Followers

Sunday 24 March 2013

ఆరాధన - ఆచరణ (Aradhana-Acharana)

ఆరాధన అనగా ప్రతిదినం తప్పకుండా, నిశ్చలమైన బుద్ధితో, అంకితభావంతో ఏకేశ్వర ప్రార్థన చేయుడమే. ఆరాధనవలన, భక్తులు భగవంతునిసృష్టిపై ప్రేమపెంచుకొంటాడు. దాంతో అహింసకు దగ్గరఅవుతాడు. ఎప్పుడైతే అహింసామార్గంలో మానవుడు పయనించడం మొదలుపెట్తాడో వారి మనస్సులకు శాంతి లభిస్తుంది. తనతో పాటు ఉన్న పెద్దల పైన, గురువుల పైన తల్లిదండ్రుల పైన గౌరవభావం పెంచుకొంటారు. తనకన్నాచిన్న వారిపైన వాత్సల్యాన్ని కలిగుంటాడు. దీనివల్ల అనుకోకుండానే అతనిలో సుగుణ రాశి పెరుగుతుంది. మంచి పనులు చేస్తారు. మంచి అనేది నావ కు చుక్కానికి మానవుణ్ణి ముందుకు తీసుకువెళ్తుంది. వీటిని అర్థంచేసుకొని ఆచరించడానికి జ్ఞానం అవసరం. అర్థం, అధికారం, అంతస్తు, అంగబలం, అహంకారం, అందం అశాశ్వితమైనవి అని తెలుసుకోవాలి. వీటిని విశ్వసించినవారు అజ్ఞానులు.
ప్రతి మనిషి జ్ఞాని కావాలంటే ముందు ఆరాధనతో ముందుకుసాగాలి. ఆచరణ లేని వ్యర్థ ఆరాధనతో నిరర్థకమైంది. బంగారం, భవనాలు, భూములు, వజ్ర వైడూర్యాలు, విత్తము పెరిగే ధనికులకు నరకాగ్ని నివాసం తప్పదు. డబ్బు సంపాదించకూడదని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు.్ధనాన్ని స్వార్థం విడనాడి అంటే ఎంత కావాలో అంత మాత్రమే సంపాదించుకోవాలి. సంపాదించిన ధనాన్ని ధర్మబద్ధంగా ఖర్చుచేయమనీ పెద్దలు అంటారు. అన్నం లేకఆకలి బాధతో అలటిస్తున్న అనాధలకు అన్నం పెట్టాలి, నీడలేని నిరుపేదలకు ఆశ్రయం ఇవ్వాలి, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తాన్ని అందివ్వాలి. ఆర్థిక ఇబ్బందులతో వారి జీవన ప్రయాణం సాగలేకపోతే తోచినంత, ఉన్నంత తడుముకోకుండా సాయం చేయాలి.
ఎప్పుడో పుట్టెవారి కోసం రాత్రింబగళ్లు సంపాదనే అనే పరుగు పందెంలో పరుగెత్తుచూ, పూర్తిగా మత్తు మాయలో పడినారు. ఆచరణలేని ఆరాధనవలన ఏశక్తి కూడా మానవులు పొందలేరు, వారికి స్వర్గం కూడాలేదు.
ఆచరణ అనగా త్రికరణశుద్ధితో, మనసా, వాచా, కర్మణా ఆచరించి వారి ఆరాధనకు న్యాయం కల్గించుట. ప్రపంచంలో ఎందరో ప్రవక్తలు, ఋషులు, స్వాములు జన్మించి ఇటు ఆరాధన చేసి అటు ఆచరించి ఎన్నో మహిమలు పొంది, అనాథులకు ఎనలేని సేవలందించారు. వారు తపస్సు ఏండ్ల తరబడి చేసి ఆత్మజ్ఞానంలో పరిపూర్ణ స్థాయి సంపాదించి, గొప్ప మహిమలు వారి వశం చేసుకొన్నారు. కందిమల్లయపల్లె వీరబ్రహ్మంస్వామి, ఆరాధన ఆచరణతో పెక్కు మహిమలుపొంది బడుగు వర్గాలకు, బలహీనులకు, అనాధులకు స్వచ్ఛందసేవలు అందించారు.
ఇలాంటి వారు దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. వీరికి ప్రాంతాలతో సంబంధం ఉండదు. వీరు ఎక్కడున్నా వారికంటికి కనిపించిన అభాగ్యులకు భాగ్యాన్ని కలిగించడంకోసం వారి తపస్సును ధారపోయడానికి వెనుకాడరు. అలాంటి వారి ఉపన్యాసాలు విని వాటిని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి. అపుడే మానవ జన్మ నెత్తినందుకు సార్థకత ఏర్పడుతుంది.

Popular Posts