1. విగ్రహమునకు చందనం పూయుట - ఇది
పృధివీతత్వం. ధూపముకూడా పృధివీతత్వమే.
2. తీర్థం - జలతత్వానికి
3. దీపారాధన - అగ్నితత్వానికి
4. వింజామరం వీచుట - వాయుతత్వానికి
5. గంట మ్రోగించుట - ఆకాశతత్వానికి - అనగా
పంచభూతముల సమగ్ర సారాన్ని భగవంతునకు
నివేదిస్తారు.
జలము స్థానముగా గలవాడు. కనుక నారాయణుడు.
అనగా నారాయణుడు రహాశ్రయ భూతుడు. ‘‘రసోవైసలి’’
అని చెప్పుటవలన నారాయణ రూపుడైన శ్రీకృష్ణుడు
కూడా రసస్వరూపుడు. గోపికా వస్త్రాపహరణము,
కాళీయమర్దన్, బృందావనంలో రాసలీల జరిపించి
అందరికి ఆనందము కలిగించాడు.
కృష్ణునికి ఇద్దరు తండ్రులు, ఇద్దరు తల్లులు పేర్లు
వర్తించాయి. వాసుదేవుడు, దేవకీనందనుడు,
నందనందనుడు, యశోదానందనుడు.