Brown rice , ముడి బియ్యము
దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రదేశంలో సాధారణంగా అందరూ తినే ముఖ్యమైన ఆహారం అన్నం. ప్రతి రోజూ తినే అన్నం గురించి, దానికోసం వాడే బియ్యం గురించి ఆలోచించం మనం. అంటే దానిలోని పోషక విలువల గురించీ ఆలోచించం. సాధారనంగా అందరూ ఆలోచించేది అన్నం అందంగా, తెల్లగా, విడివిడిలాడుతూ కనబడుతోందా లేదా అని మాత్రమే. అయితే కంటికి ఇంపుగా అన్నాన్ని తయారుచేస్తే అందులో ఉన్న పోషక విలువలు పోతున్నాయి. బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం)తో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు.కానీ ఒంటికి మాత్రం ఖచ్చితంగా మంచిది. బియ్యాన్ని పాలిష్ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్ధం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు పోతున్నాయి. అయితే కావాలని కోరుకున్నా, ఇప్పుడు పట్టణాలలో దంపుడు బియ్యం కనపడ్డం కష్టం. పాలిష్ చెయ్యని గోధుమలతో తయారైన బ్రౌన్ బ్రెడ్ మాత్రం దొరుకుతోంది. దాని విలువని ప్రజలు గుర్తిస్తున్నారు.
పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది గోధుమరంగు బియ్యంలో ఉన్న సెలీనియం పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని తెలుస్తుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు జీర్ణవాహికలో క్యాన్సర్ కారక రసాయనాల బయటకు పంపుతుంది, ఈ రకంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి కాపాడుతుంది.
రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది గోధుమ రంగు బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రిఎంట్ లిగ్నాన్ రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బులను అడ్డుకోవడంలో సహయపడుతుంది. వయసు మళ్ళిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్ రైస్ వంటి ధాన్యాహారాన్ని తినడం వలన ఎంటరోల్యాక్టోన్ స్థాయిని పెంచుతుందని, దీని వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని తెలుస్తుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది బ్రౌన్ రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని పేరు పొందింది. బ్రౌన్ రైస్ లో ఉండే పీచు కూడా ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది పీచు సమృద్ధిగా ఉండటం వలన బ్రౌన్ రైస్ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. టె౦పుల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు బ్రౌన్ రైస్ తిన్నందున రక్తపోటును తగ్గించటంతో పాటుగా ధమనులలో ఫలకం చేరే స్థాయిని తగ్గించి, గుండె జబ్బులు వృద్ది చెందకుండా కాపాడుతుందని కనుగొన్నారు.
శరీర బరువును సాధారణంగా ఉంచుతుంది బ్రౌన్ రైస్ లో పీచు సమృద్ధిగా ఉన్నందున, మీరు అదనపు క్యాలరీలు తీసుకోకుండా చూడటమే కాక ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లుగా అనిపించేట్టుగా చేసి ఎక్కువగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనాలలో తేలిందేమిటంటే పీచు ఎక్కువగా ఉండే బియ్యం తినే మహిళల శరీర బరువు దాదాపుగా సాధారణంగా ఉంటుంది.
మలబద్దకాన్ని నివారిస్తుంది పీచు సమృద్ధిగా ఉన్నందున జీర్ణవ్యవస్థకు బ్రౌన్ రైస్ ఎంతో ప్రయోజనకారి. ఇది ప్రేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి మలబద్దకాన్ని నివారిస్తుంది.
రక్తంలో చక్కరను నియంత్రిస్తుంది బ్రౌన్ రైస్ లో ఉన్న పీచు రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించి టైపు 2 రకం డయాబెటిస్ ను నిర్వహించడంలో సహాయం చేస్తుంది.
ఎముకల ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది ఎముకల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన మెగ్నీషియం బ్రౌన్ రైస్ లో సమృద్ధిగా ఉంది. ఒక కప్పు బ్రౌన్ రైస్ లో దాదాపు 21% మెగ్నీషియం దొరుకుతుంది. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి, వేరొక అత్యవసర పోషకం కాల్షియంను గ్రహించడానికి కూడా అవసరం.
ఉబ్బసం లక్షణాలను తగ్గిస్తుంది బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నందున, ఉబ్బసం వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అనేక అధ్యయనాలలో తేలిందేమిటంటే బ్రౌన్ రైస్ లోని మెగ్నీషియం ఉబ్బసంతో బాధపడే వారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్ లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది ఒక అమెరికా పత్రికలో జీర్ణాశయాంతర వైద్య శాస్త్రంపై ప్రచురించిన అధ్యయనం ప్రకారం బ్రౌన్ రైస్ వంటి కరగని పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు స్త్రీలలో పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో సహాయం చేస్తాయని తేలింది.
ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థను నిర్వహిస్తుంది బ్రౌన్ రైస్ లో ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థ కు అవసరమైన మాంగనీసు సమృద్ధిగా ఉంది. ఈ పోషకం కొవ్వు ఆమ్లాలు సంశ్లేషణ, కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయడం ద్వారా సెక్స్ హార్మోనుల ఉత్పత్తికి కూడా సహాయ పడుతుంది.
ఆహార అవసరాలు ఒక రోజుకు 3 సార్లు ధాన్యాహారం తీసుకోనవలసినదిగా సిఫార్సు చేయబడింది. ప్రతి ½ కప్పు బ్రౌన్ రైస్ ఈ మూడు కప్పులకు సమానం, కాబట్టి బ్రౌన్ రైస్ తినడం మీ రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చేందుకు మంచి మార్గమౌతుంది.
Brown rice or also known as ‘hulled rice' is the least processed form of rice. It has only the outermost layer or hull removed, but still retains its outer, brown-colored bran layer that gives it a light brown color, nutty flavor, and chewy texture