Followers

Tuesday 26 March 2013

కోర్కెలను దహించే పండగ

కోర్కెలను దహించే పండగ

పరమేశ్వరుడిని పార్వతీపతి చేయ సంకల్పించిన మన్మథుడు తపోదీక్షలో ఉన్న ముక్కంటి 

ఆగ్ర హజ్వాలల్లో దగ్ధం అవుతాడు. కానీ మన్మథ ప్రయత్నం వృథా పోదు. పరమశివుడు 

పార్వతిని పరిణయమాడతాడు. అందుకు సంకేతంగానే హోలీ ఉత్సవాన్ని 

జరుపుకొంటారనే కథనం ఉంది. మన్మథ దహనానికి సంకేతంగానే హోలీ పండగ రోజు 

కామదహనం చేస్తారని అంటారు. అందుకే హోలికి కామదహనం అని కూడా పేరు ఉంది. 

నిజానికి కామదహనం చేయడంలో కూడా అంతరార్థం ఉంది.
కామం అంటే కోరిక. జీవితాన్ని దుఃఖభరితం చేసే కోరికలను అగ్నికి ఆహుతి చేయాలన్నదే 
దీనిలోని భావం. అనంతమైన కోర్కెలు మన ఆనందాన్ని, మనశ్శాంతిని దహించివేస్తాయి. 
తీరని కోరికలు నిరంతరం వేదనకు గురిచేస్తూ ఉంటాయి. అత్యాశలు లేకుండా పరిమితమైన 
కోరికలతో సంతృప్తిగా ఉంటేనే జీవితం ఆనందమయం అవుతుంది. కోరికల వరదకి సంతృప్తి 
అనే ఆనకట్ట వేస్తేనే జీవితంలో నిత్యం వసంతం ఉంటుందని సూచించే పర్వం ఈ హోలీ.

....


Popular Posts