ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్ (వ్యాధినిరోధక కారకం)గా పని చేస్తుంది. 100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల "విటమిన్ సి" ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్ ప్రభావంతో సమానం.
ఆపిల్‌లో అధిక మొత్తంలో వ
ిటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని మరింత పటిష్టం చేస్తాయి.
ఆపిల్‌లో మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి లివర్ (కాలేయం), జీర్ణక్రియలలో తలెత్తే సమస్యలను నివారిస్తాయి.
పానీయాలలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కిడ్నీ (మూత్ర పిండాలు)లలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.
File
FILE
ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది.
ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
100 గ్రాముల ఆపిల్‌లో ఉండే పోషక విలువలు:
విటమిన్ ఏ : 900 I.U.
విటమిన్ బి : 0.07 mg.
విటమిన్ సి : 5 mg.
కాల్షియం : 6 mg.
ఐరమ్ : 3 mg.
ఫాస్పరస్ : 10 mg.
పొటాషియం : 130 mg.
కార్బోహైడ్రేట్స్ : 14.9 gm.
క్యాలరీలు : 58 Cal.