నవీన యుగంలో చాలామందిని పట్టి పిడిస్తున్న సమస్య తల తీరుగుడు. దీనినే వైద్య పరిభాషలో వర్టిగో అంటారు. ఈ సమస్యతో బాధపడేవారు ఒంటరిగా ఎటు వేళ్లలేక భయపడుతుంటారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగా అనిపిస్తుంది. కానీ ఈ సమస్యను అనుభవించే వారి బాధ ఇంతా అంతాకాదు.. ఉదయం నిద్రలేవగానే మొదలవుతుంది.ఈ సమస్య నిద్రనుంచి లేసి ప్రక్కకు తిరిగినపుడు రోడ్డుమీదికి వెళ్లి నడుస్తున్నపుడు ఆఫీసులో కూర్చుండి విధులు నిర్వహిస్తున్నపుడు ఉన్నట్టుండి తల తిరుగుతుంది. కొన్ని సందర్బాలలో తూలిపడిపోవడం కూడా జరుగుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, లోలోన మదన పడకుండా వెంటనే డాక్టర్ సంప్రదించి మందులు వాడుకుంటే ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చును.
కారణాలు
1. అధిక రక్తపోటు 2. చెవిముక్కు సమస్య వలన 3. మెడలోని ఎముకల అరుగుదల వలన 4. మెదడుకు అందల్సిన ఆక్సీజన్ పరిమాణం తగ్గటం వలన తల తిప్పను.
లక్షణాలు
1. అధిక రక్తపోటు 2. చెవిముక్కు సమస్య వలన 3. మెడలోని ఎముకల అరుగుదల వలన 4. మెదడుకు అందల్సిన ఆక్సీజన్ పరిమాణం తగ్గటం వలన తల తిప్పను.
లక్షణాలు
- నిద్ర నుంచిలేచినపుడు, ఒక ప్రక్కకు తిరిగినపుడు ఉన్నట్లుండి తలతిప్పును.
- తల తిప్పడంతో పాటు వాంతికి వచ్చినట్లుగా అనిపిస్తుంది.
- ఒంటరిగా ఎటుపోవాలన్నా భయంగా ఉండును.
- కోపం, చిరాకు ఎక్కువగా ఉండును.
- తేలికగా ఆందోళన చెందుతుంటారు.
జాగ్రత్తలు - తల తిప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ద్విచక్ర వాహనాల ప్రయాణం తగ్గించుకోవాలి.
- ఆహారంలో కొవ్వు పదార్థాల తగ్గించుకోవాలి.
- తగినంత విశ్రాంతి కోసం యోగ మేడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేయాలి.
- సాధ్యమైనంతవరకు మానసిక ఒత్తిడిని నివారించుకోవాలి.
చికిత్స
తల తిప్పుడు సమస్య పోవటానికి హోమియో వైద్యంలో మంచి మందులున్నాయి. వ్యక్తి మానసిక లక్షణాలను శరీరక లక్షణాలను , వ్యాధి లక్షణాలను పరిగణలోనికి తీసుకోని వైద్యం చేసిన తల తిప్పుడు సమస్యలను తగ్గించవచ్చు.
మందులు
కోనియం: తల తీరుగుడు సమస్యకు కోనియం ప్రధానమైన ఔషదం, మంచంలో ఉన్నట్లుయితే గది మొత్తం తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తల అటు, ఇటు తిప్పిన కూడా గదిలో వస్తువుల గుండ్రంగా తిరుగుతున్నట్లుగా ఉంటుంది. అలాగే కదిలే వస్తువులను చూసిన, వర్టిగో సమస్య ఉత్పన్నమగును. నడిచేటపుడు కాళ్లు తడబడును. ఇలాంటి లక్షణాలనున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
కాక్యులర్ ఇండికన్: బస్సు, రైలు ప్రయాణాలు చేసినపుడు వాంతులతో పాటు తలతిరుగుతున్నటుగా అనిపించే వారికి ఈ మందు తప్పక ఆలోచించాలి.
ఫాస్ఫరస్: వీరు తలను కిందికి వంచినపుడు వర్టిగో సమస్యను ఎదుర్కొంటారు. వీరు నడుస్తున్నపుడు తూలినట్లుగా అనిపిస్తుంది. అలాగే వస్తువుల్ని తిరుగున్నపుడు అనిపిస్తాయి. వీరు మానసిక స్థాయిలో చీకటి అన్న, ఉరుములన్న భయపడతారు. వీరికి భయం ఎక్కువ ఉండలేరు. ఇటువంటి లక్షణాలన్న వారికి ఈ మందు వాడదగినది.
జెల్సియం: వీరు తల తిప్పుడు సమస్యతో పాటుగా నీరసం, మగతగా ఉంటారు. ఇలా ఉన్నవారికి ఈ మందు తప్పక వాడదగినది.
సైలిషియం:వీరు పైకి చూసిన, కదిలినా కళ్లు మూసుకున్న వర్టిగో సమస్యతో తూలుతూ ఉంటారు. వీరు కుడివైపుకు తిరిగి పడుకున్నపుడు వర్టిగో సమస్య అధికమగును. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకోని ప్రయోజనం పొందవచ్చును. ఇలా మందులను లక్షణసముదాయమును పరిగణలోకి తీసుకోని వైద్యం చేసిన యొడల వర్టిగో సమస్యను నివారించవచ్చును.