Followers

Tuesday, 20 August 2013

నడుమునొప్పి వేధిస్తుంటే...


ఈ మధ్య అందరినీ తరచుగా వేధిస్తున్న సమస్య నడుంనొప్పి. కంప్యూటర్ల ముందు కూర్చుని గంటలు గంటలు పనిచేయడం, వాహనాల మీద ఎక్కువ దూరాలు ప్రయాణించాల్సి రావడం వంటి వాటివల్ల ఈ సమస్య రోజురోజుకూ అధికమవుతోంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

- సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలి.

- వాహనం నడిపేటప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు నడుము నిటారుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే బరువులు లేపకూడదు.

- బల్లమీద కానీ, నేలమీద కానీ పడుకోవాలి. అసంబద్ధమైన భంగిమల్లో కూర్చోకూడదు.

- నడుమును అకస్మాత్తుగా తిప్పడం, వంచడం చేయకూడదు. 

- పౌష్టికాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం, ప్రాణాయామం, యోగా వంటివి చేయాలి.

- వెంటనే బరువు చెక్ చేసుకుని, ఎక్కువ ఉంటే కనుక తగ్గే ప్రయత్నం చేయాలి. 

- పాదరక్షలు కూడా నడుమునొప్పికి కారణమవుతాయి. కాబట్టి ఎత్తుమడమల చెప్పులు మానేసి ఫ్లాట్‌గా,   సౌకర్యంగా ఉండే చెప్పులు ధరించాలి.

- ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యుణ్ని సంప్రదించి, వారు చెప్పిన పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స తీసుకోవాలి. 

Popular Posts