Followers

Saturday, 31 August 2013

మీరు పోషకాహారం తీసుకుంటున్నారా?


ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం, ఆహార పద్దతులు కూడా ఆరోగ్యకరంగానే ఉండాలి. బిజీ లైఫ్‌స్టైల్‌లో మనం ఏం తింటున్నామో.. ఎపుడు తింటున్నామో కూడా పట్టించుకోం. తినే ఆహారం పట్ల అశ్రద్ధగా ఉంటాం. ఏది పడితే అది తినడం మంచిది కాదు. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయి. న్యూట్రీషియస్ డైట్ ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మన బాధ్యత. అయితే, మీరు తీసుకునేది పోషకాహార
మేనా అనేది ముందుగా మీకు మీరు తెలుసుకోవాలి.

ఇందుకోసం కొన్ని సూచనలు పాటిస్తే చాలు. మీరు ప్రతి రోజూ ఏదో ఒక పండును తింటున్నారా. అల్పాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే, పని ఒత్తిడిని తట్టుకునేందుకు కాస్త రిలీఫ్ అయ్యేందుకు ఇష్టానుసారంగా కాఫీ టీలను తీసుకోరాదు. వేళాపాలా లేకుండా చిరుతిండ్లు తినకూడదు. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి. మీరు ప్రతి రోజూ తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఉప్పు, కారం, నూనె వంటివి మీకు సరిపడా అంటే తక్కువ మోతాదులోనే తీసుకుంటున్నారా లేదా అన్నది తెలుసుకోవాలి. నీరసం, అజీర్తి, రక్తహీనత వంటి సమస్యలను ఎపుడూ ఎదుర్కొంటున్నట్టు గ్రహించారా.

ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తక్షణం వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా పాటించినట్టయితే మీరు పోషకాహారాన్ని తీసుకుంటున్నట్టు నిర్ధారించుకోవచ్చు.

Popular Posts