Followers

Saturday, 17 August 2013

శైవులు, వైష్ణవులు అనే బ్రాహ్మణ వర్గీకరణ సరి అయినదేనా?


దేవి భాగవతం మన ఈ సంశయాన్ని తీర్చగలదు. జన్మతోనే బ్రాహ్మణుడుగా తెలుపబడుతుంది. ఉపనయనంలో గాయత్రీ ఉపదేశం చేయబడుతుంది. వేదశాస్త్ర విజ్ఞాన అర్జనకు అర్హత ప్రారంభం అవుతుంది. ఈ గాయత్రీ ఉపదేశంతోనే కొన్ని నియమాలు కూడా విధింపబడినవి. బ్రాహ్మణ, క్షత్రియ వైశ్యులకు ఉపనయంతో గాయత్రీ దీక్ష ప్రారంభం అవుతుంది. ప్రతి బ్రాహ్మణునికీ గాయత్రీ శాశ్వత దీక్ష. అందుకే బ్రాహ్మణులు అందరూ శాక్తేయులు అని వర్ణించినది దేవిభాగవతం. అయితే శైవులు వైష్ణవులు అనే వర్గీకరణ కేవలం మనం సృష్టించుకున్నదే. శివారాధన ప్రాముఖ్యం కలవారు శైవులు. విష్ణు ఆరాధన ప్రాముఖ్యం కలవారు వైష్ణవులు. సృష్టికి శివకేశవులు యిరువురూ ఒకటే. అంతేకాక శివ, కేశవులకు భేదం చూసినవారు నరక ప్రాప్తిని పొందుతారు అని పురాణములు తెలుపుతున్నవి. అంతేకాక బ్రాహ్మణులు అంతా శైవులు కారు, వైష్ణవులు కారు, "శాక్తేయులు" అని దేవిభాగవతం సూచిస్తున్నది. శైవులు శివకేశవ ఆరాధన చేయవలసినదే. వైష్ణవులు శివకేశవ ఆరాధన చేయవలసినదే. శివకేశవ ఆరాధనల యందు భేదం చూపరాదనే పురాణాలు తెలుపుచున్నవి. యింకా విశేషములు కావలెను అనిన ఎడల శివపురాణం, విష్ణు పురాణం, దేవిభాగవతం చదవండి. మీకు మరిన్ని విశేషాలు తెలుస్తాయి.

Popular Posts