Followers

Wednesday, 20 March 2013

ఒకే గోత్రంలో వివాహం చేసుకోవచ్చా?

పురాణాల్లో గోత్రాలు, వంశాలను గురించిన వివరణ ఉంటుంది గానీ, ఇంటిపేరు ఉండటమేమిటి అనే అనుమానం మీలో ఉందా.. అయితే ఈ కథనం చదవండి. గోత్రములు, వంశాలు తాతముత్తాతల నుంచి మనకు వస్తుంటాయి. ఫలానా రుషికి సంబంధించిన గోత్రమంటే ఆ కుటుంబానికి మూల పురుషుడు ఆ రుషి అన్నమాట. 

అదే గోత్రంలో మరికొందరు రుషులు జన్మించి వుండొచ్చు. అందుకే త్రయార్షేయమని, పంచరుషేయమని చెప్పుకుంటాం. ఇక ఇంటిపేరకు మనం నివశించే గ్రామాన్ని బట్టి, చేసే వృత్తిని బట్టి ఏర్పడతాయి. అవి శాశ్వతం కాదు సందర్భాన్ని బట్టి మారుతాయి.

ఇక గోత్రాలు చూసే వివాహం చేస్తుంటారు. వంశాలు కూడా అంతే.. గోత్రాల్లో ఒకే గోత్రానికి చెందిన వారు వివాహాలు చేసుకోకూడదని, వేర్వేరు గోత్రాలు.. ఒకే వంశానికి చెందినవారు వివాహాలు చేసుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.

Popular Posts