Followers

Sunday, 4 August 2013

కురుల సమస్యకు పరిస్కారం ఉందా..?

అందమైన జుట్టుకు తగిన రక్షణ తీసుకోనట్లయితే సమస్యలు కూడా తలెత్తుతాయి. ప్రపంచ జనాభాలో కనీసం 80 శాతం మంది మహిళలు చుండ్రుతో బాధపడుతున్నారని ఇటీవల ఒక సర్వే తెలిపింది. అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వల్ల నలుగురిలోకి వెళ్ళాలంటే కూడా వారుచాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. వీటన్నిటికీ కారణాలు అనేకం అని వారంటున్నారు.
వీటితో పాటే అనేక సమస్యలూ వస్తాయని చెబుతున్నారు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుండి బయట పడొచ్చని వారు చెవుతున్నారు. అందుకు తగిన సలహాలను కూడా సూచిస్తున్నారు.

చుండ్రు మూలంగా కేవలం జుట్టుకే సమస్య ఉంటుందనుకుంటే పొరపాటు. జుట్టు రాలిపోతుంది. చుండ్రుకు సంబంధించిన పొలుసు రాలడం మూలంగా ముఖం, వీపు, మెడలపై మొటి మలు తయారవుతాయి. కొన్ని సందర్భాల్లో తల నొప్పికి కూడా దారి తీయవచ్చు. రుతుక్రమంలో తేడాల మూలంగా కూడా చుండ్రు వచ్చే అవకాశా లున్నట్లు వైద్యనిపుణులు అంటున్నారు. చుండ్రు తో పాటు ముఖంపై అవాంఛిత రోమాలు, స్థూల కాయం, రుతుక్రమంలో తేడాలు ఉన్నట్లయితే, పాలిసిస్టిక్‌ ఓవరియన్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధి లక్ష ణంగా భావించవచ్చు. దీన్ని గుర్తించడానికి అవస రమైన వైద్య పరీక్ష చేయించుకోవాలి.

నిపుణుల సలహా అవసరం
చుండ్రుతో తరుచూ ఇబ్బందిపడేవారు మూడుపై పొట్టు రేగడం తగ్గగానే యాంటీ డాండ్రఫ్‌ షాం పూలు వాడడం ఆపేస్తారు. అలా చేయడం సరి కాదు. షాంపూ వాడకాన్ని కొనసాగిస్తూనే ఉం డాలి. చాలామంది స్ర్ర్తీలు, పురుషులకు వేర్వేరు షాంపూలుంటాయని అంటుంటారు. కానీ ఇది నిజం కాదు. చుండ్రుకు లింగవివక్ష లేదు. చికిత్స అనేది ఎవ రికైనా ఒక్కటే అని గుర్తించాలి. 

చుండ్రు నియంత్రణకు ఇప్పుడు మార్కెట్లో వివిధ రకాలైనా పద్ధతులు అమల్లో ఉన్నాయి. నిపుణుల సలహామేరకు వాటిలో ఏది మెరు గైనది అన్న విషయాన్ని తెలుసుకుని ఆయా పద్ధతులను అనుసరించడం మంచిది. తెలిసితెలియని పద్ధతులను అనుసరించడం మూలంగా మొదటికే మోసం వచ్చే అవ కాశం ఉంది. అంతేకాకుండా మార్కెట్లో ధర తక్కువగా ఉందనే ఉద్ధేశంతో చౌకబారు షాంపూలను వాడడం చేయరాదు. దీనివల్ల చుండ్రు నివారించబడకపోగా, జుట్టు మరింత రాలిపోయే ప్రమాదం ఉంటుంది.

నియంత్రణ మార్గాలు
వాస్తవానికి చుండ్రు నివారించడానికి ప్రత్యేక చికిత్స అంటూ ఏదీ లేదు. చుండ్రును నియంత్రించే ఉద్ధేశంతో రూపొందించిన వివిధ కంపెనీల షాంపూలు మాత్రం కొంత మేరకు పనిచేస్తాయి. షాంపూను తలకు పట్టించి, నురగ వచ్చే వరకూ రుద్ది కడిగేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అలా కాకుండా చుండ్రు మాడుకు అంటుకుని ఉంటుంది కనుక మాడుపై షాంపూను రుద్ది కనీసం పది నిమిషాలున్న తర్వాత తలంటు స్నానం చేయాలి. దీనివల్ల యాంటీ ఫంగల్‌ లక్షణాలు బాగా పనిచేసి చుండ్రు కొంతమేర నివారించబడుతుంది.

తెల్ల జుట్టు నివారణకు
కొంత మందికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడు తుంది. దీనిక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వంశపారంపర్య లక్షణాల మూలంగా కూడా జుట్టు తెల్ల బడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆహారలోపాలు, ఒత్తిడి వంటివన్నీ దీనికి కారణం. ఇక నేటి వాతావారణ కాలుష్యం కూడా దీనికి ఓ కారణం.తీసుకునే ఆహారంలో లోపాలు, థైరాయిడ్‌ సమస్య, మా నసిక ఒత్తిడి, ఆందోళన, రకరకాల షాంపూలు వాడడం వంటివి పలు కారణాలు కావచ్చు. వీటిలో ఏ కారణం వల్ల మీ జుట్టు తెల్లబడుతుందో ముందుగా గుర్తించాలి. 

వంశపారం పర్యం, థైరాయిడ్‌ సమస్యల మూలంగా జుట్టు తెల్లబడుతుందానుకుంటే వెంటనే ట్రైకాలజిస్ట్‌ లేదా ఎండో క్రైనాలజిస్ట్‌ వైద్య నిపుణులను సంప్రదిం చాలి. చదువుకునే విద్యార్థులకు జుట్టు తెల్లబడుతుం దంటే వారికి చదువు ఒత్తిడి అధికంగా ఉందనుకోవచ్చు. పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి, ఆందోళన వంటివి విద్యార్థుల్లో జుట్టు తెల్లబడడానికి కారణమవుతాయి. ఇటువంటపుడు కౌన్సిలింగ్‌ ద్వారా ఒత్తిడిని తగ్గించుకునే అవకాశాలున్నాయి.

ఇక తీసుకునే ఆహారంలో లోపాలు కూడా తెల్లజుట్టు రావడానికి కారణమవుతాయి. ప్రతిరోజూ మంచి పోష కాహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు, మొలకెత్తిన విత్త నాలు, సోయాజాతి విత్తనాలు, డ్రైప్రూట్స్‌ వంటివి ఎక్కు వగా తీసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుంది.ఘూటైన షాంపూలను వాడరాదు. ఎప్పు డు ఒకే రకమైన షాంపూను వాడడం మంచిది. మార్కెట్లోకి కొత్తగా ఏవీ వస్తే వాటిని వాడడం సరికాదు. గుడ్డు తెల్లసొన లేదా మజ్జికతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్టుల్ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. మందారాకు పేస్ట్‌తో కూడా ప్యాక్‌ చేసుకోవచ్చు.హెర్బల్‌ హెన్నాలో బీట్‌రూట్‌ రసాన్ని కలిపి ప్యాక్‌ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.

Popular Posts