Followers

Saturday, 17 August 2013

శివుడు సర్వ విద్యలకు. అస్త్ర, శస్త్రములకు అధిపతియా?


అవును. ఈ విషయం రామాయణంలో కూడా వున్నది. వశిష్ఠ ఆశ్రమంలో ఒకనాడు విశ్వామిత్రుడు (రాజుగా వున్న సమయంలో) తను, తన సేనతో సహా విందు ఆరగించి, ఆ విందు ఏర్పాటుచేసిన "సురభి" అనే మహిమకల ధేనువును బలవంతంగా అయినా తీసుకుపోవలెను అనే కోరికతో బల ప్రదర్శన చేసి ఆ సురభి చేతిలో పరజయం పొందిన వాడై ఆశ్రమం నుండి వెళ్ళెను. విశ్వామిత్రుడు వశిష్ఠుని ఎదిరించేందుకుగాను అన్నీ అస్త్రములు పొందాలి; దీని గూర్చి ఎవరిని అర్చించాలి అనే సందేహంలో వుండగా ఆయనకు మహాదేవుడు శివుని అర్చించిన ఎడల సర్వ అస్త్రములు లభింపగలవు అనే ఉద్దేశ్యం కలిగి హిమాలయములకు వెళ్ళి శివుని అర్చించి అన్నీ అస్త్రములు శస్త్రములు సంపాదించెను. దీనిని బట్టి సర్వ అస్త్రశత్రములకు అధిపతి శివుడే అని తెలింది కదా? యిక విద్యల విషయానికి వస్తే భారతీయ సాంప్రదాయంతో వేదముల నుండి శాస్త్రములు ఉద్భవించినాయి. వేదశాస్త్రములే విద్యలు. "వేదశ్శివః శివో వేదేః"అని ప్రమాణమే వున్నది కదా? దీనిని బట్టి సర్వవిద్యలకు శివుడే అధిపతి. విద్యాయోగం కలగాలి అంటే శివారాధన చేయాలి.

Popular Posts