* వేసవికాలం అంటే సాధారణంగా ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది పుచ్చకాయ, ఆ తరువాత బత్తాయిపండ్లే. వేసవితాపాన్ని తగ్గించి, శరీరానికి చల్లదనాన్ని ఇవ్వటమేగాకుండా, రక్తాన్ని శుద్ధిచేసే గుణాలు బత్తాయిలో మెండుగా ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ (రక్తపోటు)తో బాధపడేవారికి, గుండెజబ్బుతో ఇబ్బందిపడేవారికి బత్తాయి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
* మలబద్ధకంతో బాధపడేవారికి బత్తా
యి ఔషధంగా పనిచేస్తుంది. బత్తాయి రసాన్ని ప్రతిరోజూ రాత్రివేళల్లో తీసుకున్నట్లయితే ఉదయాన్నే సులభంగా మలవిసర్జన జరుగుతుంది. బత్తాయి గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచి చేస్తుంది. పిండం ఎదిగేందుకు, సుఖ ప్రసవానికి బత్తాయి రసం ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు ఆ సమయంలో ఉండే అలసటన, అనారోగ్యాలను దూరం చేస్తుంది.
* వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటమే గాకుండా.. ఒంట్లోని వేడిని బత్తాయి రసం తగ్గిస్తుంది. మూత్రనాళంలో మంటతో బాధపడేవారు బత్తాయి రసంలో గ్లూకోజ్ లేదా పంచదార కలుపుకుని తీసుకున్నట్లయితే మంట తగ్గటమేగాకుండా, మూత్రం సాఫీగా వస్తుంది.
* ఒక గ్లాసెడు బత్తాయి రసంలో కాస్తంత ఉప్ప, మిరియాలపొడి కలిపి తీసుకుంటే వేసవిలో అతి దప్పికను నివారిస్తుంది. కాగా.. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, క్యాల్షియమ్, పొటాషియం, బియాటిన్, ఫోలిక్ యాసిడ్.. తదితర పోషక పదార్థాలు మెండుగా లభ్యమయ్యే బత్తాయిని ఏ వయసువారైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.