“ లగ్నే , దనే , వ్యయే ,పాతాళే, జామిత్రే చాష్టమే కుజః
స్త్రీణాం భర్త్రు వినాసాయ , పుం సా భార్యా వినాశకః ‘’
అని చెప్పినారు . జాతకము ననుసరించి లగ్నము నుండి గానీ, జన్మరాశి నుండి గానీ , దాంపత్య కారకుడు ,భార్యా భర్త మధ్య అన్యోన్యత కు , ఆనందము సంతోషముల కు కారకు డైన శుక్రుని నుండి గానీ 1, 2, 4, 7 , 8 12 స్థానములలో కుజుడున్న కుజ దోషము అందురు .ఈ విధముగా స్త్రీ కున్న పురుషుడు , పురుషున కున్న స్త్రీ నాశనం అవుతారని ఉన్నది .
1 అనగా లగ్నము . ఈ లగ్నము లో కుజుడు ఉండుట వలన జాతకులు ఆవేశపూరిత నిర్ణయములు తీసుకొనుట, తొందర పాటుగా వ్యవహరించుట తద్వారా భార్యా భర్త మధ్య స్పర్ధలు ఏర్పడునని లగ్న మందున్న కుజుడు దోషి అని చెప్పిరి .
2. అనగా ధన భావము , కుటుంబ భావము , పూర్వము ఉమ్మడి కుటుంబములు ఉండేవి . ఒక కుటుంబము లో అనేకమంది సభ్యులు ఉండేవారు . ఇక్కడ కుజుడు ఉండుట వలన ధనము మంచి నీళ్ళలా ఖర్చు పెట్టుట , కుటుంబము లో ఇతర సభ్యులతో కలవక ప్రత్యేకము గా ఉండాలనే స్వభావము కలుగును . తద్వారా కుటుంబము లో గొడవలు ఏర్పడి కుటుంబము విచ్చిన్నమగును .
4 అనగా బంధువులు, గృహము , ఆస్తి , సుఖము , ఈ స్థానములో కుజుడు ఉండుట వలన బంధువులు పట్ల సరియైన ఆదరణ ఉండదు . ఒక్కొక్కప్పుడు గృహము నష్ట మగును. తాను స్వతంత్రత కలిగి ఉండడం , స్వయం నిర్ణయముగా వ్యవహరించడం మున్నగు లక్షణములు కలిగి ఇతరులను అర్ధం చేసుకోలేరు . తాము సుఖము ను అనుభవింపక ఎదుటి వారినిఇబ్బంది ట్టెదరు.
7 అనగా జీవిత భాగస్వామిని సూచించును . ఈ స్థానములో కుజుడు ఉన్నప్పుడు భార్య భర్త ఒకరి పట్ల మరియొకరికి సరియైన అవగాహన ఉండదు . ఎవరికీ తోచిన విధంగా వారు ప్రవర్తిస్తారు. ఈ విధమైన ప్రవర్తన వలన ఇద్దరికీ సరియైన అవగాహన లేక దాంపత్య సౌఖ్యము ను అనుభవించ లేరు . భార్య భర్త మధ్య ఎడబాటు సంభవించును . ఒక్కొక్కప్పుడు విడాకులు కూడా తీసుకొందురు.
8. ఈ భావము ఆయుస్సు ను సూచిస్తుంది . ఇక్కడ కుజుడు ఉండుట వలన జీవిత భాగస్వామి కి మరణము సంభవించు అవకాశ మున్నది . ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయము లో మరణించు వారే కదా. మరి ఏమిటి ఈ కుజ దోషము గురించి ఇంత చర్చ అని అనుకోవడం తప్పు . ఎందుకంటే భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది . స్త్రీ పురుషుడు ఇద్దరికీ వివాహము జరిగిన తరువాత పిల్లలు పుడతారు . ఉన్నంతలో వారిని పోషించడం , మంచి విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయవలసిన ,భాద్యత ప్రతి తల్లిదండ్రుల పై ఉన్నది . అలాంటి సమయములో తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి ప్రాణ నష్టము సంభవిస్తే పిల్లల భవిష్యత్తు అగమ్య గోచర మవుతుంది .అందువలనేమో 8 వ ఇంట కుజుడు అత్యంత ప్రమాదకారి అని చెప్పారు .
12 . వ భావము నష్టములను సూచించు చున్నది . మరియు పడక సుఖము ను సూచించును . ఇక్కడ కుజుని స్థితి వలన భార్య భర్తల మధ్య సరియైన సయోధ్య ఉండదు .తద్వారా దాంపత్య జీవితము అనేక సమస్యలతో నిండి ఉంటుంది . ఈ విధముగా కుజ దోషమును గురించి ఇంకా అనేక విషయములను చెప్పినారు .