ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, స్థ్యైర్యం, విజయం,
,
అభయం, శౌర్యం, సౌభాగ్యం, సాహసం, విద్య, వివేకం,
ధనం, ధాన్యం, సంపద, బంగారం, వెండి, ఆభరణాలు,
వస్తువులు, వాహనాలు, ఆయుధాలు, పశువులు,
పుత్రపౌత్రాదులు, కీర్తిప్రతిష్ఠలు, సుఖసంతోషాలు
మొదలైనవన్నీ సంపదలే. వీటన్నింటికీ పొందాలంటే
మహాలక్ష్మిని పూజించాలని పురోహితులు అంటున్నారు.
ఇంకా వరలక్ష్మీ వ్రతం రోజున భక్తులు ఉపవాసాలు చేసి
మాంసాహారాన్ని తినకుండా, ఒంటిపూట భోజనం చేసి..
శుచిగా పూజలు చేసే వారికి అష్టైశ్వర్యాలు
చేకూరుతాయని విశ్వాసం.