గణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా
వస్తున్నది. అలా తొమ్మిది రోజులు చేయమని కూడా
శాస్త్రం చెబుతోంది. పత్రి పూజకు మనం ఎంచుకునేవి
మామూలు ఆకులు కాదు. అవి ఔషధమొక్కలకు
సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న
పత్రాలతోనే పూజించాలేకానీ, వేరేవాటితో చేయకూడదు.
ఔషధ పత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు
గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు
తొలిగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటివల్ల
ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిది రోజులు
చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక
కోర్సు. ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు
రోజులో,
వారం రోజులో వాడమని చెప్పినట్టుగానే, పూర్వీకులు
పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే,
తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారు. ఇదే
అసలు రహస్యం.