నుదుట బొట్టు, ముఖానికి పసుపు రాసుకుంటారు భారతీయ మహిళలు. కానీ అదే పసుపు ఎన్నో రకాల వ్యాధులను నివారిస్తుందని వారికి తెలీదు. యాంటీ బయోటిక్‌గా ఉపయోగపడే ఈ పసుపుతో చిట్కాలు...
పసుపు, చందనం రెండింటిని పాలమీది మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకొని తర్వాత చన్నీళ్ళలో శుభ్రంగా కడిగిన ముఖ ఛాయ పెరుగుతుంది. శరీరం కాంతివంతం అవుతుంది.
పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది. పసుపు, వేపచెక్క పట్టచూర్ణం, కరకాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయనమవుతాయి.
పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, మరియు దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకొని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి. పసుపు, తులసి ఆకులరసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక వ్రణాలు మానిపోతాయి.