సాధారణంగా ఆంజనేయస్వామి దేవాలయాలన్నీ తూర్పుముఖంగా ప్రతిష్టిస్తారు. కాని, కర్ణాటక సరిహద్దుల్లోని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి 60 కి.మీల దూరంలో ఉన్న మక్తల్ పట్టణంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని సాక్షాత్తూ జాంబవంతుడు ప్రతిష్టించాడని పురాణాలు చెప్తున్నా యి. ఈ విగ్రహాన్ని పశ్చిమ ముఖంగా ప్రతిష్టించినందున ఈ స్వామిని పడమటి ఆంజనేయస్వామిగా వ్యవహరిస్తారు.
భక్తుల మనోభీష్టాలను తీర్చే ఈ ఆంజనేయస్వామి వెలసిన ఈ ప్రదేశాన్ని మక్తల్ అని అంటారు. మఖ అంటే యజ్ఞం. స్థలి అంటే ప్రదేశం. యజ్ఞాలు జరిగే స్థలం కాబట్టి నాడు మఖస్థల్‌గా, మగతలగా, రాను రాను మక్తల్‌గా రూపాంతరం చెంది నిలిచిపోయింది. అంతేకాక స్వామివారి విగ్రహం ఒక వెైపుకు వంగి ఉంటుంది. పూర్వం స్వామిని కొలిచే అర్చకులు చాలా పొట్టివారుగా ఉండటం. వారి కోరిక మేరకు ఒక వెైపుకు ఒరిగాడని ప్రతీతి. అంతేకాకుండా సీతాన్వేషణలో రామాగుళీయకాన్ని తీసుకు వెళ్తున్న భంగిమలో ఉంటారని మరికొందరి విశ్వాసం. ఈ భారీ విగ్రహం భూమి నుంచి ఇంత వరకూ ఎలాంటి ఆధారం లేకుండా నిల్చుని ఉండటం మరో విశేషం. ఇక్కడ శుచి, శుభ్రతలో కూడా గర్భాలయానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడెైతే ఆలయాన్ని శుభ్రపరచరో ఆరోజు వెంటనే ఓ సర్పం వచ్చి హెచ్చరించేదని ఇక్కడివారు చెప్తారు. ఈ ఆలయానికి పెైకప్పు కూడా ఉండదు. ఎన్నో సార్లు వెయ్యాలని ప్రయత్నించినా బీటలు వచ్చి కూలిపోతూవుంటుందిట. స్వామివారి విగ్రహానికి, భూమికీ మధ్యలో చిన్నపాటి కర్ర పెట్టి అటుఇటూ ఆడించినా జరుగుతూవుంటుంది. దీనితో ఈ విగ్రహం ఎలాంటి ఆధారం లేకుండా ఉందన్నది నగ్న సత్యం అని అర్చకులు అంటున్నారు.