Followers

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం పదవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
ఖట్వాఙ్గాద్దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్పృథుశ్రవాః
అజస్తతో మహారాజస్తస్మాద్దశరథోऽభవత్

తస్యాపి భగవానేష సాక్షాద్బ్రహ్మమయో హరిః
అంశాంశేన చతుర్ధాగాత్పుత్రత్వం ప్రార్థితః సురైః
రామలక్ష్మణభరత శత్రుఘ్నా ఇతి సంజ్ఞయా

తస్యానుచరితం రాజన్నృషిభిస్తత్త్వదర్శిభిః
శ్రుతం హి వర్ణితం భూరి త్వయా సీతాపతేర్ముహుః

నీవా చరితాన్ని తత్వ జ్ఞ్యానులున్న ఋషులచేత చాలా గొప్పదైన ఆ చైత్రను చాలా సార్లు వినే ఉంటావు. ఐనా దన్ని సంగ్రహముగా చెబుతాను . వాల్మీకి రామాయణములో ఏ ఏ విషయాన్ని వివరించలేదో ఆ విషయం ఇక్కడ ఉంటుంది.

ఈ శ్లోకం రామాయణ సంగ్రహం.

గుర్వర్థే త్యక్తరాజ్యో వ్యచరదనువనం పద్మపద్భ్యాం ప్రియాయాః
పాణిస్పర్శాక్షమాభ్యాం మృజితపథరుజో యో హరీన్ద్రానుజాభ్యామ్
వైరూప్యాచ్ఛూర్పణఖ్యాః ప్రియవిరహరుషారోపితభ్రూవిజృమ్భ
త్రస్తాబ్ధిర్బద్ధసేతుః ఖలదవదహనః కోసలేన్ద్రోऽవతాన్నః

గుర్వర్థే త్యక్తరాజ్యో వ్యచరదనువనం : పెద్దల కోసం రాజ్యాన్ని త్యాగం చేసిన వాడు. వదిలి, అరణ్యమంతా సంచరించాడు తన పద్మముల వంటి పాదములతో. ఆ పాదలెక్కడ కందిపోతాయో అని తాకడానికి భయపడేంత సుకుమారమైన పాదములతో అరణ్యమంతా సంచరించాడు, పెద్దలకోసం.
ఒక తమ్మున్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఇంకో ఇద్దరు తమ్ములు ఆయనకు బాధను తొలగించారు. సుగ్రీవుడు సీత జాడను తెలిపాడు. విభీషణుడు సముద్రాన్ని ఎలా దాటాలో చెప్పాడు. అక్కడిదాగ దారి చెప్పినవాడు సుగ్రీవుడు.

వైరూప్యాచ్ఛూర్పణఖ్యాః ప్రియవిరహరుషారోపితభ్రూవిజృమ్భత్రస్తాబ్ధిః -శూర్పనఖకు ముక్కు చెవులూ కోసినందు వలన ఆమె కోపించి రావణాసురునికి ఆ వార్త చెబితే, రావణాసురుడు సీతమ్మను అపహరిస్తే, ప్రియురాలి విరహం సహించలేక, ఆ విరహముతో కోపం వచ్చి కనుబొమ్మలు ముడవగానే సముద్రం వణికిపోయి మార్గము చూపించింది, ఎలా సేతువు కట్టాలో చూపింది. దుర్మార్గులని కాల్చివేసిన కోసలేంద్రుడు నన్ను కాపాడుగాక

విశ్వామిత్రాధ్వరే యేన మారీచాద్యా నిశాచరాః
పశ్యతో లక్ష్మణస్యైవ హతా నైరృతపుఙ్గవాః

విశ్వామిత్రుని యజ్ఞ్యమునకు రక్షణగా దశరథుడు పంపగా లక్ష్మణ స్వామి చూస్తుండగా యజ్ఞ్యమునకు విఘ్నం కలిగిస్తున్న రాక్షసులను సంహరించాడు.

యో లోకవీరసమితౌ ధనురైశముగ్రం
సీతాస్వయంవరగృహే త్రిశతోపనీతమ్
ఆదాయ బాలగజలీల ఇవేక్షుయష్టిం
సజ్జ్యీకృతం నృప వికృష్య బభఞ్జ మధ్యే


రాజులందరి సభలో సీతా గృహములో ఉన్న శివధనస్సు మూడు వందల మంది పట్టుకున్న ధనువును గున్న ఏనుగు చెరుకు  గడను విరిచినట్లుగా విరిచాడు. 

జిత్వానురూపగుణశీలవయోऽఙ్గరూపాం
సీతాభిధాం శ్రియమురస్యభిలబ్ధమానామ్
మార్గే వ్రజన్భృగుపతేర్వ్యనయత్ప్రరూఢం
దర్పం మహీమకృత యస్త్రిరరాజబీజామ్

నిరంతరం వక్షస్థలములో వేంచేసి ఉన్న లక్ష్మీ దేవినే సీత పేరుతో అవతరిస్తే గెలిచి సొంతం చేసుకున్నాడు. దారిలో వెళుతూ ఉండగా మార్గములో అడ్డం వచ్చిన మూడు సార్లు రాజులను సవీర్యముగా హరించిన పరశురాముని గర్వాన్ని అణచాడు 

యః సత్యపాశపరివీతపితుర్నిదేశం
స్త్రైణస్య చాపి శిరసా జగృహే సభార్యః
రాజ్యం శ్రియం ప్రణయినః సుహృదో నివాసం
త్యక్త్వా యయౌ వనమసూనివ ముక్తసఙ్గః

ఆడవారిచే ఓడించబడిన (స్త్రీ వ్యామోహములో పడి స్త్రీకి బానిస అయి) తండ్రిగారి ఆజ్ఞ్యను పాలించడానికి 
(కైక వరము కోరలేదు.దశరథుడే రెండు వరాలిచ్చాడు. వరాలిచ్చిన తరువాత పన్నెండేళ్ళవరకూ వరం కోరుకోకపోతే వరం ఇచ్చిన వారి ఇష్ట ప్రకారమే వరం ఇవ్వవచ్చు. దశరధుడు వరం ఇచ్చేనాటికి ఆయనకు పిల్లలు లేరు.)

రక్షఃస్వసుర్వ్యకృత రూపమశుద్ధబుద్ధేస్
తస్యాః ఖరత్రిశిరదూషణముఖ్యబన్ధూన్
జఘ్నే చతుర్దశసహస్రమపారణీయ
కోదణ్డపాణిరటమాన ఉవాస కృచ్ఛ్రమ్

రాజ్యాన్ని రాజ్య లక్ష్మినీ మిత్రులనూ ప్రేమించేవారినీ అంత గొప్ప ఇంటినీ (పట్టాభిషేక సమయములో ఆ భవనాన్ని సుగ్రీవునికిచ్చాడు) ముక్తసంగుడు (సంసారమ్యందు కోరిక లేని వాడు) ప్రాణాలని వదిలింట్లు వదిలాడు.
పాపబుద్ధి ఐన రాక్షసుని చెల్లెలకు వైరూప్యం కలిగించి. ఖర ధూషణాధి రావణ బంధువులను కోదండపాణి అయి తన పరాక్రమముతో సంహరించి అరణ్యములో నివసించాడు

సీతాకథాశ్రవణదీపితహృచ్ఛయేన
సృష్టం విలోక్య నృపతే దశకన్ధరేణ
జఘ్నేऽద్భుతైణవపుషాశ్రమతోऽపకృష్టో
మారీచమాశు విశిఖేన యథా కముగ్రః

సీత యొక్క సౌందర్యాన్ని శూర్పణఖ వర్ణిస్తే హృదయములో కామాగ్ని రగిలిన రావణుడు, మారీచున్ని పంపాడు. ఆ మారీచున్ని రాముడు దక్షప్రజాపతిని రుద్రుడు చంపినట్లుగా ఒక బాణముతో చంపాడు.  (భార్యను అవమానించినందు వలనే దక్షున్ని శంకరుడు సంహరించాడు)

రక్షోऽధమేన వృకవద్విపినేऽసమక్షం
వైదేహరాజదుహితర్యపయాపితాయామ్
భ్రాత్రా వనే కృపణవత్ప్రియయా వియుక్తః
స్త్రీసఙ్గినాం గతిమితి ప్రథయంశ్చచార

తోడేలు లాగ సన్యాసి వేషం వేసుకుని భిక్షుకున్ని అని నమ్మించి సీతమ్మను అపహరించాడు. భార్యను అపహరిస్తే రాముడు ఎంతగానో విలపించాడు. 
స్త్రీసఙ్గినాం గతిమితి ప్రథయంశ్చచార - ఆడవారి మీద వ్యామోహం ఉన్న వారి గతి ఇంతే అని చెప్పడానికా అన్నట్లు ఏడిచాడు. 

దగ్ధ్వాత్మకృత్యహతకృత్యమహన్కబన్ధం
సఖ్యం విధాయ కపిభిర్దయితాగతిం తైః
బుద్ధ్వాథ వాలిని హతే ప్లవగేన్ద్రసైన్యైర్
వేలామగాత్స మనుజోऽజభవార్చితాఙ్ఘ్రిః

తన దుష్కృత్యముతో కబంధుడైన కబంధున్ని కాల్చివేసి సుగ్రీవునితో స్నేహం చేసుకుని వానరులతో సీతామార్గాన్ని తెలుసుకుని, బ్రహ్మ శంకరులతో పూజించబడే పాదములు గల రాముడు సముద్ర ఒడ్డుకు వానర సైన్యముతో కలిసి వెళ్ళాడు

యద్రోషవిభ్రమవివృత్తకటాక్షపాత
సమ్భ్రాన్తనక్రమకరో భయగీర్ణఘోషః
సిన్ధుః శిరస్యర్హణం పరిగృహ్య రూపీ
పాదారవిన్దముపగమ్య బభాష ఏతత్

రాముడు మొదట మూడు రోజులు శరణు వేడాడు.ఆయన కన్నెర్ర చేయగానే కనుబొమ్మ ముడివేయగానే సముద్రములో ఉన్న ముసళ్ళూ తిమింగలాలూ మాడిపోయాయి. అవి భయముతో గోల చేసాయి. సముద్రుడు పూల మాలలు నెత్తిన పెట్టుకుని వచ్చి అతనికి అర్పించి 

న త్వాం వయం జడధియో ను విదామ భూమన్
కూటస్థమాదిపురుషం జగతామధీశమ్
యత్సత్త్వతః సురగణా రజసః ప్రజేశా
మన్యోశ్చ భూతపతయః స భవాన్గుణేశః

"మందబుద్ధులమైన మాకు నీ పరాక్రమం ఎలా తెలుసుతుంది. నీవు కూటస్థుడవు పరమాత్మవు జగన్నాధుడవు ఆదిపురుషుడవు. దేవతలు సత్వముతో ప్రజాపతులు రజస్సుతో భూతములు తమస్సుతో పుడతాయి" అని హాయిగా వెళ్ళి రావణున్ని చంపమని చెప్పి, తన మీద సేతువు నిర్మించమని చెప్పాడు. దాని వలన నీ కీర్తి పెరుగుతుంది

కామం ప్రయాహి జహి విశ్రవసోऽవమేహం
త్రైలోక్యరావణమవాప్నుహి వీర పత్నీమ్
బధ్నీహి సేతుమిహ తే యశసో వితత్యై
గాయన్తి దిగ్విజయినో యముపేత్య భూపాః

సేతు బంధం రావణుని మీద విజయం, ఈ రెంటితో నీ కీర్తిని గానం చేస్తారు. 

బద్ధ్వోదధౌ రఘుపతిర్వివిధాద్రికూటైః
సేతుం కపీన్ద్రకరకమ్పితభూరుహాఙ్గైః
సుగ్రీవనీలహనుమత్ప్రముఖైరనీకైర్
లఙ్కాం విభీషణదృశావిశదగ్రదగ్ధామ్

వానరుల చేత పెకిలించబడిన చెట్లూ గుట్టలూ తీసుకుని సేతువు కట్టించు. ముందే కాలిపోయిన లకను అలా రాముడు విభీషణునితో కలిసి చేరాడు

సా వానరేన్ద్రబలరుద్ధవిహారకోష్ఠ
శ్రీద్వారగోపురసదోవలభీవిటఙ్కా
నిర్భజ్యమానధిషణధ్వజహేమకుమ్భ
శృఙ్గాటకా గజకులైర్హ్రదినీవ ఘూర్ణా

ఏనుగుల గుంపుతో సరస్సు అల్లకల్లోలం ఐనట్లుగా ద్వార గోపురాలు భవనాలూ ప్రాకారాలు సరోవరాలూ గల లంక భంగం చేయబడింది. 

రక్షఃపతిస్తదవలోక్య నికుమ్భకుమ్భ
ధూమ్రాక్షదుర్ముఖసురాన్తకనరాన్తకాదీన్
పుత్రం ప్రహస్తమతికాయవికమ్పనాదీన్
సర్వానుగాన్సమహినోదథ కుమ్భకర్ణమ్

ఇలా అందరినీ పంపాడు. చివరకు తాను రాముని చేత ఓడిపోయిన తరువాత కుంభకర్ణున్ని పంపాడు. అప్పటికి లంకలో స్త్రీ బాల వృద్ధులే ఉన్నారు. (రావణుడు స్త్రీ, ఇంద్రజిత్తు బాలుడు కుంభకర్ణుడు వృద్ధుడు. ఇంత జరుగుతున్నా పడుకున్నందుకు.) 

తాం యాతుధానపృతనామసిశూలచాప
ప్రాసర్ష్టిశక్తిశరతోమరఖడ్గదుర్గామ్
సుగ్రీవలక్ష్మణమరుత్సుతగన్ధమాద
నీలాఙ్గదర్క్షపనసాదిభిరన్వితోऽగాత్

సుగ్రీవ లక్ష్మణ హనుమ జాంబవంతాదులతో కలిసి యుద్ధానికి వెళ్ళారు. అశ్వ గజ రథ పదాతి బలములతో రాక్షసులు దండెత్తి వచ్చారు.  రాక్షసులు శక్తీ శూలాది ఆయుధాలతో వస్తే వానరులు చెట్లూ పుట్టలతో యుద్ధానికి వచ్చారు. (రావణుని కొడుకైన నరాంతకుడు చేతిలో ఖడ్గం పట్టుకుని యుద్ధానికి వచ్చాడు. వాడిని హనుమతుడు ఒక గుట్టతో చంపాడు) దేవాంతకున్ని వాడి కత్తితో వాడినే చంపాడు హనుమంతుడు. 

తేऽనీకపా రఘుపతేరభిపత్య సర్వే
ద్వన్ద్వం వరూథమిభపత్తిరథాశ్వయోధైః
జఘ్నుర్ద్రుమైర్గిరిగదేషుభిరఙ్గదాద్యాః
సీతాభిమర్షహతమఙ్గలరావణేశాన్

చతురంగ బలాలతో వారంతా పరభార్యను అపహరించుట వలన అమంగళుడైన రావణుని సైన్యముతో ద్వంద్వ యుద్ధం చేసారు. 

రక్షఃపతిః స్వబలనష్టిమవేక్ష్య రుష్ట
ఆరుహ్య యానకమథాభిససార రామమ్
స్వఃస్యన్దనే ద్యుమతి మాతలినోపనీతే
విభ్రాజమానమహనన్నిశితైః క్షురప్రైః

చివరకు రావణుడు రథం తీసుకుని యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడు మాతలినిచ్చి తన రథాన్ని  పంపాడు. 

రామస్తమాహ పురుషాదపురీష యన్నః
కాన్తాసమక్షమసతాపహృతా శ్వవత్తే
త్యక్తత్రపస్య ఫలమద్య జుగుప్సితస్య
యచ్ఛామి కాల ఇవ కర్తురలఙ్ఘ్యవీర్యః

దొంగతనముగా కుక్కలాగ సీతమ్మను అపహరించావు. నీవు నీచ రాక్షసుడివి. మలాన్ని పురీషం అంటారు. పురుషాదపురీష . యజమాని ఇంట్లో లేనప్పుడు వస్తువును కుక్కలే లాక్కుంటాయి.నీవు కూడ నేను ఇంట్లో లేనప్పుడు సిగ్గు విడిచి నా భార్యను తీసుకు వచ్చావు. ఆ పనికి నేను ఇప్పుడు ఫలం ఇవ్వడానికి వచ్చాను

ఏవం క్షిపన్ధనుషి సన్ధితముత్ససర్జ
బాణం స వజ్రమివ తద్ధృదయం బిభేద
సోऽసృగ్వమన్దశముఖైర్న్యపతద్విమానాద్
ధాహేతి జల్పతి జనే సుకృతీవ రిక్తః

ఇలా చెప్పి శస్త్రాన్ని వదిలాడు. అది రావణున్ని హృదయాన్ని భేధించింది. పది నోళ్ళ నుండి రక్తాన్ని చిందిస్తూ కిందపడగా అతనిపై ప్రేమ ఉన్న వారు హాహాకారాలు చేసారు. దరిద్రుడు పుణ్యములు చేసుకుంటే అతని పుణ్యాన్ని గుర్తించి బంధువులు ఎలా ఆక్రోశిస్తారో వాడు పాపి ఐనా సరే రావణుని వెంట ఉన్న అనుచరులు ఆక్రోశించారు

తతో నిష్క్రమ్య లఙ్కాయా యాతుధాన్యః సహస్రశః
మన్దోదర్యా సమం తత్ర ప్రరుదన్త్య ఉపాద్రవన్

దూతలు రావణుడు మరణించిన విషయాన్ని మండోదరికి చెప్పారు

స్వాన్స్వాన్బన్ధూన్పరిష్వజ్య లక్ష్మణేషుభిరర్దితాన్
రురుదుః సుస్వరం దీనా ఘ్నన్త్య ఆత్మానమాత్మనా

రావణుడే కాక ఆ యుద్ధములో చాలా మంది చనిపోయి ఉంటారు. తమ తమ వారిని వెతుక్కుని తీసుకు వెళ్ళడానికి తమ వారు వచ్చారు. (యుద్ధములో చనిపోయే వారికి అశౌచం లేదు. ఆత్మ హత్య చేసుకున్న వారికి కర్మ చేయకూడదు) రావణుని బంధువులని లక్ష్మణుడు రావణున్ని రాముడూ చంపాడు.అతికాయ మహాకాయులనూ మొదలైన వారిని లక్ష్మణుడు వధించాడు. 

హా హతాః స్మ వయం నాథ లోకరావణ రావణ
కం యాయాచ్ఛరణం లఙ్కా త్వద్విహీనా పరార్దితా

అరచేత్తో వక్షస్థలాన్ని కొట్టుకుంటూ "లోకాన్ని మొత్తం ఏడిపించే రావణా చనొపోయింది మేము, నీవుకాదు. మేమెవరిని శరణు వేడాలి.నీవు ఎంత కాముకుడవు. ఆనాడు సీతమ్మను తీసుకు వచ్చి అశోకవనములో చెట్టుకింద కూర్చోపెట్టుకుని ఈమె నాది అనుకున్నావు.

న వై వేద మహాభాగ భవాన్కామవశం గతః
తేజోऽనుభావం సీతాయా యేన నీతో దశామిమామ్

అప్పుడు నీవు ఈ విషయం తెలుసుకోలేకపోయావు కామాసక్తుడవి. నీవెంతటి కాముకుడవో తెలుసుకోలేకపోయావు. అది తెలుసుకోలేకపోయినా సీతమ్మ యొక్క పాతివ్రత్య ప్రభావం తెలుసుకోలేకపోయావు 

కృతైషా విధవా లఙ్కా వయం చ కులనన్దన
దేహః కృతోऽన్నం గృధ్రాణామాత్మా నరకహేతవే

మమ్మూ లంకనూ విధవలను చేసావు. నీ శరీరం దహనం చేసేలోపే నీ శరీరములోని చాలా భాగాలు గ్రద్ధలకు ఆహారం చేయబడినది. అలా చనిపోయిన వాడికి నరకం తప్పదు. (అంత్య సంస్కారం చేస్తేనే వాడు ఉత్తమగతులకు వెళతాడు)

శ్రీశుక ఉవాచ
స్వానాం విభీషణశ్చక్రే కోసలేన్ద్రానుమోదితః
పితృమేధవిధానేన యదుక్తం సామ్పరాయికమ్

రాముని ఆజ్ఞ్య తీసుకుని విభీషణుడు చనిపోయిన తనవారికి శ్రాద్ధాదులు చేసాడు. 

తతో దదర్శ భగవానశోకవనికాశ్రమే
క్షామాం స్వవిరహవ్యాధిం శింశపామూలమాశ్రితామ్

ఇలా రావణ సంహారం జరిగిన తరువాత శ్రీరామచంద్రుడు సీతమ్మను చూచాడు 

రామః ప్రియతమాం భార్యాం దీనాం వీక్ష్యాన్వకమ్పత
ఆత్మసన్దర్శనాహ్లాద వికసన్ముఖపఙ్కజామ్

సీతమ్మను తీసుకు రమ్మంటే హనుమ విభీషణాదులు పల్లకిలో కూర్చోబెట్టీ తీసుకు వచ్చారు

ఆరోప్యారురుహే యానం భ్రాతృభ్యాం హనుమద్యుతః
విభీషణాయ భగవాన్దత్త్వా రక్షోగణేశతామ్

విభీషణుడికి లంకాధిపత్యం ఇచ్చాడు. కల్పాంతం వరకూ ఉండే ఆయుష్ష్యాన్ని ఇచ్చాడు (అశ్వద్ధామ బలి హనుమ విభీషణుడు వ్యాస కృప పరశురామ - ఈ ఏడుగురూ చిరంజీవులు.పొద్దున్నే లేచి వీరిని స్మరించుకోవాలి). విభీషణుడికి కప్లాంతం వరకూ ఆయుష్షు ఉంటుంది అని చెప్పాడు. 

లఙ్కామాయుశ్చ కల్పాన్తం యయౌ చీర్ణవ్రతః పురీమ్
అవకీర్యమాణః సుకుసుమైర్లోకపాలార్పితైః పథి

లోకపాలకులూ బ్రహ్మాదులు ఇంద్రాదులు రామ చంద్రుడు వస్తుంటే పూలు చల్లారు . ఆయన చరిత్ర గానం చేస్తూ ఉన్నారు

ఉపగీయమానచరితః శతధృత్యాదిభిర్ముదా
గోమూత్రయావకం శ్రుత్వా భ్రాతరం వల్కలామ్బరమ్

రావణాసురున్ని చంపి భరద్వాజాశ్రమానికి వెళుతానంటే రామునికి విందు చేసాడు. రాముడు వన వాసం ముగించుకు వచ్చేవరకూ భరతుడు గోమూత్రములో వండిన దాన్ని తింటూ గడిపాడు. రామునికోసం వేచి వేచి ఏడ్చి కారిన కన్నీటి బురదలో పడి దొర్లుతున్నాడు. హనుమంతుడు భరతుడి వద్దకు వెళ్ళి భరతుని గురించి వాకబు చేసి వస్తాడు. హనుమంతుడు తిరిగి వచ్చేసరికి భరద్వాజ ఆశ్రమం మొత్తం నిండిపోయి ఉంటుంది. అపుడు రాముడు హనుమను పిలిచి అరిటాకును మధ్యకు చీల్చి ఒక వైపు రామునికీ ఇంకో వైపు హనుమకీ పెట్టాడు. ఇదే పరిష్వంగం. రాముడు గీత గీసినప్పటినుంచే అరిటాకుకు మధ్యన గీత పడినది. అరిటాకుకు మధ్యలో అందుకే ఏమీ వడ్డించరు. అది కపి భాగం. 

మహాకారుణికోऽతప్యజ్జటిలం స్థణ్డిలేశయమ్
భరతః ప్రాప్తమాకర్ణ్య పౌరామాత్యపురోహితైః

భూమి మీద పడుకుని జటాధారి అయి ఉన్న భరతుని గురించి తెలుసుకుని పరితపించాడు రాముడు. రాముడిచ్చిన పాదములను శిరసు మీద పెట్టుకుని రామునికి ఎదురేగాడు భరతుడు

పాదుకే శిరసి న్యస్య రామం ప్రత్యుద్యతోऽగ్రజమ్
నన్దిగ్రామాత్స్వశిబిరాద్గీతవాదిత్రనిఃస్వనైః

బ్రహ్మఘోషేణ చ ముహుః పఠద్భిర్బ్రహ్మవాదిభిః
స్వర్ణకక్షపతాకాభిర్హైమైశ్చిత్రధ్వజై రథైః

సదశ్వై రుక్మసన్నాహైర్భటైః పురటవర్మభిః
శ్రేణీభిర్వారముఖ్యాభిర్భృత్యైశ్చైవ పదానుగైః

పారమేష్ఠ్యాన్యుపాదాయ పణ్యాన్యుచ్చావచాని చ
పాదయోర్న్యపతత్ప్రేమ్ణా ప్రక్లిన్నహృదయేక్షణః

అనేకమైన రాజ లాంచనాలతో కలిసి శరీరం పులకించగా కనులు ఆనందబాష్పాలతో తడవగా తడిసిన హృదయం కలవాడై రాముని పాదాల మీద పడ్డాడు. ఆలింగనం తీసుకున్నాడు. రాముడు కూడా ఆనందబాష్పాలతో భరతునికి అభిషేకం చేసాడు 

పాదుకే న్యస్య పురతః ప్రాఞ్జలిర్బాష్పలోచనః
తమాశ్లిష్య చిరం దోర్భ్యాం స్నాపయన్నేత్రజైర్జలైః

రామో లక్ష్మణసీతాభ్యాం విప్రేభ్యో యేऽర్హసత్తమాః
తేభ్యః స్వయం నమశ్చక్రే ప్రజాభిశ్చ నమస్కృతః

సీతా లక్ష్మణులతో కలిసి  అక్కడున్న యోగ్యులైన బ్రాహ్మణోత్తములకు నమస్కరించి ప్రజల చేత నమస్కరించబడి ఉత్తర కోసల ప్రజలందరూ పూలూ పేలాలూ సుగంధ ద్రవ్యాలూ ఆనందముగా చల్లారు. విభీషణ సుగ్రీవాదులతో కలిసి రాముడు 

ధున్వన్త ఉత్తరాసఙ్గాన్పతిం వీక్ష్య చిరాగతమ్
ఉత్తరాః కోసలా మాల్యైః కిరన్తో ననృతుర్ముదా

పాదుకే భరతోऽగృహ్ణాచ్చామరవ్యజనోత్తమే
విభీషణః ససుగ్రీవః శ్వేతచ్ఛత్రం మరుత్సుతః

ధనుర్నిషఙ్గాన్ఛత్రుఘ్నః సీతా తీర్థకమణ్డలుమ్
అబిభ్రదఙ్గదః ఖడ్గం హైమం చర్మర్క్షరాణ్నృప

హనుమంతుడు తెల్లని గొడుగు పట్టుకోగా ధనువూ అమ్ముల పొదనూ శతృఘ్నుడూ, సీత అభిషేక జలాన్నీ, అంగదుడు ఖడ్గాన్నీ, డాలునీ తీసుకున్నాడు

పుష్పకస్థో నుతః స్త్రీభిః స్తూయమానశ్చ వన్దిభిః
విరేజే భగవాన్రాజన్గ్రహైశ్చన్ద్ర ఇవోదితః

పుష్పకవిమానములో కూర్చున్న రాముడు అందరి స్తోత్రాలూ విని చంద్రునిలా ప్రకాశించాడు. అందరూ చూస్తుండగా రాజభవనానికి ప్రవేశించాడు

భ్రాత్రాభినన్దితః సోऽథ సోత్సవాం ప్రావిశత్పురీమ్
ప్రవిశ్య రాజభవనం గురుపత్నీః స్వమాతరమ్

అక్కడికి వెళ్ళి పెద్దవారిని పూజించి చిన్నవారిచేత పూజలందుకున్నాడు

గురూన్వయస్యావరజాన్పూజితః ప్రత్యపూజయత్
వైదేహీ లక్ష్మణశ్చైవ యథావత్సముపేయతుః

లక్ష్మణుడూ సీతా కూడా అయోధ్యా అంతఃపురవాసులచేత నమస్కారాలు పొందారు, వరూ నమస్కారాలు చేసారు. పోయిన ప్రాణాలు తిరిగి వస్తే ఎంత ఆనందముగా ఉంటుందో ఆ పిల్లలు వచ్చినందుకు అంత ఆనందముగా ఉన్నారు. 

పుత్రాన్స్వమాతరస్తాస్తు ప్రాణాంస్తన్వ ఇవోత్థితాః
ఆరోప్యాఙ్కేऽభిషిఞ్చన్త్యో బాష్పౌఘైర్విజహుః శుచః

జటా నిర్ముచ్య విధివత్కులవృద్ధైః సమం గురుః
అభ్యషిఞ్చద్యథైవేన్ద్రం చతుఃసిన్ధుజలాదిభిః

ఒడిలో కూర్చోబెట్టుకుని కన్నీటితో వారిని తడిపారు. రాముడు అప్పుడు తానానాడు నందీగ్రామములో కట్టుకున్న జటలను విడిచాడు. వసువులు ఇంద్రున్ని చేసినట్లుగా నాలుగు సముద్రాల నీటితో అభిషేకం చేసారు

ఏవం కృతశిరఃస్నానః సువాసాః స్రగ్వ్యలఙ్కృతః
స్వలఙ్కృతైః సువాసోభిర్భ్రాతృభిర్భార్యయా బభౌ

ఇలా స్నానం చేసి వస్త్రాలు ధరించి తమ్ములతో కలిసి భరతుడు కోరగా సింహాసనం అధిష్ఠించాడు. 

అగ్రహీదాసనం భ్రాత్రా ప్రణిపత్య ప్రసాదితః
ప్రజాః స్వధర్మనిరతా వర్ణాశ్రమగుణాన్వితాః
జుగోప పితృవద్రామో మేనిరే పితరం చ తమ్

ప్రజలు కూడా రాముని రాజ్యములో తమకు తాముగానే తమ ధర్మాన్ని ఆచరించారు 

త్రేతాయాం వర్తమానాయాం కాలః కృతసమోऽభవత్
రామే రాజని ధర్మజ్ఞే సర్వభూతసుఖావహే

త్రేతా యుగమైనా రాముని పాలనలో కృతయుగములా నడిచింది ధర్మం

వనాని నద్యో గిరయో వర్షాణి ద్వీపసిన్ధవః
సర్వే కామదుఘా ఆసన్ప్రజానాం భరతర్షభ

అరణ్యాలూ నదులూ పర్వతాలూ ద్వీపాలూ సముద్రాలూ అడగగానే అడిగినవి ఇచ్చేవి. 

నాధివ్యాధిజరాగ్లాని దుఃఖశోకభయక్లమాః
మృత్యుశ్చానిచ్ఛతాం నాసీద్రామే రాజన్యధోక్షజే

మానసిక చింత గానీ వ్యాధులూ చింతా అలసట దుఃఖమూ శోకమూ అకాల మృత్యువూ రాముని పాలనలో లేదు

ఏకపత్నీవ్రతధరో రాజర్షిచరితః శుచిః
స్వధర్మం గృహమేధీయం శిక్షయన్స్వయమాచరత్

ఏకపత్నీ వ్ర్తాన్ని తీసుకుని గృహస్థ ధర్మాన్ని ఎలా ఆచరించాలో రాముడు ప్రజలకు నేర్పుతూ తానాచరించాడు

ప్రేమ్ణానువృత్త్యా శీలేన ప్రశ్రయావనతా సతీ
భియా హ్రియా చ భావజ్ఞా భర్తుః సీతాహరన్మనః

సీతమ్మ కూడా ప్రేమతో అనువర్తనముతో శీలముతో వినయముతో బుద్ధితో సిగ్గుతో భర్త యొక్క భావాన్ని తెలుసుకొని భర్త యొక్క మనసుని హరించింది.

Popular Posts