విచక్షణారహితంగా చెట్లను నరికి వేస్తున్న
మనిషితో ఓ చెట్టు చేసుకున్న విన్నపం
ఓ మనిషీ!
నీ ఇంటికి చలిలో వెచ్చదనాన్ని ఇచ్చేది నేనే
నీ ఒంటిని ఎండా వేడిమి నుంచి కాపాడే నీడను నేనే
నీ ఇంటి తలుపు, కిటికీ,పై కప్పు నేనే
నీవు కూర్చొనే కుర్చీ, పడుకొనే మంచం నేనే
పయనించే పడవనూ నేనే
నీ వంటకు మంటనిచ్చే అగ్గిపుల్లను నేనే
వంట చెరకునూ నేనే
నీ పశువులకు మేతను, దున్నే నాగలినీ నేనే
రాసే కాగితమూ నేనే
నీవు ఆరగించే ఆహారమూ, ఆస్వాదించే అందమూ నేనే
నీ రోగాలకు మందు, వ్యాపారాలకూ పెట్టుబడీ నేనే
నీ కవితలకు స్ఫూర్తినీ, నీ చిత్రాలకు నమూనానూ నేనే
నీవు పుట్టినప్పుడు ఊయలను, గిట్టినప్పుడు పాడెనూ
నేనే
నన్ను కాపాడుకో! బతికినన్నాళ్లు నువ్వు సుఖంగా
ఉంటావు!
ఓ మనిషీ! నీకు ఇదే నా విన్నపం…