Followers

Thursday, 21 March 2013

కలలు వాటి ఫలితాలు -నాకు తెలిసినవి (Dreams)

కొన్ని రకాల కలలు ఆనందాన్ని ఇచ్చేటివిగా ఉంటాయి. కొన్ని కలలు మనసుకు నిరాశను కలిగిస్తుంటాయి. ఇవ్వన్నీకూడా మనిషి ఆత్మతో సంబంధం ఉంటుంది. మనిషి నిద్రలోనున్నప్పుడు అతని శరీరం ఆత్మనుంచి వేరుపడుతుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ నిద్రపోదు.

మనిషి నిద్రావస్థలోనున్నప్పుడు అతని పంచ జ్ఞానేంద్రియాలుకూడా తమ పనికి విశ్రాంతినిస్తాయి. ఇలాంటి సందర్భంలో మనిషి మస్తిష్కం పూర్తిగా ప్రశాతంగా ఉంటుంది. ఈ స్థితిలోనున్నప్పుడు మనిషికి ఓ రకమైన అనుభవం ఎదురవుతుంటుంది. అది వారి జీవితంతో కూడుకున్నదై ఉంటుంది. ఆ అనుభవాన్నే కల అని అంటారు.

ఈ కలల ఆధారంగానే మనిషియొక్క భూత, భవిష్యత్, వర్తమానాలగురించి తెలుసుకోవచ్చంటున్నారు జ్యోతిష్యులు. మీ కలలు ఏం చెపుతున్నాయో తెలుసుకుందాం...

మీరు నిద్రావస్థలోనున్నప్పుడు వివిధ వస్తువలు, పదార్థాలను చూస్తే ఏమవుతుంది?

** చేపలను చూస్తే... ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.

** మాంసం తింటున్నట్లు మీరు కలగంటే... దెబ్బలు తగులుతాయి.

** మీ కలలో మీరు దెబ్బలు తింటున్నట్లు కనపడితే... మీరు పరీక్షలలో అనుత్తీర్ణులయ్యే సూచనుల కనపడుతున్నాయి.

** గాల్లో తేలినట్లు కల వస్తే... ప్రయాణానికి సంకేతం.

** కాళ్ళు, చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే... మీకున్న అన్ని రకాల దుఃఖాలు, కష్టాలు తొలగిపోయనట్లేనని అర్థం.

** మీరు కలలో పెళ్ళికూతురుతో ముద్దాడుతున్నట్లు కలవస్తే...శత్రువులతో సంధికుదుర్చుకుంటారని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

** సర్పాన్ని పట్టుకోవడంలాంటి కలవస్తే... మీరు భవిష్యత్తులో ఫలితాలను చేజిక్కించుకుంటారని ఆ కలయొక్క అర్థం.

** కలలో ఒంటెను చూస్తే... రాజభయం

** కలలో మీ గెడ్డానికి కాస్త షేప్ ఇచ్చేలా కలగంటే... మీ దాంపత్య జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోయినట్లేనంటున్నారు జ్యోతిష్యులు.

** పెద్దలు మిమ్ములను ఆశీర్వదిస్తున్నట్లు కలవస్తే... గౌరవ ప్రతిష్టలు లభిస్తాయని అర్థం

** మీ కలలో మీ మెడ నిటారుగా ఉంటే... ధనప్రాప్తి కలుగుతుంది.

** మీరు పాలుతాగుతున్నట్లు కలగంటే... గౌరవ మర్యాదలు లభిస్తాయంటున్నారు జ్యోతిష్యులు.

** నీళ్ళు తాగుతున్నట్లు కలగంటే...భాగ్యోదయం కలుగుతుంది.



** మీ కలలో కుక్క మిమ్ములను కరిచినట్లు కనపడితే లేదా కుక్కను పెంచుకుంటున్నట్లు కలవస్తే... కష్టాలు వచ్చే సూచనలున్నాయి.

** కలలో ఎగురుతున్న పక్షిని చూస్తే మీకు గౌరవం లభిస్తుంది.

** నెమలిని చూస్తే దుఃఖం కలుగుతుంది.

** మీ పెళ్ళిని మీరు మీ కలలో చూస్తే... ఇబ్బందులెదుర్కోక తప్పదంటున్నారు జ్యోతిష్యులు.

** కలలో నుదుట కుంకుమ సింగారిస్తున్నట్లు కనపడితే... శుభకార్యం జరుగుతుందని భావించాలి.

** కలలో అద్దం చూస్తే... మనసు కకావికలమౌతుందంటున్నారు జ్యోతిష్యులు.

** రైలులో ఎక్కుతున్నట్లు కలవస్తే... యాత్ర చేస్తారని భావించాలి.

** నిద్రలో కాలుజారి పడినట్లు కలవస్తే...అధోగతి పాలయ్యే ప్రమాదానికి సూచన

** మీకు ఆవు దొరికినట్లు కలవస్తే... భూలాభం ఉంటుంది.

** గుర్రంనుంచి కింద పడినట్లు కలవస్తే... పదవీత్యాగం చేయాల్సివుంటుంది.

** గుర్రంపై ఎక్కినట్లు కలవస్తే... పదవిని పొందుతారు.

** మిమ్మల్ని మీరు చనిపోయినట్లు కలలో కనపడితే...మీకున్న అన్నిరకాల బాధలు తొలగిపోయినట్లేనంటున్నారు జ్యోతిష్యులు.

** ఇదేవిధంగా సముద్రం, వికసిస్తున్న పూలు, యువతితో కలవడం లేదా చూడటం, ప్రసాదం లభించినట్లు కలవస్తే, ఆశీర్వాదం తీసుకున్నట్లు, పుస్తకం చదువుతున్నట్లు, పాము కరవడం, ఆలయాన్ని చూడటం, నగలు దొరకడంలాటికలలు ఇంకా ఏనుగుపై సవారీ చేయడం, పండ్లు తీసుకున్నట్లు కలలు రావడం, అలాగే శరీరంపై పేడ పూసినట్లు కనపడటంలాంటి కలలు వస్తే ధనలాభం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.

** అలాగే మీ కలలో రక్తం చూడటం, స్తనపానం చేస్తున్నట్లు, మద్యం, నూనె సేవిస్తున్నట్లు, మిఠాయి తినడం, వివాహం జరిగినట్లు, పోలీసును కలలో చూడటం లాంటివి, తమరు గుండు గీయించుకున్నట్లు కలలో కనపడితే మరణ వార్త వినాల్సి వస్తుంది.

విధవకు గెడ్డం పెరగడంలాంటి దృశ్యం కలలో కనపడితే...పునర్వివాహం జరిగే సంకేతాలున్నాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. వివాహితులు తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడటం కలలో చూస్తే వారితో వియోగం లేదా సంబంధాలు బెడిసికొట్టే సందర్భాలకు సంకేతాలుగా భావించాలంటున్నారు జ్యోతిష్యులు.

Popular Posts