వయస్సు పైబడిన వారిలో మోకాలి నొప్పి సమస్య సాధారణంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా స్ర్తీలలో ఈ సమస్య చాలా ఎక్కువ. కాల్షియం లోపించడం, ఎక్కువ కూర్చుని పనిచేయడం, కీళ్ళవాతం తదితర కారణాల వల్ల మోకాలు నొప్పి మొదలవుతుంది. అయితే మోకాలి మార్పిడి శస్త్ర చిిత్స అందరికీ అవరసం రాకపోవచ్చు. పూర్తిగా కాలు కదల్చలేని స్థితిలో వున్న వారికి, ఐదు నిమిషాల పాటు కూడా నడవలేకపోతున్న వారికి ఆపరేషన్ అవసరమవుతుంది. వీరికి కూడా ముందుగా ఫిజియోథెరపీ చేయించి అప్పటికీ పరిస్థితి అలాగే వుంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. మన శరీరాన్ని మోకాళ్ళ మీద మోయడానికి, ముందుకీ వెనక్కీ వంచడానికి, కాళ్ళు, చేతులు చాచడానికి, కూర్చోవడానికి అన్నింటికీ కీళ్ళే ప్రధానం.రెండు ఎముకలు కలిసేచోటును కీలు అంటారు. ప్రతి కీలు చుట్టూ కార్టిలేజ్ పొర ఉంటుంది. ఎముక చుట్టూ ఉండే ఈకార్టిలేజ్ పొర అరిగాక మళ్ళీ కణాలు పుట్టవు. అవదుకే గతంలో కీల్ళనొప్పి వస్తేదాన్ని ఎప్పటికి తగ్గని నొప్పిగా భావించేవారు. ఇలా వయస్సుతో పాటు కీళ్ళు అరిగిపోవడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు.
చికిత్స ప్రక్రియలు
కొన్ని రకాల కీళ్ళ అరుగుదలలో వచ్చే నొప్పిని మందులతో తగ్గిస్తారు. అయితే కీళ్ళు అరగడం వల్ల వచ్చే నొప్పికి మందులతో శాశ్వత ప్రయోజనం ఉండదు. ఇన్ఫెక్షన్ పోవడం వల్ల వచ్చే పోస్ట్ ఇన్ప్క్టివ్ ఆర్థరైటిస్ మినహా మిగతా అన్ని రకాల ఆర్థరైటిస్లకు కీళ్ళ మార్పిడి ఒక్కటే సరైన మార్గం. మోకాలులో జాయింట్స్ రీప్లేస్మెంట్ చికిత్స ద్వారా పూర్తి ఉపశమనం కలుగుతుంది.
ఆర్థరైటిస్ లక్షణాలుఆర్థరైటిస్ తొలి దశలో కాళ్ళు బరువెక్కినట్లుగా, బిగుసుకుపోయినట్లుగా ఉంటాయి. ముడుచుకోవడానికి వీల్లేనట్లుగా అనిపిస్తాయి. ఆర్థరైటిస్ ఇది మొదటి సంేతం. సాధారణంగా ఈ సమస్యలు యాభై ఏళ్ళు దాటాకే ఎక్కువగా కనిపిస్తాయి. మెట్లు దిగేటప్పుడు తట్టుకోలేనంత బాధ ఉంటుంది. కీళ్ళ దగ్గర వాపు వస్తుంది. కింద కూర్చొని లేచేటప్పుడు విపరీతమైన నొప్పి, ఎముకలు రాసుకుంటున్నట్లుగా శబ్దం వస్తుంది. దీనివల్ల లిగమెంట్స్ దెబ్బ తింటాయి. దాంతో మోకాలు దెబ్బ తింటుంది. ఈ సమస్యలకు మొదట్లో మందులు ఇచ్చినా రెండు మూడు దశల్లో ఉన్నప్పుడు మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స తప్పనిసరి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శరీర బరువును కంట్రోల్లో ఉంచుకుంటూ, స్థూలకాయం రాకుండా చూసుకోవడం, నేలపై మఠం వేసుకొని ఎక్కువగా కూర్చోకుండా చూసుకోవడం, టాయిలెట్లలో కాలు ముడుచుకొని కూర్చునే ఇండియన్ టాయిలెట్స్ కంటే వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, స్ట్రెచింగ్ ఎక్సర్ సైజ్ల వల్ల ఎముక చివరన ఉండే కార్టిలేజ్ దెబ్బతినకుండా ఉంటుంది.
మోకాలి నొప్పి;
మోకాలిలో రెండు ఎముకలు చివరన ఉండే కార్టిలేజ్ మోకాలి చిప్ప వెనుక ఉంటుంది. అలాగే ఎముకలు దగ్గరగా ఉంచడంలో లిగమెంట్ అనే మరో పొర సైతం కీలకంగా ఉంటుంది. తొడను, కాలి ఎముకలను దగ్గరగా కలిపి ఉంచేందుకు ఈ పొర తోడ్పడులతుంది. అలాగే కండరాలు, ఎముకలను పట్టి ఉంచేందుకు టెండన్స్ అనేవి తోడ్పడతాయి. తొడ ఎముక, కాలి ఎముక మధ్యన ఉండే కీళ్ళు (జాయింట్స్) వంగేటప్పుడు లోపలివైపునకు ఒంగితే దాన్ని వాల్గస్ అంటారు. బయటివైపుకు వంగితే దాన్ని వారస్ అంటారు. ఇలా వంగిపోతూ ఉండటం వల్ల కార్టిటేజ్ త్వరగా అరుగుదలకు లోనవుతుంది. దాంతో రెండు ఎముకలు ఒరుసుకుపోయి భరించలేని నొప్పి వస్తుంది.