Followers

Friday 15 March 2013

ఓం నుంచే అన్నీ ఆవిర్భవించాయి (Everything Genarating From Om))

ఓం నుంచే అన్నీ ఆవిర్భవించాయి
న, మ, శి, వ, య. మంత్రం ఓం కారంతో ప్రారంభం అవుతుంది. ఓం... మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని పెద్దలు చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి. ‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తుందన్నప్పటికీ ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అన్నారు. న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు కొందరు పెద్దలు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రపడి, మనసు ప్రశాంతం అవుతుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమోగుణం, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.

అనంతమైన అర్థం పరమార్థం
ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాల (పృథివ్యాపస్తేజోవాయురాకాశః) తో నిండిన శరీరం శుభ్రపడుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. న భూమికి సంబంధించిన భాగాలను, మ నీటికి సంబంధించిన భాగాలను, శి అగ్నికి సంబంధించిన భాగాలను, వ గాలికి సంబంధించిన భాగాలను, య ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు.

Popular Posts