దైవారాధన రెండు విధములు
1. ఏ దేని కామ్యార్ధము చేసేసి
2. కేవలం భగవత్ ప్రాప్తి కోసం చేసేది.
అయితే మీరు అడిగే ప్రశ్న ప్రకారం జాతకంలో వుండే దోషాదులు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా దైవారాధన చేయడం అంటే అది కామ్యార్ధం చేయునది.
కేవలం భగవత్ ప్రాప్తి కోసం చేయు పూజా పునస్కారములు ద్వారా ఆనందాన్ని మోక్షాన్ని పొందుతారు. అయితే వేదం కూడా "ఆనందోబ్రహ్మే తి వ్యాజానాత్" అనే తెలియ చేసింది. నిష్కామంగా చేయు పూజలలో భగవంతుడే ప్రధాన లక్ష్యం అవుతారు కావున యిది సాధ్యమే.
అయితే కామ్యంతో చేయు పూజలద్వారా మనకు జాతకంలో వుండే దోషాలు పోతాయా అంటే అది మనం చేసే పూజా స్ధాయిని బట్టి వుంటుంది. మార్కండేయుడు శివారాధన ద్వారా జాతకంలో వున్న అతి తక్కువ ఆయుర్దాయమును పెంచుకున్నాడు. అయితే మనం అంతస్ధాయిలో జపం, పూజ వంటివి చేయగలమా? కానీ చేసినస్ధాయికి తగిన ప్రతిఫలం పొందగలము.
ఉదాహరణకి జాతక రీత్యా ఆరోగ్య సమస్యలు పెరిగే సూచన వున్నది ఆ సమయంలో మనం చేసే పూజా ఫలితం మంచి వైద్యం దొరికిత్వరగా ఉపశమనం పొందే మార్గం చూపడం, వైద్యం ఎంత ఖరీదయినా చేయించుకున్నే ఆర్ధిక సహకారం అందడం, వైద్య సమయంలో మనకు సహకరించే మనుషులు వుండడం, అనారోగ్యాన్ని నిర్భయంగా ఎదుర్కొనే మనోధైర్యం వంటివి మనం పొందగలుగుతాము. ఇవన్నీ దైవారాధన ద్వారా రావాలసినవే. రోగం రావడం మాత్రం ఆగకపోవచ్చు అయితే మార్కండేయుని స్ధాయితో పూజాదులు చేస్తే రోగము రాకుండా తప్పకోగలము అనేది మనకు పూరాణాల ఆధారం.