Followers

Friday 15 March 2013

హిందువులకు పవిత్ర గ్రంథాలు ఎందుకు ఎక్కువ

.ఇతర మతాల్లో ఒక్కడే ప్రవక్త. మతానికంతా కలిపి ఆయనొక్కడే గొప్పవాడు. ఎన్ని శతాబ్దాలు పోయినా, సహస్రాబ్దాలు పోయినా ఇతరులెవ్వఱూ ఆయనకు సాటిరారు, రాకూడదు అని శిలాశాసనం. ఆ విధంగా ఆ మతాల్లో గొప్పవారు జన్మించినా వారి గొప్పతనాన్ని జనం గుర్తించకుండా, గౌరవించకుండా ఉండేలా కట్టడి చేయబడ్డారు. ఎవఱైనా ఆ ప్రవక్త కంటే ఫలానా ఆయన గొప్పవాడని పలికితే అతన్ని క్రూరంగా శిక్షిస్తారు. చంపేయడం సర్వసాధారణం. మన మతంలో ఇలాంటి కఠోర శిలాశాసనాలూ, కట్టళ్లూ లేవు. ఇది ఆలోచనాస్వేచ్ఛనూ, ఆధ్యాత్మిక అన్వేషణనూ ప్రోత్సహించే మతం. అందుచేత ఏ మహాత్ముడు జన్మించి ఏది చెప్పినా, ఏది వ్రాసినా అది మనకు శిరోధార్యమే, ఆయన మహాత్ముడనే నమ్మకం మనలో ఉన్నంతవఱకు ! అందుకే శ్రీ వివేకానందస్వాములవారు తన గురువైన శ్రీరామకృష్ణ పరమహంసని వేదఋషుల కంటే గొప్పవాడని అన్నప్పుడు ఆ మాటను మనం ఆమోదించామే తప్ప కోపగించుకోలేదు. హిందువులక్కూడా అత్యున్నత గ్రంథాలున్నాయి. అవే వేదాలు. ఏ హిందూ సంప్రదాయమైనా, శాఖ అయినా, గ్రంథమైనా వేదాల్ని అనుసరించి ఉంటేనే మనమైనా వాటిని ఆమోదిస్తాం. వేదవిరుద్ధమైన ఏ గురువూ, పుస్తకమూ మనకు ఆమోదయోగ్యం కావు. కనుక “మనకున్నది కూడా నిజానికి ఒక్క పవిత్ర గ్రంథమే” అని చెప్పక తప్పదు

Popular Posts