నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.
శ్లోకంః అథ వ్యవస్థితాన్ దృష్ట్వా
ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః
ప్రవృత్తే శస్ట్రసంపాతే
ధనురుద్యమ్య పాండవః
ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణుడు జీవులందరి ఇంద్రియములూ తానే నియమించువాడు. ఎవరేది చేయాలన్నా, మానవలెనన్నా, తానే చేయించగలవాడు. అట్టి శ్రీకృష్ణుని చూసి అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు.
శ్లోకంః హృషీకేశం తదా వాక్యం
ఇదమూహ మహీపతే!
సేనయోః ఉభయోర్మధ్యే
రథం స్థాపయ మేచ్యుత
హే అచ్యుతా! నిన్ను పట్టిన వారిని నీవు ఎన్నడూ విడువవు. భక్తరక్షణ నుండి ఎన్నటికీ జారిపోవు. కనుక నీవు అచ్యుతుడవు. ఇరు సేనల మధ్యా ఈ రథమును నిలుపుము.