గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు . వాటిల్లో నిద్ర పట్టకపోవడం అన్నది ఒకటి , దీనికి రకరకాల కారణాలు ఉంటాయి . శరీరంలో వస్తున్న మార్పులు , పుట్టబోయే బిడ్డ గురించిన ఆలోచనలు , ప్రసవం గురించిన భయం తదితర కారణాలు నిద్రలేమికి కారణం కావచ్చు . ఇన్ని కారణాలున్నా , గర్భవతులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతమైన గాఢనిద్ర పోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు .
మీ కుటుంబంలో ఎవరికైనా డ్రింకింగ్ అలవాటు లేదా పొగతాగే అలవాటు ఉన్నా దాన్ని వెంటనే మానేయమని కోరండి . ఈ రెండు నిద్రను దూరం చేస్తాయి .
రోజు మొత్తం మీద తీసుకునే కాఫీ , టీ , సోడా , చాక్లెట్ వంటివి సాధ్యమైనంత వరకూ తగ్గించేయండి .
నిద్ర పోవడానికి నాలుగైదు గంటల ముందు తేలిక పాటి వ్యాయామం (గైనకాలజిస్ట్ సూచనల మేరకు మాత్రమే ) చేయండి . ఇది మీరు ప్రశాంతమైన , గాఢ నిద్ర పోవడానికి దోహదం చేస్తుంది .
రాత్రి సమయంలో భోజనాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించండి . పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మనస్సు , శరీరం తేలికగా ఉంటాయి .
ప్రతీ రోజు ఒకే సమయంలో పడుకోవడం , ఉదయం ఒకే సమయంలో లేవడం అన్నది అలవాటు చేసుకోండి .
పడుకునేటప్పుడు ఎడమ వైపు తిరిగి మాత్రమే పడుకోవాలి .కుడి వైపు పడుకోకూడదు .
రాత్రి పడుకోబోయే ముందు ఎక్కువగా ఆహారం తీసుకోవడం , లేదా మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం చేయకూడదు . వీటి వలన తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో పాటు కడుపులో, ఛాతిలో మంటకు కారణం కావచ్చు .