానవిజ్ఞాన నాశనమ్‌.


భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జ్జునా! కాబట్టి నీవు మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానములను (శాస్త్రజ్ఞాన, అనుభవజ్ఞానములను) రెండింటిని నాశనము చేయునదియు, పాపస్వరూపమై నదియునగు ఈ కామమును తప్పకుండ సంపూర్ణముగ విడిచివేయుము.(నశింపజేయుము) .

*******************************************************************************************  41

ఇంద్రియాణి పరాణ్యాహు
రింద్రియేభ్యః పరం మనః,
మనసస్తు పరా బుద్ధి
ర్యో బుద్ధేః పరతస్తు సః.


(దేహాదులకంటె) ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియములకంటె మనస్సు గొప్పది. మనస్సు కంటె బుద్ధి గొప్పది. బుద్ధి కంటె గొప్పవాడెవడో ఆతడే ఆత్మ - అని యిట్లు పెద్దలు చెప్పుదురు..

*******************************************************************************************  42

ఏవం బుద్ధేః పరం బుద్ద్వా
సంస్తభ్యాత్మాన మాత్మనా
జహి శత్రుం మహాబాహో
కామరూపం దురాసదమ్‌.


గొప్పబాహువులుకల ఓ అర్జునా! ఈ ప్రకారముగ బుద్ధికంటె అతీతమైనదానినిగా ఆత్మ నెఱగి ( వివేకముతోగూడిన) బుద్ధిచేత మనస్సును బాగుగ నరికట్టి, జయించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ కామమను శత్రువును నశింపజేయుము.

*******************************************************************************************  43

ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణారునసంవాదే, కర్మయోగో నామ తృతీయోధ్యాయః

Popular Posts