Followers

Wednesday, 9 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం ప్రథమాధ్యాయం


నవమ స్కంధం మొత్తం సూర్య చంద్ర రాజుల చరిత్ర.తత్ర సర్గ విసర్గ స్థానం పోషనం ఊతయ మన్వంతర ఈశానుకథ నిరోధ ముక్తి ఆశ్రయః, ఈ పది మహాపురాణ లక్షణాలు.

నవమ స్కంధం అంతా వంశానుచరితం. ఆశ్రయం, ఈశానుకథ, నిరోధం చెప్పేది దశమ స్కంధం. ఆశ్రయం శీకృష్ణుడు. ఆయనే నిరోధ (దుష్ట శిక్షణ), ఈశానుకథ అంటే ఆయన చేసిన కర్మలు. కృష్ణుడున్న వంశం యదువంశం. అంటే చంద్రవంశం. దానికి ముందు ఉన్న వంశం చంద్ర వంశం. ఎవరెవరు పరమాత్మ కృపకు విశేషముగా పాత్రులయ్యారో అది వివరిస్తారు.

శ్రీరాజోవాచ
మన్వన్తరాణి సర్వాణి త్వయోక్తాని శ్రుతాని మే
వీర్యాణ్యనన్తవీర్యస్య హరేస్తత్ర కృతాని చ

మీరు మాకు అన్ని మన్వంతరాలు చెప్పారు. ఆయా మన్వంతరాలలో పరమాత్మ యొక్క లీలా కృత్యములు వివరించారు.

యోऽసౌ సత్యవ్రతో నామ రాజర్షిర్ద్రవిడేశ్వరః
జ్ఞానం యోऽతీతకల్పాన్తే లేభే పురుషసేవయా

ద్రవిడాధిపతి ఐన సత్యవ్రతుడు ఒక కల్పములో వాడై ఉండి ఇంకో కల్పమునకు మనువయ్యాడు. పూర్వ కల్పములోనే పరమాత్మ కృపను పొంది తరువాతి కల్పానికి అధిపతి అయ్యాడు 

స వై వివస్వతః పుత్రో మనురాసీదితి శ్రుతమ్
త్వత్తస్తస్య సుతాః ప్రోక్తా ఇక్ష్వాకుప్రముఖా నృపాః

సూర్యభగవానుని పుత్రుడు, శ్రాద్ధదేవుడయ్యాడని, అతనికి పదిమంది కుమారులున్నారని, వారిలో పెద్దవాడు ఇక్ష్వాకు అని చెప్పారు. 

తేషాం వంశం పృథగ్బ్రహ్మన్వంశానుచరితాని చ
కీర్తయస్వ మహాభాగ నిత్యం శుశ్రూషతాం హి నః

అలాంటివారి వంశములో వారి వంశాను చరితము కూడా నేను మీ నుండి వినాలని మిమ్ములను ఎపుడూ సేవిస్తున్న నేను కోరుతున్నాను

యే భూతా యే భవిష్యాశ్చ భవన్త్యద్యతనాశ్చ యే
తేషాం నః పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్

జరిగిపోయిన వారు రాబోయే వారూ ఇప్పటి వారు. అందరి గురించీ చెప్పండి. అలాంటి వారిలోనూ పవిత్రమైన కీర్తి గలవారి గురించి చెప్పండి. 

శ్రీసూత ఉవాచ
ఏవం పరీక్షితా రాజ్ఞా సదసి బ్రహ్మవాదినామ్
పృష్టః ప్రోవాచ భగవాఞ్ఛుకః పరమధర్మవిత్

ఇలా అడిగితే పరమ ధర్మము తెలిసిన శుకుడు పదకొండు వేల మంది మునులచేత (బ్రహ్మవాదులచేత) పరివేష్టితుడైన పరీక్షిత్తు చేత అడుగబడి ఇలా చెబుతున్నాడు

శ్రీశుక ఉవాచ
శ్రూయతాం మానవో వంశః ప్రాచుర్యేణ పరన్తప
న శక్యతే విస్తరతో వక్తుం వర్షశతైరపి

నీకు వారి గురించి విస్తారముగా చెబుతాను విను, పూర్తి విస్తారముగా చెప్పలేను. అది వందేళ్ళు చెప్పినా కాదు. 

పరావరేషాం భూతానామాత్మా యః పురుషః పరః
స ఏవాసీదిదం విశ్వం కల్పాన్తేऽన్యన్న కిఞ్చన

ప్రళయ కాలములో పరమాత్మ తప్ప మరి ఒకటి ఏమీ లేదు. పెద్దవారికీ చిన్నవారికీ ఆయనే ఆత్మ. ఆయనే విశ్వం. 

తస్య నాభేః సమభవత్పద్మకోషో హిరణ్మయః
తస్మిన్జజ్ఞే మహారాజ స్వయమ్భూశ్చతురాననః

శ్రీమన్నారాయణుని నాభినుండి బంగారు పద్మకోశం ఉద్భవించింది, అందులో చతుర్ముఖ బ్రహ్మ, ఆయన మానస పుత్రుడు మరీచి, ఆయన పుత్రుడు కశ్యపుడు. ఆయనకు అథితి యందు సూర్యభగవానుడు పుట్టాడు. ఆ సూర్యభగవానుడికి శ్రాద్ధదేవుడు మనువుగా పుట్టాడు. ఈయన తన భార్య యందు పది మందిని కన్నాడు

మరీచిర్మనసస్తస్య జజ్ఞే తస్యాపి కశ్యపః
దాక్షాయణ్యాం తతోऽదిత్యాం వివస్వానభవత్సుతః

తతో మనుః శ్రాద్ధదేవః సంజ్ఞాయామాస భారత
శ్రద్ధాయాం జనయామాస దశ పుత్రాన్స ఆత్మవాన్

ఇక్ష్వాకునృగశర్యాతి దిష్టధృష్టకరూషకాన్
నరిష్యన్తం పృషధ్రం చ నభగం చ కవిం విభుః

వీరందరూ శ్రద్ధ దేవుని కుమారులు

అప్రజస్య మనోః పూర్వం వసిష్ఠో భగవాన్కిల
మిత్రావరుణయోరిష్టిం ప్రజార్థమకరోద్విభుః

వీరి కన్నా ముందు మనువుకు సంతానం లేనపుడు వశిష్టుడు మిత్రావరుణ యాగం చేయించాడు

తత్ర శ్రద్ధా మనోః పత్నీ హోతారం సమయాచత
దుహిత్రర్థముపాగమ్య ప్రణిపత్య పయోవ్రతా

పుత్ర సంతానం కావాలి అని మనువు వశిష్ట మహర్షి చేత యజ్ఞ్యం ప్రారంభింపచేస్తే ఆయన భార్యకు అమ్మాయి కావాలి అనిపించింది. వశిష్టుడు పుత్ర సంతానం కోసమే సంకల్పించి యజ్ఞ్యం చేస్తున్నాడు. గురువుగారితో ఆ మాట చెప్పలేని మనువు భార్య, 

ప్రేషితోऽధ్వర్యుణా హోతా వ్యచరత్తత్సమాహితః
గృహీతే హవిషి వాచా వషట్కారం గృణన్ద్విజః

హోతుస్తద్వ్యభిచారేణ కన్యేలా నామ సాభవత్
తాం విలోక్య మనుః ప్రాహ నాతితుష్టమనా గురుమ్

హవిస్సు వేసే హోత దగ్గరకు వెళ్ళి, అమ్మాయి పుట్టేట్టు హవిస్సు వేయమని అడిగింది. యజ్ఞ్యం పూర్తి అయ్యే సరికి అమ్మాయి పుట్టింది. మనువు గురువుగారిని పిలిచాడు

భగవన్కిమిదం జాతం కర్మ వో బ్రహ్మవాదినామ్
విపర్యయమహో కష్టం మైవం స్యాద్బ్రహ్మవిక్రియా

యూయం బ్రహ్మవిదో యుక్తాస్తపసా దగ్ధకిల్బిషాః
కుతః సఙ్కల్పవైషమ్యమనృతం విబుధేష్వివ

దేవతలు అబద్దం ఆడరు కదా. అలాగే మీ వంటి వారి సంకల్పానికి వైషమ్యం ఉండదు కదా. బ్రహ్మ పుత్రులైన మీరు పురోహితులుగా ఉన్న యజ్ఞ్యములో ఫల వైషమ్యం ఎందుకు వచ్చింది. 

నిశమ్య తద్వచస్తస్య భగవాన్ప్రపితామహః
హోతుర్వ్యతిక్రమం జ్ఞాత్వా బభాషే రవినన్దనమ్

ఆ విషయాన్ని విని, ఇది నా లోపం కాదు మహారాణే హోతను పట్టుకుని ప్రార్థించింది. ఇది దాని వలన వచ్చింది.

ఏతత్సఙ్కల్పవైషమ్యం హోతుస్తే వ్యభిచారతః
తథాపి సాధయిష్యే తే సుప్రజాస్త్వం స్వతేజసా

నేను ఆ అమ్మాయిని అబ్బాయిని చేస్తాను. 

ఏవం వ్యవసితో రాజన్భగవాన్స మహాయశాః
అస్తౌషీదాదిపురుషమిలాయాః పుంస్త్వకామ్యయా

అలా పుట్టిన అమ్మాయి పేరు ఇలా. అబ్బాయిగా మారడానికి పరమాత్మను స్తోత్రం చేయగా ఆ అమ్మాఇ అబ్బై గా మారింది

తస్మై కామవరం తుష్టో భగవాన్హరిరీశ్వరః
దదావిలాభవత్తేన సుద్యుమ్నః పురుషర్షభః

ఆ అబ్బై పేరు సుద్యుమ్నుడు.

స ఏకదా మహారాజ విచరన్మృగయాం వనే
వృతః కతిపయామాత్యైరశ్వమారుహ్య సైన్ధవమ్

ఇతను తన పరివారాన్ని తీసుకుని వేటకు వెళ్ళాడు ధనస్సునూ బాణాలనూ తీసుకుని

ప్రగృహ్య రుచిరం చాపం శరాంశ్చ పరమాద్భుతాన్
దంశితోऽనుమృగం వీరో జగామ దిశముత్తరామ్

సుకుమారవనం మేరోరధస్తాత్ప్రవివేశ హ
యత్రాస్తే భగవాన్ఛర్వో రమమాణః సహోమయా

అలా మేరువు కింద  భాగానికి వెళ్ళాడు. అది గౌరీ శిఖరం. అక్కడికి వెళ్ళగానే అతనూ అతని గుర్రాలూ సైన్యమూ అందరూ ఆడువారిగా మారిపోయారు. అక్కడకు ఎవరు వెళ్ళిన పురుషులైతే స్త్రీలుగా మారుతారు. ఒకానొక సంధర్భములో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతములో ఉండగా ఆ విషయం తెలియక సప్తఋషులు వెళ్ళారు. పార్వతీ దేవి మనసుకు ఇబ్బంది కలిగింది కాబట్టి ఆ ప్రాంతానికి ఎవరు వచ్చినా పురుషుడవుతాడని శంకరుడు శాసించాడు

తస్మిన్ప్రవిష్ట ఏవాసౌ సుద్యుమ్నః పరవీరహా
అపశ్యత్స్త్రియమాత్మానమశ్వం చ వడవాం నృప

తథా తదనుగాః సర్వే ఆత్మలిఙ్గవిపర్యయమ్
దృష్ట్వా విమనసోऽభూవన్వీక్షమాణాః పరస్పరమ్

శ్రీరాజోవాచ
కథమేవం గుణో దేశః కేన వా భగవన్కృతః
ప్రశ్నమేనం సమాచక్ష్వ పరం కౌతూహలం హి నః

శ్రీశుక ఉవాచ
ఏకదా గిరిశం ద్రష్టుమృషయస్తత్ర సువ్రతాః
దిశో వితిమిరాభాసాః కుర్వన్తః సముపాగమన్

తాన్విలోక్యామ్బికా దేవీ వివాసా వ్రీడితా భృశమ్
భర్తురఙ్కాత్సముత్థాయ నీవీమాశ్వథ పర్యధాత్

ఋషయోऽపి తయోర్వీక్ష్య ప్రసఙ్గం రమమాణయోః
నివృత్తాః ప్రయయుస్తస్మాన్నరనారాయణాశ్రమమ్

తదిదం భగవానాహ ప్రియాయాః ప్రియకామ్యయా
స్థానం యః ప్రవిశేదేతత్స వై యోషిద్భవేదితి

తత ఊర్ధ్వం వనం తద్వై పురుషా వర్జయన్తి హి
సా చానుచరసంయుక్తా విచచార వనాద్వనమ్

తన భృత్యులంతా స్త్రీలుగా అయ్యేసరికి అంతా చూసుకుంటూ వస్తున్నారు

అథ తామాశ్రమాభ్యాశే చరన్తీం ప్రమదోత్తమామ్
స్త్రీభిః పరివృతాం వీక్ష్య చకమే భగవాన్బుధః

ఈమె పరివారముతో ఇలా తిరుగుతూ ఉంటే అక్కడికి వచ్చిన బుధుడు (చంద్రుని కొడుకు) ఈమెను ప్రేమించాడు

సాపి తం చకమే సుభ్రూః సోమరాజసుతం పతిమ్
స తస్యాం జనయామాస పురూరవసమాత్మజమ్

ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి కలిగిన కొడుకే పురూరవుడు.

ఏవం స్త్రీత్వమనుప్రాప్తః సుద్యుమ్నో మానవో నృపః
సస్మార స కులాచార్యం వసిష్ఠమితి శుశ్రుమ

స్త్రీత్వాన్ని పొందిన సుద్యుమ్నుడు వేరే దారి లేక తమ కుల గురువైన వశిష్టున్ని స్మరించాడు

స తస్య తాం దశాం దృష్ట్వా కృపయా భృశపీడితః
సుద్యుమ్నస్యాశయన్పుంస్త్వముపాధావత శఙ్కరమ్

అపుడు వశిష్టుడు వచ్చి శంకరుని వద్దకు వెళ్ళి విషయం చెప్పి ప్రార్థించాడు.

తుష్టస్తస్మై స భగవానృషయే ప్రియమావహన్
స్వాం చ వాచమృతాం కుర్వన్నిదమాహ విశామ్పతే

ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషుడిగా ఉంటాడు అని ఒప్పందముతో అనుగ్రహం ఇచ్చాడు. 

మాసం పుమాన్స భవితా మాసం స్త్రీ తవ గోత్రజః
ఇత్థం వ్యవస్థయా కామం సుద్యుమ్నోऽవతు మేదినీమ్

స్త్రీగా ఉన్నప్పుడు అంతఃపురములో ఉండి, పురుషుడిగా ఉన్నప్పుడు పాలించేవాడు

ఆచార్యానుగ్రహాత్కామం లబ్ధ్వా పుంస్త్వం వ్యవస్థయా
పాలయామాస జగతీం నాభ్యనన్దన్స్మ తం ప్రజాః

ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించింది, వారు అసహ్యించుకొనుచుండగా 

తస్యోత్కలో గయో రాజన్విమలశ్చ త్రయః సుతాః
దక్షిణాపథరాజానో బభూవుర్ధర్మవత్సలాః

అతను పురుషుడిగా ఉన్నప్పుడు దక్షిణాపథమునకు ముగ్గురు రాజులుగా ఉండేవారు 

తతః పరిణతే కాలే ప్రతిష్ఠానపతిః ప్రభుః
పురూరవస ఉత్సృజ్య గాం పుత్రాయ గతో వనమ్

కాలము గడుస్తుండగా ప్రజలకు తాను ఇబ్బంది కలిగిస్తున్నాడని తెలుసుకుని పురూరవున్ని రాజుగా ఉండి తాను వనానికి వెళ్ళిపోయాడు

Popular Posts