Followers

Thursday, 21 March 2013

మాధవ సేవే మానవ సేవ

దేవుడికైతే మనం నిలువు దోపిడీ ఆలోచించకుండా ఇస్తాం
అదే సాటి మనిషిని ఐతే ఆలోచించి మరీ ముంచుతాం

దేవుడికైతే కోట్లు ఐనా హుండీలో త్రుణపాయంగా వేసేస్తాం
అనాధ రోడ్దు మీద అడుక్కుంటుంటే ఒక్క రూపాయి దానం ఇవ్వటానికి సంకోచిస్తాం

దేవుడికైతే ధూప దీప నైవేద్యాలతో విందు భోజనం పెడతాం
ఆకలితో అలమటించే సాటి మనిషికి గుప్పెడు అన్నం పెట్టం

దేవుడికైతే ఎక్కడో ఉన్నా కొండ నడిచెల్లి మరీ మొక్కి వస్తాం
సాటి మనిషి రోడ్డు మీద అపస్మారక స్థితిలో దిక్కు లేక పడి ఉన్నా ఓరగా చూస్తూ వెళ్ళుతాం

దేవుడికైతే భజనలు చేయతానికి గుంపు కట్టి మరీ గంటలు గంటలు తగలేస్తాం
కాని సాటి మనిషి కష్టాల్లో ఉంటే స్వాంత వచనాలు మాట్లాడానికి ఒక్క నిముషం కూడా టైమివ్వం

మానవ సేవే మాధవ సేవా? తప్పు.. తప్పు... మాధవే సేవే మానవ సేవ.

Popular Posts