Followers

Wednesday 21 August 2013

‘గణేషా’ నీ ఇమేజ్‌కు దెబ్బడిపోతోంది..!

ఇంకొన్ని రోజులు పోతే.. ఈ పండుగ నాకొద్దు బాబోయ్ అంటూ వినాయకుడు పారిపోతాడేమో.. వినాయక చవితి వచ్చిందంటే పర్యావరణం కలుషితమైపోతుంది.. 'మట్టి" స్థానంలో 'ప్లాస్టర్ ఆప్ పారిసు" పదార్థాన్ని వినియోగించి సుముద్రాలతో పాటు, నీటి కుంటలను నాశనం చేస్తున్నారు. శాస్త్రం ప్రకారం బంగారం, వెండి లేదా మట్టితో చవితినాడు వినాయకుడిని పూజించాల్సి ఉంది. మధ్యలో ఈ ఫ్లాస్టర్ ఆఫ్ పారిసు ఎక్కడ నుంచి వచ్చింది. పర్యావరణ పరీరక్షణకు గండికొడుతూ పలువురు వ్యాపారులు తక్కువ ఖర్చులో తయారయ్యే 'ప్లాస్టర్ ఆప్ పారిసు" వినాయకులను రూపొందిస్తున్నారు.

బొమ్మలు తయారీలో వినియోగిస్తున్న రసాయనాలు, రంగులు జల సంపదకు హాని కలిగిస్తున్నాయి. పండుగ మోజలో పడిని జనం, పర్యావరణానికి తాము కలిగిస్తున్న చేటును ఆదమరిచి, గుడ్డిగా 'ప్లాస్టరు ఆఫ్ పారిసు" విగ్రహాలను కోనుగోలుచేసి ఘనంగా నిమజ్జనం చేస్తున్నారు. నాణానికి రెండు వైపులు గుర్తులు ఉన్నట్లు, సమస్య పరిష్కారానికి పలు నేషనల్ గ్రీన్ కాప్ప్ స్వచ్ఛంద సంస్థలు కృషిచేస్తున్నప్పటికి ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రావటం లేదు.

 అందరూ.. అందరే అన్న ఛందాన 'ఈ ఒక్క సారే నంటూ, కాలుష్యాన్ని పెంచి పెద్దదాన్ని చేస్తున్నారు".. సమాజాభివృద్ధికి దోహదపడాల్సిన రాజకీయ నాయకులే పెద్ద పెద్ద పందిళ్లను ఏర్పాటు చేసి ప్లాస్టర్ ఆప్ పారిసు"తో తయారు చేయబడిన 100ల అడుగల భారీ వినాయకులను నిలబెడుతున్నారు. అయితే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లోని పలు కాలనీ వాసులు పర్యావరణానికి మేలు చేసే విధంగా మట్టి వినాయకులను రూపొందించి స్పూర్తిగా నిలుస్తున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనిని వీరు చేస్తున్నందుకు గర్వ పడాలి వీరిని స్పూర్తిగా తీసుకుని వారి బాటలోనే మనం కూడా అడుగులు వేయాలి

 ''మట్టి విగ్రహాలనే వాడదాం, ఎదుటవారిని వాడమని చెబుదాం"". 

Popular Posts