Followers

Monday, 1 July 2013

శ్రీవరలక్ష్మీదేవి వైభవం

varalaxmi

అమ్మా! కమలా! కమలముల వంటి నేత్రాలుగల తల్లీ! శ్రీమహావిష్ణూ హృదయకమలవాసినీ! విశ్వజననీ, క్షీరసాగర సంభవా. కమలాలలోని సుకుమారమైన మధ్యభాగంలోని గౌరీవర్ణం వంటి మేనిచ్ఛాయగల దేవీ. నమస్కరించిన వారికి శరణ్యురాలా. ఎల్లప్పుడూ నాయందు ప్రసన్నురాలివగుము. విష్ణూవింట ‘శ్రీ’గా వెలసిన మన్మథ జననీ. చంద్రునిలోని వెన్నెలవు నీవు. ఓ చంద్ర సమాన మనోహరివదనా. సూర్యునిలోని వెలుగువు నువ్వు. మూడులోకాలలో ప్రభువు. నువ్వు అగ్నిలో దాహకశక్తివి. తల్లీ! నీ వల్లనే వేధ ఈ జగత్తును వివిధములుగా విధాన పరుస్తున్నాడు. విశ్వంభరుడు సమస్తజగాలను భరిస్తున్నాడు. హారుడు సంహారకుడవుతున్నాడు. జగత్తులను రక్షించడం, లరుుంపజేయడం, సృష్టించడం చేసేది నీవే. అమృతస్వరూపరాలివైన నిన్ను పొందిన కారణంగానే హరి ఆరాధ్యుడయ్యాడు. అమ్మా! నీ కృపాకటాక్షం క్షణమైనా సోకిన వారే గుణవంతుడు, పండితుడు, ధన్యుడు, మాన్యుడుగా అందరిచే ఆదరింపబడతాడు.
vratham

కలశం పరిపూర్ణత్వానికి, బియ్యం ఐశ్వర్యానికి ప్రతీకలు. చివుళ్ళు, ఫలం మొదలైన వాటితోనున్న ఆ కలశం బ్రహ్మాండవ్యాపిని అయిన లక్ష్మీదేవి స్వరూపమే! కొంతమంది కలశంపై పెట్టే కొబ్బరికాయకు కళ్ళు మొదలైన భాగాల్ని చిత్రిస్తారు. అయితే అది శాస్తవ్రిరుద్ధం. కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వరకే శాస్త్ర సమ్మతం.‘దేవా! ఈ లోకంలో స్ర్తీలు ఏ వ్రతాన్ని ఆచరిస్తే సకలసౌభాగ్యాలతో సుఖసంతోషాలను పొందుతారు? ఆ వ్రతం ఏదైనా ఉంటే, దాని గురించి చెప్పండి’ అని పార్వ తీదేవి శిశుని కోరింది. అం దుకు సమాధానంగా పరమ శివుడు మొదటిసారిగా వర లక్ష్మీ వ్రతాన్ని ఆచరిం చి సిద్ధిపొందిన చారుమతీ కథను చెప్పాడు.
పురుషులలో, ఏనుగులలో, గుర్రాలలో, స్ర్తీలలో, గడ్డిపోచల్లో, సరస్సుల్లో, దేవతల్లో, ఇళ్లల్లో, అన్నంలో, రత్నాలలో, పక్షుల్లో, పశువుల్లో, ధరణిలో నీ ప్రభే గోచరిస్తోంది. అమ్మా: లక్ష్మీ నీవు తాకినంత మాత్రానికే అన్నీ శుచిని పొందుతాయి. నువ్వు విడిచిపెట్టినంత మాత్రాన ఆశుచిత్వాన్ని పొందుతాయి. నీ నామం ఎక్కడుంటుందో అక్కడ సుమంగళత్వం ఉంటుంది. లక్ష్మీ, శ్రీ, కమ లా, కమలాలయా, పద్మా, రమా, రెండు చేతులలో పద్మాలను ధరించిన తల్లీ, క్షీరోదజా, అమృత కుంభకరా, విష్ణుప్రియా అని జపించేవారికి దుఃఖమెక్కడి ది? ఈ విధంగా అగస్త్యమహర్షి లోపాముద్ర సహితుడై కొల్హాపుర క్షేత్రానికి వచ్చి, అక్కడ మహాలక్ష్మీని దర్శించుకుని స్తుతించాడు. ఎందుకంటే లక్ష్మీదేవి ధనం నుంచి మోక్షం వరకు సమస్త ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అందుకే మన స్ర్తీమూర్తులు కూడ వరాలిచ్చే వరలక్ష్మీదేవిని శ్రావణమాసంలో పూర్ణిమకు ముందొచ్చే వరలక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం నాడు పూజించి దేవి కృపకు పాత్రులవుతుంటారు. అలా కుదరని వారు శ్రావణ మాసంలో మరేశుక్రవార మైనా వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తుంటారు.

అసలు ఇటువంటి వ్రతం గురించి సాక్షాత్‌ పార్వతీదేవి పరమశివుని దగ్గర అడిగి తెలుసు కుంది. ‘దేవా! ఈ లోకంలో స్ర్తీలు ఏ వ్రతాన్ని ఆచరిస్తే సకలసౌభాగ్యాలతో సుఖసంతోషాలను పొందుతారు? ఆ వ్రతం ఏదైనా ఉంటే, దాని గురించి చెప్పండి’ అని పార్వతీదేవి శిశుని కోరిం ది. అందుకు సమాధానంగా పరమశివుడు మొదటిసారిగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సిద్ధిపొందిన చారుమతీ కథను చెప్పాడు.పూర్వం మగధదేశంలోని కుండిన నగరంలో చారుమతీ అనే స్ర్తీ ఉండేది. ఆమె ఎంతో గుణ వంతురాలు. సదాచారపరురాలు. ఆమె ధర్మ పరత్వానికి ముగ్ధురాలైన వరలక్ష్మీదేవి ఒక రోజు రాత్రి ఆమె కలలో గోచరించి ‘శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తే, అనుగ్రహిస్తాన’ని సెల విచ్చింది.
సమస్తలోక కల్యాణం కోసం ఓ ఉత్తమ వ్రతాన్ని ఓ సదాచారపరాయణురాలైన వనిత ద్వారా లోకానికి అందించాలనేది లక్ష్మీదేవి అభిమతం. అందుకే చారు మతికి కలలో కనిపించి అలా చెప్పింది. ఉదయాన్నే చారుమతి, భర్తతో, అత్త మామలతో తన కల గురించి చెప్పి, వారి సహకారంతో వరలక్ష్మీ వ్రతాన్ని చేసింది. తద్వారా సకలైశ్వర్యాలను పొంది ఇహపరానందాన్ని సాధించింది చారుమతి. ఈ వరలక్ష్మీ కథనే శివుడు పార్వతికి చెప్పాడు.వ్రతం రోజున ప్రాతఃకాలాన్నే శుచిగా స్నానం చేసి, కొత్త వస్త్రాలను ధరించి, ఇంట్లో ఈశాన్యమూలను గోమయంతో అలికి (శుభ్రపరిచి) మండపం వేసి, దానిపై ఒక ఆసనాన్ని వేయాలి. ఆ ఆసనంపై కొత్త బియ్యాన్ని పోసి, మామిడి, మర్రి, జువ్వి, నేరుడు, రావి - ఈ ఐదు వృక్షాల పల్లవాలను (చిగుళ్ళను) పసుపు కుంకుమలతో అలంకరించిన కలశంపై ఉంచి, దానిపై పూర్ణఫలం (కొబ్బరికాయ), దానిపై కొత్త వస్త్రాన్ని (రవికెగుడ్డ) ఉంచాలి. అనంతరం వరలక్ష్మీదేవిని కలశంపైకి ఆవాహనం చేసి పురాణోక్తంగా ధ్యాన, ఆవాహన మొదలైన షోడశోపచారాలతో ఆర్పించాలి.

కలశం పరిపూర్ణత్వానికి, బియ్యం ఐశ్వర్యానికి ప్రతీ కలు. చివుళ్ళు, ఫలం మొదలైన వాటితోనున్న ఆ కలశం బ్రహ్మాండవ్యాపిని అయిన లక్ష్మీదేవి స్వరూ పమే! కొంతమంది కలశంపై పెట్టే కొబ్బరికాయకు కళ్ళు మొదలైన భాగాల్ని చిత్రిస్తారు. అయితే అది శాస్త్ర విరుద్ధం. కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వరకే శాస్తస్రమ్మతం.ఆ తల్లి వరాలిచ్చే తల్లి, వరలక్ష్మీదేవి. ఆమె దారిద్య్ర ధ్వంసినీ, ఐశ్వర్యప్రదాయిని. ఆ తల్లి భక్తవత్సల, తన భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చే కల్పవల్లి, ఆ తల్లి కటాక్షమాత్రం చేత అందరూ ఐశ్వర్యవంతులే కాదు, విద్యావినయ సంపన్నులు కూడ అవుతారు.ఈ వ్రతాన్ని చేసిన వారందరికీ ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు ప్రవచిం చాయి. 

Popular Posts