ఆర్ త్రైటిస్ అంటే కీళ్ళలో ఇన్ ఫ్ల్ మేషన్ అనగా నొప్పి తో కూడిన వాపులు. ఇవి 170 రకాల కీళ్ళ జబ్బల సముదాయం. దీని వలన కీళ్ళలో నొప్పి, వాపు, నీలుక్కోని పోవడం వంటి లక్షణాలు కనపడుతాయి.
రకాలు
1. రుమటాఇడ్ ఆర్ త్రైటిస్ (Rheumatoid Arthritis)
2. ఆస్టియొ ఆర్ త్రైటిస్ (Osteoarthritis)
3. గౌట్స్ వ్యాధి (Gout)
ఆర్ త్రైటిస్ లేక కీళ్ళవాపు లక్షణాలు
- నొప్పి, గా ఉండడం ఈ నొప్పి –
కాళ్ళ కీళ్ళ లో - కదలిక మూలాన, నడిచి నప్పుడు, కుర్చీ నుండి లేచినప్పుడు
వేళ్ళ కీళ్ళ లో - వ్రాసి నప్పుడు, టైపు చేసినప్పుడు, ఏదైన వస్తువు పట్టుకున్నప్పుడు, కూరగాయల తరుగుతున్నప్పుడు మెదలగునవి
- ఇన్ ఫ్ల్ మేషన్ అనగా
(1) వాపు (2) కీళ్ళు వాయడం (3) నీల్గుక్కోని వుండటం (4) ఎఱ్ఱగా మారడం (5) వేడిగా అనిపించడం
- ప్రత్యేకంగా ఉదయాన్నే కీళ్ళు నీలుక్కొని పోయినట్టు అనిపించడం
- కీళ్ళను వంచడంలో కష్టమనిపించడం
- కీళ్ళు కదల్చడం సాధ్యం కాకపోవడం
- కీళ్ళు వాటి సాధారణ ఆకృతి కోల్పోవడం లేదా కీళ్ళ లో అంగ వైకల్యత ఎర్పడవచ్చు
- బరువు తగ్గి పోవడం, అలసట
- కారణం తెలియని జ్వరం
- కీళ్ళు కదల్చినప్పుడు రాపిడి వల్ల వచ్చే శబ్దం
ఆర్ త్రైటిస్ లేక కీళ్ళ నొప్పులను ఏ విధంగా సవరించుకోవచ్చు
సమర్థవంతగా, సరియైన పద్ధతిలో తగు చర్యలు తీసుకోవడం మూలంగా కీళ్ళ నొప్పులతో సాధారణ జీవితం గడపవచ్చు.
- కీళ్ళ నొప్పుల గురించి అవగాహన ఏర్పరుచుకోవడం వ్యాధి గురించి, దాని నివారణ గురించి త్వరితగతిన మూలమైన వైద్యం చేయించు కొని కీళ్ళ జబ్బుల వలన కలిగే దుష్పలితాలను అరికట్టుకోవచ్చు
- నిర్ణీత సమయాల్లో రక్త పరీక్షలు, ఎక్స్ రే లు తీఇంచుకొని, వైద్యుల సలహా మేరకు మందులు క్రమబద్దంగా వాడడం
- శరీర బరువు నియంత్రించుకోవడం
- ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం
- క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు వ్యాయామం చేయడం
- శారీరక ఒత్తిడులకు దూరంగా ఉండడం, వ్యాయామం, విరామం, విశ్రాంతి అన్నీ తగు మోతాదులలో నిర్ణీత సమయాలలో పాటించడం
- పనిని ముందే నిర్ణయించుకోవడం
- మందుల కన్నా యోగాసనాలు బాగా పని చేస్తాయని శాస్త్రీయపరంగా నిరూపించబడినది