Followers

Tuesday, 13 August 2013

బట్టతల సమస్యకు పరిష్కారం ఉందా


జీవి మనుగడకు గాలి, నీరు, శ్వాస ఎంత ముఖ్యమో ప్రతి మనిషికి ఆత్మవిశ్వాసం అంతే ముఖ్యం. బట్టతల వచ్చిన వారిలో ఆత్మవిశ్వాసం లోపించి ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. ముఖారవిందానికి కేశాలు కూడా ప్రాధాన్యమే. బట్టతల సమస్యకు 'హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్' చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం అందచేయవచ్చని అంటున్నారు ప్రముఖ కాస్మెటిక్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రవిచందర్‌రావు.


ఈ రోజుల్లో స్త్రీ పురుషులు ఉభయులలో వయసుతో నిమిత్తం లేకుండా జుట్టు రాలే సమస్య తీవ్రంగా పెరుగుతోంది. జట్టతల సమస్యకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఒక్కటే శాశ్వత పరిష్కారం చూపగలదు.

బట్టతలకు కారణాలు
90శాతం మందిలో ఇది వంశపారంపర్యంగా వస్తుంది.
కొందరిలో పేనుకొరుకుడు సమస్య కారణంగా వస్తుంది.
థైరాయిడ్ హార్మోన్‌లో హెచ్చు, తగ్గుల వల్ల .కొన్ని రకాల మందుల వాడకం వల్ల రావచ్చు.
పోషకాహార లోపం వల్ల రావచ్చు.జన్యువులలో వ్యత్యాసం వల్ల వచ్చే అవకాశం ఉంది.
చికిత్సా విధానం

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే వెంట్రుక కుదుళ్ల నుంచి వెంట్రుక మూలాలను వేరుచేసి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశంలో అమర్చే ప్రక్రియనే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటారు. దీనిలో ముఖ్యంగా రెండు పద్దతులు ఉన్నాయి. ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంట్(ఎఫ్‌యుటి-పట్టీ విధానం). ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్(ఎఫ్‌యుఇ).


హెయిర్‌ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సకు ముందు అన్ని రకాల రక్తపరీక్షలు అవసరమవుతాయి. ఆర్‌బిఎస్, సిబిపి, పిటి, సిటి, బిటి తదితర రక్తపరీక్షల ద్వారా అన్నీ సవ్యంగా ఉన్నాయని తేలితే చికిత్స మొదలవుతుంది. చికిత్సకు ఒకరోజు ముందు సాదా షాంపూతో తలస్నానం చేయలవలసి ఉంటుంది. ఈ పట్టీ విధానంలో ముందుగా ఎక్కువ వెంట్రుక మూలాలు కలిగి జన్యుపరంగా దృఢంగా గల భాగాన్ని గుర్తించడం జరుగుతుంది. సాధారణంగా తల వెనుక భాగం మరియు పక్క భాగం అనగా చెవులపై భాగంలో ఉండే వెంట్రుక కుదుళ్లు దృఢంగా, బలంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ప్రాంతాన్ని బాల్డ్ రిసిస్టెంట్ ఏరియా అంటారు. ఆ ప్రాంతంలో బట్టతల రావడం అరుదు. దాని తరువాత మధుమేహ వ్యాధిగ్రస్తులకు వాడే అతి సూక్ష్మమైన సూదుల సహాయంతో లోకల్ అనస్తీషియా అనే మత్తు మందు ఇవ్వటం మూలాన ఆ ప్రాంతమంతా స్పర్శను కోల్పోతుంది. అనంతరం సర్జికల్ బ్లేడ్ సహాయంతో ఆ గుర్తించబడిన ప్రదేశాన్ని చర్మంతో సహా బయటకు తొలగించడం జరుగుతుంది. అలా తొలగించగా ఏర్పడిన ప్రదేశాన్ని కుట్ల ద్వారా దగ్గరకు తీసుకురావడం జరుగుతుంది. ఇపుడు వెంట్రుక కుదుళ్లతో కూడిన చర్మం నుండి ఒక్కొక్క వెంట్రుక మూలాన్ని వేరుచేయడం జరుగుతుంది.

అలా వేరు చేయబడిన వెంట్రుక మూలాలు ఒకటిగా కాని రెండుగా కాని లేక మూడు లేదా అంతకంటే ఎక్కువగాని ఉండే సమూహంగా వేరు చేయడం జరుగుతుంది. తదనంతరం అలా వేరుచేసిన వెంట్రుక మూలాలను ప్రత్యేకమైన వైద్య పరికరాల సహాయంతో బట్టతల ఏర్పడిన భాగంలో అమర్చడం జరుగుతుంది. ఈ మొత్తం పద్ధతి జరగడానికి సుమారుగా 6 గంటల నుండి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. పేషెంట్ అదే రోజు తమ ఇంటికి వెళ్లిపోవచ్చు. బట్టతల ఎక్కువగా ఉన్నవారికి ఉదాహరణకు గ్రేడ్ 6, 7 వారికి ఒక సిట్టింగ్‌లో పూర్తి భాగాన్ని నయం చేయలేకపోవచ్చు. అలాంటి వారు మరొక సిట్టింగ్‌కి వెళ్లవలసి ఉంటుంది. కాని, పట్టీ విధానంలో అయితే సుమారు 6 నుంచి 12 నెలల సమయం వేచి ఉండాల్సి వస్తుంది.

చికిత్స తర్వాత జాగ్రత్తలు
పట్టీ పద్ధతిలో చికిత్సజరిగినా మరునాడు మరల హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటరకు రావలసి ఉంటుంది. ఎందుకంటే వెంట్రుక మూలాలు అమర్చిన చోటును, అలాగే తొలగించిన ప్రదేశాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో అక్కడి వైద్యులు తగిన సూచనలు ఇస్తారు. తల వెనుక భాగంలో వేసిన కుట్లను తిరిగి రెండు వారాల తర్వాత తొలగిస్తారు. అప్పటి వరకు పడుకునే విధానంలో తగిన సలహాలు పాటించాల్సి ఉంటుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ద్వారా అమర్చిన వెంట్రుకలు 3-4 నెలల తర్వాత పెరగడం ప్రారంభమవుతాయి. పూర్తి స్థాయి ఫలితాలు చూడాలనుకుంటే మాత్రం సుమారు 10-12 నెలల సమయం పడుతుంది.

డాక్టర్. ఎ. రవిచందర్‌రావు
ఎమ్.బి.బి.ఎస్, ఎమ్.ఎస్, ఎమ్‌సిహెచ్.ప్లాస్టిక్‌సర్జరీ(నిమ్స్)
కాస్మెటిక్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్
హెయిర్‌ష్యూర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్
హబ్సిగూడ, హైదరాబాద్
ఫోన్ : 040- 42020202, 9494020202

సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల

Popular Posts