శ్రీశుక ఉవాచ
తదా దేవర్షిగన్ధర్వా బ్రహ్మేశానపురోగమాః
ముముచుః కుసుమాసారం శంసన్తః కర్మ తద్ధరేః
అప్పుడు దేవతలూ గంధర్వులూ బ్రహ్మా రుద్రుడూ అందరూ పుష్పవృష్టి కురిపించారు.దివ్య దుందుభులు మోగాయి , అప్సరసలు నాట్యం చేసారు.ఈ మొసలి హు హు అనే పేరు గల గంధర్వుడు.దేవల మహర్షి శాపం వలన ముసలిగా పుట్టాడు.ఆ గంధర్వుడు పరమాత్మకు నమస్కరించి, ఉత్తమ కథలు కల పరమాత్మను గానం చేసాడు. పరమాత్మ కటాక్షం చేత ఆయనకు ప్రదక్షిణం చేసి అందరూ చూస్తుండగా తన లోకానికి వెళ్ళాడు. గజేంద్రుడు పరమాత్మ స్పర్శ వలన అజ్ఞ్యానం తొలగిపోయి భగవత్ సరూప్యాన్ని పొందాడు. చత్రుభుజాన్ని పీతాబరధారిత్వాన్ని పొందాడు.ఇంతకు ముందు జన్మలో ఇతను ఇంద్రద్యుమ్నుడనే మహానుభావుడు, ద్రవిడ దేశపు రాజు. మౌన్వ వ్రతాన్ని ధరించి జటలు ధరించి తాపసుడై స్నానం చేసి పరమాత్మను ధ్యానం చేస్తుంటే పరమాత్మ సంకల్పం వలన అగస్త్యుడు శిష్యులతో కలసి అక్కడికి వచ్చాడు.మౌనవ్రతములో భగవత్ ధ్యానములో ఉండుట వలన మునిని చూచి కూడా లేవలేదూ నమస్కరించలేదు.భగవతుని ఆరాధనకంటే విశిష్టమైనది భాగవత ఆరాధన.బుద్ధిలేకుండా ఏనుగులా ప్రవర్తించిననందుకు ఏనుగుగా, స్తబ్ద మతిగా పుట్టమని శపించాడు. అలా శపించి వెళ్ళిపోయాడు. అది విని కూడా ఇంద్రద్య్మ్నుడు లేవలేదు. దాని గురించి భగవంతుని ప్రార్థించలేదు. ఇలా జ్ఞ్యాక శక్తి ఉండే అవకాశం లేని ఏనుగు జాతిలో పుట్టి కూడా పరమాత్మని ఆరాధించినవాడు కాబట్టి పూర్వ జన్మ జ్ఞ్యానం కలిగి మోక్షాన్ని పొందాడు. ఇలా స్వామి మోక్షాన్నిచ్చి పరమాత్మ తన లోకానికి తన భవనానికి, అందరిచేతా గానం చేయబడుతూ వెళ్ళాడు
నేదుర్దున్దుభయో దివ్యా గన్ధర్వా ననృతుర్జగుః
ఋషయశ్చారణాః సిద్ధాస్తుష్టువుః పురుషోత్తమమ్
అప్పుడు దేవతలూ గంధర్వులూ బ్రహ్మా రుద్రుడూ అందరూ పుష్పవృష్టి కురిపించారు.దివ్య దుందుభులు మోగాయి , అప్సరసలు నాట్యం చేసారు.
యోऽసౌ గ్రాహః స వై సద్యః పరమాశ్చర్యరూపధృక్
ముక్తో దేవలశాపేన హూహూర్గన్ధర్వసత్తమః
ఈ మొసలి హు హు అనే పేరు గల గంధర్వుడు.దేవల మహర్షి శాపం వలన ముసలిగా పుట్టాడు.
ప్రణమ్య శిరసాధీశముత్తమశ్లోకమవ్యయమ్
అగాయత యశోధామ కీర్తన్యగుణసత్కథమ్
ఆ గంధర్వుడు పరమాత్మకు నమస్కరించి, ఉత్తమ కథలు కల పరమాత్మను గానం చేసాడు.
సోऽనుకమ్పిత ఈశేన పరిక్రమ్య ప్రణమ్య తమ్
లోకస్య పశ్యతో లోకం స్వమగాన్ముక్తకిల్బిషః
పరమాత్మ కటాక్షం చేత ఆయనకు ప్రదక్షిణం చేసి అందరూ చూస్తుండగా తన లోకానికి వెళ్ళాడు.
గజేన్ద్రో భగవత్స్పర్శాద్విముక్తోऽజ్ఞానబన్ధనాత్
ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః
గజేంద్రుడు పరమాత్మ స్పర్శ వలన అజ్ఞ్యానం తొలగిపోయి భగవత్ సరూప్యాన్ని పొందాడు. చత్రుభుజాన్ని పీతాబరధారిత్వాన్ని పొందాడు.
స వై పూర్వమభూద్రాజా పాణ్డ్యో ద్రవిడసత్తమః
ఇన్ద్రద్యుమ్న ఇతి ఖ్యాతో విష్ణువ్రతపరాయణః
ఇంతకు ముందు జన్మలో ఇతను ఇంద్రద్యుమ్నుడనే మహానుభావుడు, ద్రవిడ దేశపు రాజు. మౌన వ్రతాన్ని ధరించి జటలు ధరించి తాపసుడై స్నానం చేసి పరమాత్మను ధ్యానం చేస్తుంటే
స ఏకదారాధనకాల ఆత్మవాన్గృహీతమౌనవ్రత ఈశ్వరం హరిమ్
జటాధరస్తాపస ఆప్లుతోऽచ్యుతం సమర్చయామాస కులాచలాశ్రమః
యదృచ్ఛయా తత్ర మహాయశా మునిః సమాగమచ్ఛిష్యగణైః పరిశ్రితః
తం వీక్ష్య తూష్ణీమకృతార్హణాదికం రహస్యుపాసీనమృషిశ్చుకోప హ
పరమాత్మ సంకల్పం వలన అగస్త్యుడు శిష్యులతో కలసి అక్కడికి వచ్చాడు.మౌనవ్రతములో భగవత్ ధ్యానములో ఉండుట వలన మునిని చూచి కూడా లేవలేదూ నమస్కరించలేదు.
తస్మా ఇమం శాపమదాదసాధురయం దురాత్మాకృతబుద్ధిరద్య
విప్రావమన్తా విశతాం తమిస్రం యథా గజః స్తబ్ధమతిః స ఏవ
భగవతుని ఆరాధనకంటే విశిష్టమైనది భాగవత ఆరాధన.బుద్ధిలేకుండా ఏనుగులా ప్రవర్తించిననందుకు ఏనుగుగా, స్తబ్ద మతిగా పుట్టమని శపించాడు. అలా శపించి వెళ్ళిపోయాడు.
అది విని కూడా ఇంద్రద్య్మ్నుడు లేవలేదు. దాని గురించి భగవంతుని ప్రార్థించలేదు. ఇలా జ్ఞ్యాక శక్తి ఉండే అవకాశం లేని ఏనుగు జాతిలో పుట్టి కూడా పరమాత్మని ఆరాధించినవాడు కాబట్టి పూర్వ జన్మ జ్ఞ్యానం కలిగి మోక్షాన్ని పొందాడు. ఇలా స్వామి మోక్షాన్నిచ్చి పరమాత్మ తన లోకానికి తన భవనానికి, అందరిచేతా గానం చేయబడుతూ వెళ్ళాడు
శ్రీశుక ఉవాచ
ఏవం శప్త్వా గతోऽగస్త్యో భగవాన్నృప సానుగః
ఇన్ద్రద్యుమ్నోऽపి రాజర్షిర్దిష్టం తదుపధారయన్
నీవడింగినదంతా గజేంద్ర మోక్షాన్నీ పరమత్మ ప్రభావాన్నీ చెప్పాను.స్వర్గాన్నీ కీర్తినీ ఇచ్చేదీ కలిదోషాలను పోగొట్టేదీ దుస్స్వప్నాలను పోగొట్టేది, శ్రేయస్సుకోరే వారూ బ్రాహ్మణోత్తములూ పరిశుద్ధులూ పొద్దున్నే లేచి దుస్స్వప్నములు తొలగడానికి పారాయణ చేస్తారు. అందరూ చూస్తుండగా పరమాత్మ గజేంద్రునితో ఇలా మాట్లాడాడు.
ఆపన్నః కౌఞ్జరీం యోనిమాత్మస్మృతివినాశినీమ్
హర్యర్చనానుభావేన యద్గజత్వేऽప్యనుస్మృతిః
ఏవం విమోక్ష్య గజయూథపమబ్జనాభస్
తేనాపి పార్షదగతిం గమితేన యుక్తః
గన్ధర్వసిద్ధవిబుధైరుపగీయమాన
కర్మాద్భుతం స్వభవనం గరుడాసనోऽగాత్
ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణమ్
స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుఃస్వప్ననాశం కురువర్య శృణ్వతామ్
యథానుకీర్తయన్త్యేతచ్ఛ్రేయస్కామా ద్విజాతయః
శుచయః ప్రాతరుత్థాయ దుఃస్వప్నాద్యుపశాన్తయే
ఇదమాహ హరిః ప్రీతో గజేన్ద్రం కురుసత్తమ
శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః
శ్రీభగవానువాచ
యే మాం త్వాం చ సరశ్చేదం గిరికన్దరకాననమ్
వేత్రకీచకవేణూనాం గుల్మాని సురపాదపాన్
శృఙ్గాణీమాని ధిష్ణ్యాని బ్రహ్మణో మే శివస్య చ
క్షీరోదం మే ప్రియం ధామ శ్వేతద్వీపం చ భాస్వరమ్
శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ
సుదర్శనం పాఞ్చజన్యం సుపర్ణం పతగేశ్వరమ్
శేషం చ మత్కలాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయామ్
బ్రహ్మాణం నారదమృషిం భవం ప్రహ్రాదమేవ చ
మత్స్యకూర్మవరాహాద్యైరవతారైః కృతాని మే
కర్మాణ్యనన్తపుణ్యాని సూర్యం సోమం హుతాశనమ్
ప్రణవం సత్యమవ్యక్తం గోవిప్రాన్ధర్మమవ్యయమ్
దాక్షాయణీర్ధర్మపత్నీః సోమకశ్యపయోరపి
గఙ్గాం సరస్వతీం నన్దాం కాలిన్దీం సితవారణమ్
ధ్రువం బ్రహ్మఋషీన్సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్
ఉత్థాయాపరరాత్రాన్తే ప్రయతాః సుసమాహితాః
స్మరన్తి మమ రూపాణి ముచ్యన్తే తేऽంహసోऽఖిలాత్
యే మాం స్తువన్త్యనేనాఙ్గ ప్రతిబుధ్య నిశాత్యయే
తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విపులాం గతిమ్
సంతోషించిన ప్రమాత్మ గజేంద్రునితో ప్రాణులందరూ వింటూ ఉండగా, "నిన్నూ నన్ను ఈ సరసూనూ చెట్లనూ గుట్టలనూ శిఖరాలనూ ఋషుల ఆశ్రమాలనూ బ్రహ్మాది లోకాలనూ నా ఆయుధాలనూ వనమాల గరుడుడూ లక్ష్మీ దేవి నారదున్నీ శివున్నీ నా అవతారాలనూ సూర్యుడినీ అగ్నిహోత్రున్నీ గోవులనూ విప్రులనూ దక్ష పుత్రికలనూ చంద్రున్నీ కాశ్యపున్నీ గంగనీ ఐరావతాన్నీ ధ్రువున్నీ మొదలైన్వారినీ తెల్లవారే లేచి వినయం కలవారై ఈ నా రూపాలను స్మరిస్తే వారు అఖిల పాపముల నుండీ రక్షించబడతారు.నీవు చేసిన స్తోత్రముతో తెల్లవారు ఝామునే లేచి ఎవరు నన్ను స్తోత్రం చేస్తారో, వారికి చనిపోయిన తరువాత నేను మోక్షం ఇస్తాను
శ్రీశుక ఉవాచ
ఇత్యాదిశ్య హృషీకేశః ప్రాధ్మాయ జలజోత్తమమ్
హర్షయన్విబుధానీకమారురోహ ఖగాధిపమ్
ఇలా గజేంద్రునితో మాట్లాడి శ్రీమన్నారాయణుడు పాంచ జన్యాన్ని పూరించి సకల దేవతా సమూహాన్ని ఆనందింపచేస్తూ గరుత్మంతున్ని అధిరోహించి వైకుంఠానికి వెళ్ళాడు