Followers

Friday 9 August 2013

అరటిపండుతో సౌందర్య చిట్కాలు (Beauty tips with banana)

ఆటల్లో అరటిపండు అంటూ దాన్ని తేలిగ్గా తీసుకుంటాం 
కానీ , బ్యుటీషియన్లు మాత్రం దాన్ని అంత తేలిగ్గా 
తీసిపారేయడం లేదు . ముఖ సౌందర్యాన్ని , చర్మ 
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అరటిపండు  ఓ మంచి 
సాధనమని నిపుణులు చెబుతున్నారు . అరటిపండుతో 
 సౌందర్య పరిరక్షణ ఎలాగో చూద్దాం…


బాగా మిగల మగ్గిన అరటిపండును గుజ్జుగా చేసి అందులో రెండు స్పూన్లు గట్టి పెరుగు లేదా ఓట్స్ పొడి 

వేసి బాగా కలిపి . ముఖం , మెడకు పట్టించి బాగా ఎండిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి 

. ఈ చిట్కా వలన ముఖ సౌందర్యం రెట్టింపు  అవుతుంది .

bananaఅరటిపండు  గుజ్జులో స్పూను తేనె , లేదా స్పూను పచ్చి పాలు వేసి కలిపి ముఖానికి పట్టించి 

బాగా ఆరనివ్వాలి . అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి . ఈ విధంగా 20 నుండి  

25 రోజుల పాటు చేసినట్టయితే ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది .

పొడి చర్మం వారు ఈ విధంగా చేయాలి . అరటిపండు గుజ్జులో గుడ్డు లోని తెల్ల సోన , ఒక టేబుల్ స్పూన్  

క్రీమ్ జత చేసి బాగా కలిపి ముఖం , మెడకు పట్టించి ఆరనివ్వాలి . అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం 

చేసుకోవాలి . ఈ విధంగా వారంలో కనీసం మూడు సార్లు చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు .

అరటిపండు  గుజ్జులో టేబుల్ స్పూను నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరనిచ్చి అనంతరం 

గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి .

ముఖం మీద మచ్చలతో భాదపడే వారు ఈ విధంగా చేసి చుడండి . అరటి పండు తొక్కతో మచ్చలున్న 

ప్రదేశంలో సున్నితంగా రుద్ది ఓ పావు గంట సేపు ఆరనివ్వాలి . అనంతరం ముఖాని శుభ్రంగా కడుక్కోవాలి 

.రోజు మొత్తం మీద వీలయినన్ని సార్లు ఈ విధంగా చేసినట్టయితే మచ్చలు క్రమేపీ మాయం అవుతాయి .

పళ్ళు పసుపు పచ్చగా మారుతుంటే ఈ విధంగా చేసి చూడండి . అరటి తొక్కతో పళ్ళ మీద బాగా రుద్దాలి 

.రోజులో కనీసం రెండు సార్లు ఈ విధంగా చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొదవచ్చు.

Popular Posts