Followers

Tuesday, 13 August 2013

నడుము నొప్పికి అద్భుత వైద్యం ఆయుర్వేదం

వేరు వేరు సమస్యలుగా కనపడుతున్న, వెన్నునొప్పి, కాళ్లనొప్పి, లైంగిక సమస్యల వెనక ఉన్న వ్యాధి మూలం ఒక్కటే. అందువల్ల వాటన్నిటికీ వేరు వేరు డాక్టర్ల వద్దకు వెళ్ల వ లసిన అవసరం లేదు ఒకే ఒక్క ఆయుర్వేద డాక్టర్ మీ సమస్యలన్నిటినీ పరిష్కారం చూపుతారు. వాస్తవానికి వెన్నునొప్పి అనేది వాతం వికృతి (వాత దోషం) వల్ల తలెత్తే సమస్య అయితే వాతం అనేది కేవలం వెన్నెముకకే పరిమితమై ఉండదు.
అది మొత్తం శరీరమంతా వ్యాపించి ఉంటుంది. అందుకే దెబ్బతిన్న డిస్కులకే పరిమితం కాకుండా ఆయుర్వేదం వెన్నెముక మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వాత దోషాల దుష్ప్రభావాలు ఎముకలకు సంబంధించిన అస్థిధాతువును తీవ్రంగా దెబ్బ తీస్తుంది. అయితే వికృతి చెందిన వాతం అస్థిధాతువును దెబ్బ తీసినట్లే, అస్థి ధాతువు క్షీణించినప్పుడు వాత వికృతి జరుగుతుంది.

ఈ రెండూ ఒక దానితో ఒకటి ముడివడిన సమస్యలు. శరీరంలోని ప్రతి కదలికనూ నియంత్రించే ఈ వాతం నాడీ వ్యవ స్థ, కండరాల వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ వీటన్నిటికీ మూల ప్రేరకంగా ఉంటుంది. అయితే వికృతి చెందిన వాతాన్ని సాధారణ స్థాయికి తెస్తే గానీ ఈ వ్యవస్థలన్నీ తిరిగతి సజావుగా పనిచేయవు. అలా కాకుండా డిస్కులకే పరిమితమై వైద్య చికిత్సలు చేస్తే అవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. శస్త్ర చికిత్స తరువాత కూడా మీ పరిస్థితి చక్కబడకపోవడానికి వాతాన్ని నియంత్రించే చికిత్సలేవీ అందించకపోవడమేకారణం.

సర్జరీ ఎందుకు?
వెన్నునొప్పితో వెళితే, ఆధునిక వైద్యులు మొదటగా ఇచ్చేది పెయిన్ కిల్లర్లే. ఇవి తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా ఎక్కువ కాలం వాడితే, తలనొప్పి, కడుపునొప్పి, అల్సర్లు మొదలవుతాయి. మరింత కాలం వాడితే,లివర్ దెబ్బ తినడం, కి డ్నీలు దెబ్బ తినడం లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాదుల బారిన పడే ప్రమాదం ఉంది. అలా అని సర్జరీకి వెళితే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు కావడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం అంత విశేషంగా ఏమీ ఉండదు. సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాల విషయంలో వారు ఇచ్చే గ్యారెంటీ కూడా ఏమీ ఉండదు. కనీసం ఆ ఒక్కక సర్జరీతో అయిపోతుందా అంటే కొద్ది రోజుల్లోనే మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయిన ఒక విషమ స్థితిలో మాత్రమే స ర్జరీని ఎంచుకోవాలి. అంతేగానీ, వెన్నునొప్పి మొదలవ్వగానే సర్జరీకి వెళ్లడం అంటే అది పలు సమస్యల్ని కొని తెచ్చుకోవడమే.

ఆయుర్వేదం ఒక పరిపూర్ణ వైద్యం
రోగి శరీర ప్రకృతిని అనుసరించి వెన్నునొప్పి రావడానికి గల ప్రత్యేక కారణాల్ని ఆయుర్వేదం ముందుగా క నిపెడుతుంది. సమస్యకు అసలు కారణమైన వాత వికృతిని తొలగించే చికిత్సలు మొదలెడతాం. ఆ తరువాత ధాతుక్షయాన్నీ, నరాల వ్యవస్థను నిర్జీవం చేసే మార్గావరోధాన్ని నివారించే చికి త్సలు ఉంటాయి. చికి త్సా క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు అలా వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాల వ్యవస్థను సమస్థితికి తెచ్చే చికిత్సలు ఉంటాయి. ఆ తరువాత నరాల వ్యవస్థను కూడా సమస్థితికి తేవలసి ఉంటుంది. ఆ చికిత్సల్లో భాగంగా మేరు చికిత్సలు, మర్మచికిత్సలు, పంచకర్మ చికిత్సలు ఉంటాయి. అలాగే శరీరంలో జవజీవాలు నింపే రసాయన చికిత్సల ద్వారా లైంగిక సమస్యల్ని తొలగించే వాజీకరణ చికిత్సలు ఉంటాయి. ఇవన్నీ వెన్నునొప్పినే కాదు వెన్ను చుట్టూ ఉండే సర్వ వ్యవస్థలనూ సరిచేస్తాయి. ఫలితంగా వెన్ను వ్యవస్థ స్థిరపడుతుంది. అది మీ జీవిత కాలమంతా మీ వెన్నుదన్నుగా నిలబడుతుంది.

డాక్టర్ వర్ధన్
ది కేరళ ఆయుర్వేదిక్ కేర్,
స్పెషాలిటీ, పంచకర్మ సెంటర్, స్కైలేన్ థియేటర్ లేన్, బషీర్‌బాగ్, హైదరాబాద్, బ్రాంచీలు: దానవాయి పేట - రాజమండ్రి, ఎన్ ఆర్ పేట- కర్నూలు
ఫోన్: 9866666055, 8686848383

సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల

Popular Posts