Followers

Monday, 1 July 2013

సహనంతో సహజీవనం సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం


hopeశాంతి యొక్క శక్తిని అనుభూతి 

పొందడం ద్వారా మాత్రమే గతాన్ని 

మనం మరిచిపోయే సామర్థ్యం 

పొందగలం. శాంతి యొక్క శక్తి 

అనుభూతి అంటే దాని అర్థం 

మనసును అశాంతికి గురిచేస్తున్న 

వ్యర్థం, నకారాత్మక ఆలోచనలను 

విడిచిపెట్టడం.








మన మనసును సత్సంకల్పాలతో కూడిన సకారాత్మక ఆలోచనలను మన మనసులో నింపుకున్నప్పుడే శాంతి యొక్క శక్తి పెరుగుతుంది.ఎప్పుడైతే మనసు శాంతి... ఆనందంతో నిండుగా ఉంటుందో పాత విషయాలు స్వతహాగా స్మరణకు రావు. శాంతంగా ఉం టూ మిమ్మల్ని చూసుకోండి ఎంత సహజంగా ఉంటారో.అశాంతిగా ఉంటూ ఇతరులను చూసినపుడు మనల్ని మనం చూసినపుడు సహజంగా ఉండలేం. స్నేహ పూర్వకంగా ఉం టూ అందరికీ సహయోగులు కండి. ఒకటి, రెండు మాటలు వినడం. అంగీకరించడం. ఇది కూడా సహించే పనిగా చెప్ప వచ్చు. సంతృప్తి, సుఖవంతులుగా తయారు అయ్యేందుకు పాత కాలం నాటి విషయాలు విడనాడాల్సి ఉంటుంది. ఎవరి దైనా, ఏ విషయమైనా మనసులో ఉంచుకుంటే చాలా బరువు గా ఉంటుంది. శరీరం బరువెక్కుతుందో నడవడం కూడా చా లా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు అనారోగ్యంగా ఉంటారు.

అలాగే మనసు ఎప్పుడైతే బరువుగా భారంగా ఉంటుందో ఆం తరంగిక అనారోగ్యంగానూ, నిరుత్సాహంగా ఉంటుంది. ఆనందంగా నవ్వుతున్నప్పుడు కూడా ఉదాసీనంగా భారంగా, అనారోగ్యంగా ఉందన్న భావన, బరువుగా తోస్తుంది. అయినా నవ్వుకుంటాం.
అందుకే మనసును ఎల్లప్పుడూ తేలికగా ఉంచే ప్రయత్నం చేయాలి. అందుకే ఏ రకమైన వ్యర్థ సంకల్పాలను వ్యర్థమైన విషయాలను మనసులో చోటు కల్పించకండి.సహన శక్తితో మన మాటలు, నడవడిక, మధురంగా తయార వుతాయి.సహన శక్తితో అనేక గుణాలు మనలో వాటికి అవే లోపల చేరుకుంటాయి. వ్యర్థమైన చింతన చేయడం లేదా ఆలోచిం చడానికి ముఖ్య కారణం సహనశీలత లోపించడమే. మనం ఎలాంటి చింతనను చేస్తామో అలాంటి వర్ణనే ఉంటుంది.
ఎంత సమయమైతే ఆలోచనలో కోల్పోయామొ, తిరిగి ఆ సమయాన్ని తెచ్చుకోలేం. పోయిన ధనాన్ని కాదు ఏమీ తిరిగి తెచ్చుకోలేము.

సంపాయించే వారికి సమయం యొక్క విలువ తెలుసు. ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించరు. పురుషార్థం లో ఎల్లప్పుడూ విజయం లభించనందుకు కారణం ఉంది. పాతకాలం నాటి అలవాట్లు ఉన్నా, అదే సహజ లక్షణాలు ఉ న్నా, ప్రవృత్తి ఉన్నా, అది సంస్కారాలతో చాలా తేడా ఉంటుం ది. వాటినే మనం వినియోగిస్తాం. ఇంకా పాతకాలం నాటి విధానాన్నే అవలంబిస్తున్నాం. 
శరీరానికి మలినం అంటితే కడుగుతాం. ఆత్మలో మలినం చేరితే జ్ఞాన రాజయోగాల ద్వారా పవిత్రులం అవుతాం.మనసులో అపవిత్రత, వ్యర్థ ఆలోచనలు ఉన్నప్పుడు ఆనందా నికి దూరమవుతాం. వ్యర్థమైన ఆలోచనలను వదలడం లా సత్సంకల్పం, కాలం సద్వినియోగం, ప్రయోజన కరమైన జీవి తం అన్నీ విషయాలకు అవసరమైన విషయాలతో కాలం గడిపే బదులు అవసరమైన మేర పని చేయండి. విజయం సాధించండి. వ్యర్థమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకుని అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే.సహన శక్తియే మనకు నైతికబలం సహనం, సౌశీల్యంతోనే వ్యక్తి నిర్మాణం వ్యక్తి నిర్మాణం అధ్యాత్మికతతో సాధ్యం సహ నంతో సహజీవనంతోనే మెరుగైన సహయోగం సాధ్యం.

Popular Posts