Followers

Tuesday, 8 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం పదహారవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా
హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్

దైత్యులకు రాజ్యం రావడం వలన, తన పుత్రులు అరణ్యాల  పాలవడం చూసి అదితి బాధపడింది

ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్
నిరుత్సవం నిరానన్దం సమాధేర్విరతశ్చిరాత్

అదితి ఆశ్రమానికి కశ్యపుడు వెళ్ళాడు. (దితి కశ్యపుని వద్దకు వెళ్ళింది రాక్షసులు ఓడినప్పుడు, కాని దేవతలు ఓడినపుడు కశ్యపుడే అదితి వద్దకు వచ్చాడు.దైవం అనుకూలముగా ఉంది అనడానికి ఇది గుర్తు).కశ్యపుడు చాలా కాలం సమాధిలో ఉండి అదితి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఇంటిలో ఏ ఉత్సవమూ ఆనందమూ లేదు


స పత్నీం దీనవదనాం కృతాసనపరిగ్రహః
సభాజితో యథాన్యాయమిదమాహ కురూద్వహ

భర్తను చూసి దీనవదనురాలైన భార్య ఆసనం వేసి కూర్చోపెట్టింది, గౌరవించింది, పూజించింది

అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేऽధునాగతమ్
న ధర్మస్య న లోకస్య మృత్యోశ్ఛన్దానువర్తినః

మంగళ కరురాలా, బ్రాహ్మణులకు ఏమైనా ఆపద కలగలేదు కదా.ధర్మానికి గానీ లోకానికి కానీ ఎటువంటి అమంగళం కలగలేదు కదా.తక్కినవన్నీ మన మాట వింటాయి గానీ మృత్యువు వినదు కదా
మృత్యు వశములో ఉన్న లోకానికే అమంగళం లేదు కదా

అపి వాకుశలం కిఞ్చిద్గృహేషు గృహమేధిని
ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినామ్

మన ఇంటిలో మనకు అకుశలం లేదు కదా.ధర్మార్థకామాలకు ఏ లోటూ లేదు కదా. ఈ ధర్మార్థ కామములనే త్రియోగం యోగనిష్ఠులు కాని వారికి ఆసక్తిని కలిగిస్తాయి.అవి  బాగానే ఉన్నాయి కదా

అపి వాతిథయోऽభ్యేత్య కుటుమ్బాసక్తయా త్వయా
గృహాదపూజితా యాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్

ఇంటి పనులలో ఆసక్తురాలవై ఉండగా ఎవరైన అథితులు వచ్చి గౌరవించబడకుండా వెళ్ళారా. ఇంటికొచ్చిన అథితులకు జలం ఐనా ఇవ్వకుండా ఉండి, వారు వెళ్ళిపోతే అది ఇల్లు కాదు, నక్కల ఇల్లు (శ్మశానాలు).

గృహేషు యేష్వతిథయో నార్చితాః సలిలైరపి
యది నిర్యాన్తి తే నూనం ఫేరురాజగృహోపమాః

అప్యగ్నయస్తు వేలాయాం న హుతా హవిషా సతి
త్వయోద్విగ్నధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్

నేను చాలా కాలం నిన్ను విడిచివెళ్ళానన్న కలతతో ఏ ఏ సమయములో ఏ ఏ అగ్నులను ఏ ఏ హవిస్సులతో ఆరాధించాలో అలా ఆరాధించలేదా. (ఆ రోజులలో గృహిణులు కూడా అగ్ని ఆరాధన చేసేవారు). 
గృహమేధి (యజమాని) ఏ అగ్ని హోత్రున్ని పూజించి తాను కోరుకున్న ఉత్తమలోకాన్ని చేరతాడో

యత్పూజయా కామదుఘాన్యాతి లోకాన్గృహాన్వితః
బ్రాహ్మణోऽగ్నిశ్చ వై విష్ణోః సర్వదేవాత్మనో ముఖమ్

అది పరమాత్మ ముఖం (నోరు), సకల దేవతల ముఖమూ ఆ బ్రాహ్మణులూ అగ్ని. వచ్చిన అథితులని పూజించాలి, లేదా అగ్నిహోత్రున్ని పూజించాలి.

అపి సర్వే కుశలినస్తవ పుత్రా మనస్విని
లక్షయేऽస్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహమ్

నీ పుత్రులు అందరూ క్షేమముగా ఉన్నారా.నీ లక్షణాలు చూస్తుంటే మనసు బాధపడుతూ ఉన్నట్లు ఉంది.

శ్రీదితిరువాచ
భద్రం ద్విజగవాం బ్రహ్మన్ధర్మస్యాస్య జనస్య చ
త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్గృహా ఇమే

బ్రాహ్మణులకూ గోవులకూ ధర్మానికీ క్షేమమే.ధర్మార్థ కామాలకు గృహమే (గృహస్థాశ్రమమే) ఉత్తమ క్షేత్రము

అగ్నయోऽతిథయో భృత్యా భిక్షవో యే చ లిప్సవః
సర్వం భగవతో బ్రహ్మన్ననుధ్యానాన్న రిష్యతి

మీరు తపస్సులో ఉండి కూడా మమ్ము అప్పుడప్పుడు గుర్తుచేసుకోవడం వలన అగ్నిహోత్రమూ అథితులూ సేవకులూ భిక్షుకులూ అందరూ బాగా ఆదరించబడుతూ ఉన్నారు.ఎవరికీ లోపం జరుగుటలేదు

కో ను మే భగవన్కామో న సమ్పద్యేత మానసః
యస్యా భవాన్ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్ప్రభాషతే

మీరు ప్రజాపతులు.ఇంతటి చక్కని ధర్మాన్ని బోధిస్తూ ఉండగా ఇంక మాకు లోటేమిటి ఉంటుంది. లోకమంతా మీ పిల్లలే

తవైవ మారీచ మనఃశరీరజాః ప్రజా ఇమాః సత్త్వరజస్తమోజుషః
సమో భవాంస్తాస్వసురాదిషు ప్రభో తథాపి భక్తం భజతే మహేశ్వరః

సాత్విక తామస సంతానం అందరూ నీ పిల్లలే. సంకల్పముతో కొందరూ శరీరముతో కొందరూ పుట్టారు. నీకు వారూ వీరూ అందరూ సమానమే.
అందరియందూ సమానముగా ఉన్నా, భగవంతుడూ, మీవంటి పెద్దలూ కాస్త సేవించినవారి మీద ఎక్కువ ప్రీతి కలిగి ఉంటారు

తస్మాదీశ భజన్త్యా మే శ్రేయశ్చిన్తయ సువ్రత
హృతశ్రియో హృతస్థానాన్సపత్నైః పాహి నః ప్రభో

నిన్ను సేవిస్తున్న నాకు శ్రేయస్సు కలిగేలా చూడండి. శత్రువుల చేత సంపదా అధికారం రెండూ కోల్పోయిన నాపిల్లలను దయతో చూడు. శత్రువులచేత వెళ్ళగొట్టబడిన నా పిల్లలలను చూసిబాధపడుతున్నాను. వారికి నిలువ నీడ కూడా లేదు. సంపదా శాస్కత్వం స్థానం కీర్తినీ నాలిగింటినీ శత్రువులు అపహరించారు. ఆనాలుగూ నా పిల్లలకు కలిగేలా చూసి మాకు కళ్యాణాన్ని కలిగించడి

పరైర్వివాసితా సాహం మగ్నా వ్యసనసాగరే
ఐశ్వర్యం శ్రీర్యశః స్థానం హృతాని ప్రబలైర్మమ

యథా తాని పునః సాధో ప్రపద్యేరన్మమాత్మజాః
తథా విధేహి కల్యాణం ధియా కల్యాణకృత్తమ

శ్రీశుక ఉవాచ
ఏవమభ్యర్థితోऽదిత్యా కస్తామాహ స్మయన్నివ
అహో మాయాబలం విష్ణోః స్నేహబద్ధమిదం జగత్

ఇలా అడిగితే ఆశ్చర్యముతో నవ్వి ఇలా అన్నాడు. శ్రీమన్నారాయణుని మాయాబలం చాలాగొప్పది. ప్రపంచమంతా స్నేహముతో బంధించబడినది

క్వ దేహో భౌతికోऽనాత్మా క్వ చాత్మా ప్రకృతేః పరః
కస్య కే పతిపుత్రాద్యా మోహ ఏవ హి కారణమ్

ఆత్మకానిది పంచభూతములతో చేయబడిన శరీరమెక్కడా, ప్రకృతికన్నా పరమైన ఆత్మ ఎక్కడ.ఎవరికి ఎవరు భర్తా, ఎవరికి ఎవరు పుత్రులు
ఇవన్నీ మోహముతో అనుకుంటున్నాము

ఉపతిష్ఠస్వ పురుషం భగవన్తం జనార్దనమ్
సర్వభూతగుహావాసం వాసుదేవం జగద్గురుమ్

నీవన్నదానికి నేనేమీ చేయలేను.పరమాత్మను సేవించండి.ఆయన సకల ప్రాణుల హృదయములో ఉండే అంతర్యామి 

స విధాస్యతి తే కామాన్హరిర్దీనానుకమ్పనః
అమోఘా భగవద్భక్తిర్నేతరేతి మతిర్మమ

జగత్గురువు ఐన స్వామిని ఉపాసించు.దీనులను దయచూచే పరమాత్మ నీవు కోరేకోరికలను జరిపిస్తాడు. పరమాత్మయందు భక్తి ఎప్పుడూ సఫలమే అవుతుంది అని నా అభిప్రాయం

శ్రీదితిరువాచ
కేనాహం విధినా బ్రహ్మన్నుపస్థాస్యే జగత్పతిమ్
యథా మే సత్యసఙ్కల్పో విదధ్యాత్స మనోరథమ్

నేను ఏ విధానముతో సత్యసంకల్పుడైన పరమాత్మను ఆరాధించాలి ఉపాసించాలి?

ఆదిశ త్వం ద్విజశ్రేష్ఠ విధిం తదుపధావనమ్
ఆశు తుష్యతి మే దేవః సీదన్త్యాః సహ పుత్రకైః

పరమాత్మ దగ్గరకు తొందరగా చేరేచే మార్గాన్నీ, సంతోషించే మార్గాన్నీ నాకు ఉపదేశించండి

శ్రీకశ్యప ఉవాచ
ఏతన్మే భగవాన్పృష్టః ప్రజాకామస్య పద్మజః
యదాహ తే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణమ్

ఒక సారి నేను ఇదే ప్రశ్నను తాతగారైన బ్రహ్మగారిని అడిగాను (బ్రహ్మ - మరీచి - కశ్యపుడు).ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండీ ద్వాదశి దాకా ఈ వ్రతాన్ని ఉత్తమ భక్తి కలవారై ఆరాధించాలి

ఫాల్గునస్యామలే పక్షే ద్వాదశాహం పయోవ్రతమ్
అర్చయేదరవిన్దాక్షం భక్త్యా పరమయాన్వితః

సినీవాల్యాం మృదాలిప్య స్నాయాత్క్రోడవిదీర్ణయా
యది లభ్యేత వై స్రోతస్యేతం మన్త్రముదీరయేత్

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నాడు వ్రతం చేయాలంటే అంతకు ముందే సన్నధం చేసుకోవాలి.చంద్రరేఖ కొంచెం కనపడే అమావాస్య సినీవాలి. లేకపోతే దాన్ని కుహూ అంటారు.చతుర్దశీ శేషముతో అమావాస్య వస్తే చంద్రుడు కనపడతాడు 
(సినీవాలి అంటే పార్వతీ (దుర్గ) లక్ష్మీ.సకల ప్రపంచాన్ని సృష్టించి రక్షించే పరమాత్మని సంతోషింపచేసేది అని కూడా అర్థం.ఇది విశేషార్థం.మాఘబహుళ అమావాస్య చంద్రునితో కలిసే వస్తుంది.అలాగే ఆశ్వయుజ మాసములో వస్తుంది.వైశాఖ కార్తీకములో కూడా అపుడపుడు వస్తుంది)
నదీ తీరములో అడవిపంది చేత పెకిలించబడిన మట్టి దొరికితే అది పూసుకుని, ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి

త్వం దేవ్యాదివరాహేణ రసాయాః స్థానమిచ్ఛతా
ఉద్ధృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ

దేవీ నీవు రసాతలం నుండి ప్రజలకు ఒక స్థానము కోరిన ఆదివరాహముతోటి ఉద్దరించబడ్డావు.నా పాపాన్ని నీవు నశింపచేయి

నిర్వర్తితాత్మనియమో దేవమర్చేత్సమాహితః
అర్చాయాం స్థణ్డిలే సూర్యే జలే వహ్నౌ గురావపి

తమ తమ నియమాలన్నీ ఆచరించి శ్రీమన్నారాయణనున్ని ఆరాధించాలి.అర్చా స్తండిలం సూర్యుని యందూ అగ్ని యందూ జలం యందూ గురువు యందూ ఆరాధించి అందరిలో అంతర్యామిగా ఉన్న వాసుదేవుడినీ సాక్షినీ నమస్కరించాలి

నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే
సర్వభూతనివాసాయ వాసుదేవాయ సాక్షిణే

నమోऽవ్యక్తాయ సూక్ష్మాయ ప్రధానపురుషాయ చ
చతుర్వింశద్గుణజ్ఞాయ గుణసఙ్ఖ్యానహేతవే

ఇతనే అవ్యక్తం సూక్షం ప్రకృతి ప్రధానం. 24 గుణాలూ సృష్టించిన వాడు.గుణాలను లెక్కపెట్టడానికీ ఉనికికీ నీవే కారణం

నమో ద్విశీర్ష్ణే త్రిపదే చతుఃశృఙ్గాయ తన్తవే
సప్తహస్తాయ యజ్ఞాయ త్రయీవిద్యాత్మనే నమః

నీవే త్రయీ విద్య.నాలుగు కొమ్ములున్న వృషభం.శబ్దం నాలుగు రకాలు.పరా పశ్యంతి మధ్యమా వైఖరీ.ఈ నాలుగూ నాలుగు శ్రంగాలు.భూత భవిష్యత్ వర్తమానాలు మూడు పాదాలు.రెండు తలలు.నిత్యానిత్యములు.ఏడు హస్తములు ఏడు విభక్తులు.మూడు చోట్ల బంధించబడి .మన నొటినుంచి శబ్దం ఈ తీరుగా వస్తుంది.ఆత్మ బుద్ధితో కలిసి మనసుకు చెబుతుంది "ఇలా మాట్లాడు" అని.ఈ మనసు జఠరాగనిని కొడుతుంది.అందుకే జఠరాగ్ని బాగా ఉంటేనే మాట్లాడగలం.అది వాయువును పైకి ఎగదోస్తుంది.అప్పుడు తల అడ్డువస్తుంది.దాని చేత కొట్టబడి మధ్యనుంచి వాక్కు రూపములో బయటకు వస్తుంది. మూడు చోట్ల బంధించబడింది, వక్షస్థలం కంఠం శిరస్సు.పరమాత్మ కూడా త్రిధాబద్ధః.ప్రకృతీ పురుషుడూ పరమాత్మ.జగత్తులో సత్వ రజస్తమో గుణాలుగా. స్వామి వేద స్వరూపుడు.


నమః శివాయ రుద్రాయ నమః శక్తిధరాయ చ
సర్వవిద్యాధిపతయే భూతానాం పతయే నమః

నమో హిరణ్యగర్భాయ ప్రాణాయ జగదాత్మనే
యోగైశ్వర్యశరీరాయ నమస్తే యోగహేతవే

నమస్త ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః
నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః

నీవు మంగళ కరుడివి.దుష్టులకు రుద్రుడివి.జ్ఞ్యాన క్రియా ఇచ్చా శక్తులు ధరించేవాడివి.అన్ని విద్యలకూ పతివి.అటువంటి నీకు నమస్కారం.నీవే హిరణ్యగర్భుడవు.సర్వ జగత్తుకూప్రాణం.యోగానికీ ఐశ్వర్యానికీ కారణం.జగత్తుకి సాక్షి.నారాయణ ఋషికీ నర ఋషికీ హరికి నమస్కారం.

నమో మరకతశ్యామ వపుషేऽధిగతశ్రియే
కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే

అమ్మవారిని భార్యగా పొంది మరకత మణి ఉన్న పీతాంభరధారికి నమస్కారం.నీవు వరేణ్యుడవు (శ్రేష్టుడవు), వరాలిచ్చేవారిలో శ్రేష్టుడవు.అందరికీ వరాలించ్హేవాడవు.శ్రేయస్సుకోసం నీ పాదాలను సేవిస్తారు.దేవతలూ అమ్మవారూ నీ పాదపద్మాలనే అనుసరించి ఉన్నారు.తుమ్మెదలు పూలను కోరినట్లుగా అందరూ నిన్ను కోరుతారు, ఆరాధిస్తారు

త్వం సర్వవరదః పుంసాం వరేణ్య వరదర్షభ
అతస్తే శ్రేయసే ధీరాః పాదరేణుముపాసతే

అన్వవర్తన్త యం దేవాః శ్రీశ్చ తత్పాదపద్మయోః
స్పృహయన్త ఇవామోదం భగవాన్మే ప్రసీదతామ్

ఏతైర్మన్త్రైర్హృషీకేశమావాహనపురస్కృతమ్
అర్చయేచ్ఛ్రద్ధయా యుక్తః పాద్యోపస్పర్శనాదిభిః

అర్చిత్వా గన్ధమాల్యాద్యైః పయసా స్నపయేద్విభుమ్
వస్త్రోపవీతాభరణ పాద్యోపస్పర్శనైస్తతః
గన్ధధూపాదిభిశ్చార్చేద్ద్వాదశాక్షరవిద్యయా

షోడశ ఉపచార పూజను ఈ మంత్రాలతో చేయాలి.ఎనిమిది శ్లోకాలూ కలిపి. దీనితో షోడశోపచారాలను చేయాలి.అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం ధూపం దీపం వస్త్రం ఇలా... ఆవాహనతో మొదలుపెట్టాలి.అర్ఘ్యమూ పాద్యము మొదలైనవాటితో శ్రద్ధగా చేయాలి.గంధమాల్యాదులతో అర్చన చేసి పాలతో స్వామికి అభిషేకం చేయాలి.వస్త్రం ఉపవీతం ఆభరణం పాద్యం ఆచమనీయాదులతో చేయాలి.వీటన్నిటినీ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రముతో చేయాలి

శృతం పయసి నైవేద్యం శాల్యన్నం విభవే సతి
ససర్పిః సగుడం దత్త్వా జుహుయాన్మూలవిద్యయా

అవకాశం సంపదా ఉంటే బియ్యాన్ని పాలలో ఉడికించి, లేదా బెల్లముతో ఉడికించి చేయాలి.నెయ్యి బెల్లం కూడా వేయాలి.మూల మంత్రముతో చేయాలి.ఆరగింపుచేసిన దాన్ని ఉపవాసం ఉంటే భక్తులకివ్వాలి,లేకుంటే పెద్దల అనుమతితో తానే తినాలి.ఇలా ఆరగింపుచేసి తాంబూలం ఇచ్చి ద్వాదశాక్షర మంత్రాన్ని 108 సార్లుజపించాలి.రకరకాల స్తోత్రాలతో స్వామిని సేవించి ప్రదక్షిణం చేసి దండ ప్రణాం చేసి, ఆయన నిర్మాల్యాన్ని శిరస్సుయందు పెట్టుకుని స్వామికి ఉద్వాసన చేయలి.

నివేదితం తద్భక్తాయ దద్యాద్భుఞ్జీత వా స్వయమ్
దత్త్వాచమనమర్చిత్వా తామ్బూలం చ నివేదయేత్

జపేదష్టోత్తరశతం స్తువీత స్తుతిభిః ప్రభుమ్
కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేద్దణ్డవన్ముదా

కృత్వా శిరసి తచ్ఛేషాం దేవముద్వాసయేత్తతః
ద్వ్యవరాన్భోజయేద్విప్రాన్పాయసేన యథోచితమ్

భుఞ్జీత తైరనుజ్ఞాతః సేష్టః శేషం సభాజితైః
బ్రహ్మచార్యథ తద్రాత్ర్యాం శ్వో భూతే ప్రథమేऽహని

ఇద్దరికంటే తక్కువకాకుండా బ్రాహ్మణులను పాయసముతో భోజనం పెట్టి, వారు తిన్నాక ఆ శేషాన్ని తాను లేదా తనవారితో తినాలి. 

స్నాతః శుచిర్యథోక్తేన విధినా సుసమాహితః
పయసా స్నాపయిత్వార్చేద్యావద్వ్రతసమాపనమ్

ఆ రాత్రి బ్రహ్మచర్యముతో ఉండాలి.స్నానం చేసి పవిత్రుడై యధోక్తవిధితో స్వామిని రోజూ వ్రతం పూర్తయ్యే వరకూ పాలతో అభిషేకించాలి.శక్తి ఉంటే ఈ పన్నెండు రోజులూ పాలు మాత్రమే భుజించాలి, లేదా పాలతో చేసినవే భుజించాలి.

పయోభక్షో వ్రతమిదం చరేద్విష్ణ్వర్చనాదృతః
పూర్వవజ్జుహుయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్

మొదటి రోజు రాగానే హోమం చేసి బ్రాహ్మణులను అర్చించి పన్నెండు రోజులు చేయాలి.పరమాత్మ పూజా బ్రాహ్మణుల పూజా తర్పణం చేయాలి.శుద్ధ త్రయోదశి వరకూ చేయాలి.బ్రహ్మచర్యం అధోశయనం మూడు సార్లు స్నానం చేయాలి ఈ పన్నెండు రోజులు.చేడు వారితో మాట్లాడరాదు. పెద్ద భోగాలు వదిలిపెట్టాలి. ఏ ప్రాణినీ హింసించక వాసుదేవ పరాయణులై ఉండాలి
ఏవం త్వహరహః కుర్యాద్ద్వాదశాహం పయోవ్రతమ్
హరేరారాధనం హోమమర్హణం ద్విజతర్పణమ్

ప్రతిపద్దినమారభ్య యావచ్ఛుక్లత్రయోదశీమ్
బ్రహ్మచర్యమధఃస్వప్నం స్నానం త్రిషవణం చరేత్

వర్జయేదసదాలాపం భోగానుచ్చావచాంస్తథా
అహింస్రః సర్వభూతానాం వాసుదేవపరాయణః

త్రయోదశ్యామథో విష్ణోః స్నపనం పఞ్చకైర్విభోః
కారయేచ్ఛాస్త్రదృష్టేన విధినా విధికోవిదైః

చివరి రోజు గో గవ్యముతో పంచామృతముతో స్నానం చేసి విధి బాగా తెలిసిన్ వారితో పూజ చేయించి, డబ్బు విషయములో వంచన చేయకుండా పూజ చేయించాలి

పూజాం చ మహతీం కుర్యాద్విత్తశాఠ్యవివర్జితః
చరుం నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే

శక్తి ఉన్నవారు తక్కువా శక్తి లేని వారు ఎక్కువా చేయరాదు.పాలతో వండినీ చెరువును పరమ తేజస్వరూపమైన విష్ణువుకు నివేదించి పూజించాలి.పరమాత్మకు సంతోషము కలిగించేందుకు నేయి బాగా వేసి సుగంధ ద్రవ్యాలు వేసి పాయసం వండాలి.మనకు ఏవేవి ఆహారములో కావాలని కోరుకుంటామో అవే చేసి స్వామికి నివేదించాలి

సూక్తేన తేన పురుషం యజేత సుసమాహితః
నైవేద్యం చాతిగుణవద్దద్యాత్పురుషతుష్టిదమ్

భగవంతునికి సతోషం కలిగించే ఎక్కువ గుణాలున్న నైవేద్యాన్ని సమర్పించాలి.సమాప్తినాడు జ్ఞ్యానాంశలైన గురువుగారిని వస్త్రాభరణములతో సత్కరించి, సంతోషింపచేసి, గురువులనూ బ్రాహ్మణులనూ ఆరాధించాలి.వారిని ఆరాధించుటే నిజమైన ఆరాధన.

ఆచార్యం జ్ఞానసమ్పన్నం వస్త్రాభరణధేనుభిః
తోషయేదృత్విజశ్చైవ తద్విద్ధ్యారాధనం హరేః

భోజయేత్తాన్గుణవతా సదన్నేన శుచిస్మితే
అన్యాంశ్చ బ్రాహ్మణాన్ఛక్త్యా యే చ తత్ర సమాగతాః

బ్రాహ్మణోత్తములకూ గురువుకీ మంచి గుణములతో ఉన్న భోజనాన్ని భుజింపచేయాలి.శక్తి ఉంటే మిగతా బ్రాహ్మణులకు కూడా భుజింపచేసి దక్షిణలు ఇవ్వాలి

దక్షిణాం గురవే దద్యాదృత్విగ్భ్యశ్చ యథార్హతః
అన్నాద్యేనాశ్వపాకాంశ్చ ప్రీణయేత్సముపాగతాన్

కుక్క దగ్గరనుంచీ కుక్కను తినేవాటి వరకూ అందరికీ భోజనం పెట్టి సంతోషింపచేయాలి.అదే నిజమైన ఆరాధన 

భుక్తవత్సు చ సర్వేషు దీనాన్ధకృపణాదిషు
విష్ణోస్తత్ప్రీణనం విద్వాన్భుఞ్జీత సహ బన్ధుభిః

దీనులూ గుడ్డివారూ దరిద్రులూ అందరూ భోజనం చేసిన తరువాత అదే నిజమైన పరమాత్మ పూజ అని తెలుసుకుని బంధువులతో కూర్చుని తరువాత భుజించాలి.

నృత్యవాదిత్రగీతైశ్చ స్తుతిభిః స్వస్తివాచకైః
కారయేత్తత్కథాభిశ్చ పూజాం భగవతోऽన్వహమ్

ప్రతీరోజు ఖాళీ సమయములో నాట్యం గానం, బ్రాహ్మణుల స్వస్తి వాచకముతో పూజ చేయాలి, పరమాత్మ కథలను గానం చేయాలి నాట్యం చేయాలి . మృదంగ వాద్యాలను మోగించాలి.. 

ఏతత్పయోవ్రతం నామ పురుషారాధనం పరమ్
పితామహేనాభిహితం మయా తే సముదాహృతమ్

త్వం చానేన మహాభాగే సమ్యక్చీర్ణేన కేశవమ్
ఆత్మనా శుద్ధభావేన నియతాత్మా భజావ్యయమ్

అయం వై సర్వయజ్ఞాఖ్యః సర్వవ్రతమితి స్మృతమ్
తపఃసారమిదం భద్రే దానం చేశ్వరతర్పణమ్

ఉత్తమమైన భగవంతుని ఆరాధనా రూపమైన పయో వ్రతం.ఈ విషయం నాకు మా తాతగారైన బ్రహ్మగారు చెప్పారు.అది నీకు చెప్పాను.నీవు కూడా ఈ వ్రతముతో పరమాత్మను పరిశుద్ధమైన మనసుతో నిగ్రహం ఉన్న ఆత్మతో స్వామిని సేవించు.ఈ వ్రతానికి రెండు పేరులు ఉన్నాయి.సర్వ యజ్ఞ్యమూ సర్వ వ్రతమూ అని.ఇందులోనే అన్ని వ్రతాలూ యజ్ఞ్యాలూ ఉన్నాయి

త ఏవ నియమాః సాక్షాత్త ఏవ చ యమోత్తమాః
తపో దానం వ్రతం యజ్ఞో యేన తుష్యత్యధోక్షజః

ఇది సకల తపసులకూ సారమూ దానమూ పరమాత్మకు తృప్తి కలిగించేది.పరమాత్మను సంతోషింపచేసే యజ్ఞ్య దాన తపస్సులే నియమములూ యమములూ వ్రతములూ.దేన్ని ఆచరిస్తే పరమాత్మ సంతోషిస్తాడో అదే తపస్సూ దానం యజ్ఞ్యం

తస్మాదేతద్వ్రతం భద్రే ప్రయతా శ్రద్ధయాచర
భగవాన్పరితుష్టస్తే వరానాశు విధాస్యతి

నీవు ఈ వ్రతాన్ని శ్రద్ధా భక్తులతో చేస్తే స్వామి సంతోషించి నీవు కోరిన వ్రతాన్ని ప్రసాదిస్తాడు

Popular Posts