Followers

Friday 9 August 2013

కోమల హస్తాలకు చిట్కాలు

బట్టలు ఉతికేటప్పుడు సోప్స్ డిటర్జంట్ ల మూలంగా 
చేతులకి   హాని కలిగే అవకాశం ఉంది . హాని 
కలగకుండా ఉండాలంటే చేతులకి రక్షణగా గ్లోవ్స్ 
వాడుకోవడం మంచిది .
గ్లిజరిన్ , ఆలివ్ నూనె లేక నిమ్మరసం కలిపి చేతులకి రాసుకుంటూ  ఉంటే చేతులు మృదువుగా 
ఉంటాయి.
పాత్రలు తోమే సమయంలో బంగారం ఉంగరం వ్రేలిన ఉంచుకోరాదు . ఉంచిన అది అరుగుతుంది . 
ముత్యమైనా షేపులే మారగలవు  . బగారపు గాజుల్ని మణికట్టు సమీపంలో గుడ్డ కట్టుకోవడం వలన 
అరగుదల కాపాడగలం . అంతేకాక మెరుపు ను కాపాడగలిగిన మీ చేతిన అందము పెరగగలదు.
మోచేతుల వద్ద నలుపుగాని ఉంటే నిమ్మ చెక్క రుద్దిన నలుపు పోతుంది.
రాత్రి పడుకోబోయే ముందు వాజలేరైన్ కొద్దిగా కార్బాలిక్ యాసిడ్ కలిపి ఆ మిశ్రమం చేతులకి మర్దనా 
చేసిన తెల్లవారేసరికి మీ చేతులు మృదువుగా మల్లెపువులవలె మెత్తగా ఉండగలవు.
ఎక్కువ వేడి గలవి కానీ, అతి శీతల పదార్దములు కానీ చేతులతో తాకటం మంచిది కాదు.
బట్టలు ఉతకటం పూర్తియ్యాక వెంటనే చేతులకి వెనిగర్ గానీ , నిమ్మరసం గానీ కలిపి నీటితో 
శుభ్రపరుచుకోవాలి . ఎవైన మరకలు అంటినా పోతాయి.
రోమాలు పెరిగే దిశలో కోల్డ్ వాక్స్ రాసి మందపాటి గుడ్డతో రోమాలు పెరిగే దిశకు వ్యతిరేక దిశలో గట్టిగా 
రుద్దిన వెంట్రుకలు ఉడివస్తాయి . తర్వాత కోల్డ్ క్రీంతో మాలిష్ చేసుకోవడం మంచిది.
మీ చేతులను 5  నిముషాలు  గోరువెచ్చని నీటిలో ఉంచిన మృదువుగా , నాజూకుగా ఉంటాయి .
కొద్దిగా నిమ్మరసం కొంచెం పంచదార కలిపి చేతులకి పట్టించి మర్దనా చేసుకుంటే  చేతులకుండే 
బిరుసుతనం  పోతుంది.

Popular Posts