Followers

Tuesday, 19 March 2013

నవ విధ భక్తులు.(ways of bhakthi is 9)

శ్లోll శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, పాద సేవనం,
అర్చనం వందనం ధ్యానం, సఖ్య మాత్మ నివేదనం.
ఆ.వెః-
విష్ణు కథలు వినుట, విష్ణుఁ గీర్తించుట,
స్మరణ, సేవ, యర్చన, రహిఁ గొల్పు
వందనంబు, ధ్యాన, సుందర స్నేహంబు
నాత్మనొసగుట, హరి నరయు గతులు.
భావముః-
విష్ణు కథా శ్రవణము,  విష్ణు కీర్తనము,  విష్ణు స్మరణము, విష్ణు పాద సేవనము, విష్ణు అర్చనము, విష్ణువుకు వందనము, విష్ణు ధ్యానము, విష్ణ్వుతో స్నేహము, విష్ణువుకు ఆత్మ నివేదనము అను తొమ్మిదిన్నీ నవ విధ భక్తులనబడును. ఇందేది అనుసరించియైనను విష్ణు సాన్నిధ్యము పొంద సాధ్యము
(1)శ్రవణం  --> ఆదిశేషుడు,

(2) కీర్తనం --> అన్నమాచార్యుడు, 

(3) విష్ణోః స్మరణం --> నారదుడు,

(4) పాద సేవనం --> హనుమంతుడు, 

(5) అర్చనం  --> సుదాముడు (కుచేలుడు),

(6) వందనం --> గరుత్మంతుడు, 

(7) దాస్యం  --> లక్ష్మణుడు, 

(8) సఖ్యం --> మైత్రేయుడు, 

(9) ఆత్మ నివేదనం --> గోపికలు.

Popular Posts