Followers

Friday, 9 August 2013

గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు




మాతృత్వం అనేది ప్రతి స్త్రీ కి ఓ వరం . ఆ వరం శాపం కాకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా ఆమెదే ! గర్బిణులు తీసుకునే మందుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో , ఆహార విషయంలో కూడా అంతే అప్రమతంగా ఉండాలి . చాలా మంది ఇద్దరికీ సరిపడ ఆహరం తీసుకుంటుంటారు. అలా తీసుకోవలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు . గర్భిణులు ఎలాంటి ఆహరం , ఎంత మొత్తంలో తీసుకోవాలి ? అన్న వివరాలు ……..

pregnancy dietగర్భణులు ఎక్కువగా తింటే పుట్టబోయే బిడ్డ బరువు అధికంగా ఉంటుంది అన్నది అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు . గర్భిణులు ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే విధంగా చూసుకోవాలే తప్ప మోతాదుకు మించి ఆహరం తీసుకోకూడదని వారు సూచిస్తున్నారు .

ఒకే సారి ఎక్కువ మొత్తంలో ఆహరం తీసుకోకూడదు . కొద్దికొద్దిగా వీలనైన్ని సార్లు అంటే రొజు మొత్తం మీద నాలుగైదు సార్లు తినడం అలవాటు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు .

అందుబాటులో ఎప్పుడూ కొన్ని పళ్ళు ఉంచుకోవడం మంచిది . సీడ్ లెస్ గ్రేప్స్ లాంటివి స్నాక్స్ కింద తీసుకోవాలి .

కెఫైన్ అధికంగా లభించే ద్రవపదార్ధాలు పూర్తిగా మానేస్తే మంచిది .

బరువు పెరగడం అన్నది గర్బిణులకు  సర్వసాధారణం .కానీ ఒకేసారి అధికంగా పెరగడం లేదా తగ్గడం అన్నది అనారోగ్యానికి చిహ్నం .

చిప్స్ , వేపుడు పదార్ధాలు బరువును పెంచడానికి దోహదం చేసేవే అయినా , ఈ విధమైన పదార్ధాలు తీసుకోవడం ద్వారా బరువు పెరగడం అన్నది గర్భిణులకు ఆరోగ్యం కాదని నిపుణులు సూచిస్తున్నారు . పై వాటిని పూర్తిగా మానేయకుండా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి .

ఆస్త్మాతో బాధపడే గర్భిణులు వేరుశనగాపప్పుకి  దూరంగా ఉండాలి . వీరు ఆహరంలో వీటిని తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చని నిపుణులు చెబుతున్నారు .

కొన్ని రకాల జలచరాలకి దూరంగా ఉండాలి . పచ్చిమాంసం లేదా ఉడికిఉడకని  మాంసాహారం అస్సలు తినకూడదు .

మాంసాహారంలో ఉండే లివర్ లేదా లివర్ తో చేసే ఆహారపదార్దాలకూ  పూర్తిగా దూరంగా ఉండాలి .

Popular Posts