Followers

Tuesday, 20 August 2013

కాలు బెణికినప్పుడు.............



కాలు బెణికినప్పుడు అక్కడి మృదువైన కండరాలు 

దెబ్బతింటాయి. పైకి గాయం లేకుండా దెబ్బ లోపల 

తగిలినప్పుడు దానికి ప్రథమచికిత్స చేయడానికి ‘రైస్’ 

అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. 

1.ఆర్... అంటే రెస్ట్. అంటే కాలికి విశ్రాంతి ఇవ్వాలి. 

బెణికిన కాలికి 24 - 48 గంటల పాటు విశ్రాంతి 

ఇవ్వాలన్నమాట. 

2.ఐ... ఐస్ ప్యాక్ పెట్టడం. అయితే ఐస్ క్యూబ్స్‌ను 

గాయమైన చోట నేరుగా అద్దకూడదు. ఐస్ ఉన్న నీళ్లలో 

గుడ్డ ముంచి బెణికిన చోట అద్దాలి.


3.సి... అంటే కంప్రెషన్... అంటే బెణికిన ప్రాంతాన్ని 

కదలకుండా ఉంచాలి. ఇందుకోసం క్రాప్ బ్యాండేజ్‌తో కట్టు 

కట్టవచ్చు. అది అందుబాటులో లేకపోతే గుడ్డతోనైనా 

కట్టవచ్చు.

4.ఈ... అంటే ఎలివేషన్. అంటే బెణికిన వారిని 

పడుకోబెట్టినప్పుడు వాళ్ల కాలు... గుండె కంటే కాస్త పైన 

ఉండేలా చూడాలి. ఇందుకోసం కాలికింద దిండు పెట్టడం 

వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు.

Popular Posts