Followers

Friday, 16 August 2013

Five foods for Asthma , ఆస్త్మాకు ఐదు ఆహారాలు


 


ఆస్త్మా గల వారు వింటర్ సీజన్‌ లో ఎక్కువ ఇబ్బంది పశుతుంటారు . అటువంటివారు ఆహారము విషయములో తగినంత శ్రద్ద తీసుకుటే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చును . అటు వంటి ఐదు పదర్ధాలపై అవగాహన . ఆయుర్వేద మరియు ప్రకృతి చికిత్సా నిపుణులు చెప్పిన ప్రకారము ఈ క్రింది కొన్ని పదార్ధములు ఉపయోగము ...->


1.పాలకూర : మెగ్నీషయం కు పాలకూర మంచి అధారము . ఆస్త్మా లక్షణాలను తగ్గించడము లో బాగా సహకరిస్తుంది. ఆస్తమా గలవారికి రక్తము లోనూ , టిష్యూలలోను మెగ్నీషియము స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడము వలన ఆస్త్మా ఎటాక్స్ తగ్గుతాయి. 

2.రెడ్ క్యాప్సికం : దీనిలో " సి " విటమిన్‌ ఎక్కువ . ఇన్‌ప్లమేషన్‌ తగ్గించడములో బాగా దోహదపడుతుంది. అయితే మిగతా విటమిటన్‌ సి ఉన్న ఆహారపదార్ధాలు అస్త్మాకి మంచి చేయవు . రెడ్ మిరిపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ " ఫాస్ఫోడిల్ స్టెరేజ్ " అనే ఎంజైమ్‌ ఉతపత్తిని అడ్డుకుంటుంది. చాలా ఆస్త్మా మందులలో ఇదే జరుగుతుంది . 

3.ఉల్లి : వీటిలో కూడా యాంటీ - ఇన్‌ప్లమేటరీ , యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడము వల్ల ' హిస్తమిన్‌ ' విడుదలను అడ్డుకుంటుంది. దీనివల బ్రోంకియల్ అబ్ స్ట్ర్క్షక్షన్‌ తగ్గుతుంది.

4.ఆరెంజ్ : కమలా , నారింజ , నిమ్మలలో ఉండే విటమిన్‌ ' సి ' ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోదనలు ఉన్నాయి. ముఖ్యము గా చిన్నపిల్లలో ఈ లక్షణాలు బాగా తగ్గినట్లు ఆదారాలు ఉన్నాయి. 

5.యాపిల్ : వీటిలో ఉండే ' ఫైటోకెమికల్స్ ' అస్త్మాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పై తొక్క ముదుర రంగులో ' లైకోఫిన్‌' ఎక్కువగా ఉన్నందున యాంటి-ఆక్షిడెంట్ గా  ఆస్త్మారోగులము మేలుచేస్తుంది. 

Popular Posts