Followers

Saturday, 18 April 2015

మహా పుణ్యం శ్రీ తులసి దళం


ఆద్యాత్మిక పరంగా ,ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలననే తులసి భూలోక కల్ప వృక్షం గా దేవతా వృక్షం గా పేరు పొందింది.భగవంతుని పూజకు తులసి అతి ప్రసస్తము .తులసి గా శ్రీ మహాలక్ష్మి ఏ స్వయముగా అవతరించినట్లు పురాణములు చెబుతున్నాయి .

శ్రీ కృష్ణుని ప్రేమకు పాత్రురాలైన గోపిక     శ్రీ కృష్ణుడు ను   వేడుకోగా ,భూలోకంలో జన్మించి కొంతకాలం జీవించిన అనంతరం తన అంశ లో చేరేలా అనుగ్రహహించాడు స్వామి .ఈ శాప కారణంగా లక్ష్మి అంశ గా జన్మించి ,వృక్షం గా మారినట్లు శ్రీదేవి భాగవతంలోని ఒక కదా ద్వారా తెలుస్తోంది .

తులసి ప్రియురాలు కనుక విష్ణువును తులసి దళాలతో పూజించేటప్పుడు పాదాల వద్దనే తులసి దళాలను వుంచవలెను .
పవిత్ర దినములలో తులసి కోయరాదు , గోళ్ళతో తుంచ రాదు .సూర్యాస్తమయము తర్వాత తులసి కోయరాదు . మిట్ట మద్యాహ్న్నం ,అర్ధ రాత్రి వేల లో గాని తులసిని త్రుంచ రాదు . ఒకవేళ అలా చేస్తే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి .
ఎవరి గృహములో తులసి మొక్క వుంటుందో ,వారి గృహం తీర్ధ స్వరూపముగా వుంటుంది. తులసి దళా ల తో శివ కేశవులను పూజించిన వానికి మరల జన్మ ఉండదు, ముక్తిని పొందుతాడు.నర్మదా నదిని చూడడం ,గంగా స్నానము చేయడం,తులసి వనాన్ని సేవిచడం ఈ మూడు సమాన ఫలములను ఇస్తాయి .ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక సుద్ధ పౌర్ణమి వరకు చాత్రుమాస దీక్ష కావున ఈ సమయములో తులసి మొక్కను చోటు మార్చి పాత రాదు.

తులసి మాల ఎక్కువుగా రాముడికి ,కృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది.బుద్ధిని ,మనస్సును ప్రశాంతముగా ఉంచుటకు ఈ మాల ఎంతో ఉపయోగాదాయకం .తులసి మాలను ధరించడం వలన సర్వ పాపాలు నాసి స్తా
ఇన్ని ఉపయోగాములున్న దేవ వృక్షము తులసిని పెంచక మేడిపండు సామెత వలె డబ్బు వెచ్చించి కొనే క్రోటన్ మొక్క విలువ ఏపాటిదో కాస్త తెలుసుకొంటే తులసిదళం మహా పుణ్య ఫల దాయకమని గ్రహించగలుగుతారు .
తులసిలో లభించే అనేక ఔషద గుణములను సంబంధించి వైద్యులు ఇంకా ప్రయోగాలు నిర్వహిస్తూనే వున్నారు.

Popular Posts