శ్రీశుక ఉవాచ
మనుర్వివస్వతః పుత్రః శ్రాద్ధదేవ ఇతి శ్రుతః
సప్తమో వర్తమానో యస్తదపత్యాని మే శృణు
సూర్యభగవానుడి పుత్రుడైన శ్రాద్ధ దేవుడు ఏడవ మనువు. ఇప్పటి వాడు (వైవస్వత మన్వంతరం) . అతని సంతానం గురించి విను
ఇక్ష్వాకుర్నభగశ్చైవ ధృష్టః శర్యాతిరేవ చ
నరిష్యన్తోऽథ నాభాగః సప్తమో దిష్ట ఉచ్యతే
ఈ పది మంది ఈ మనువు యొక్క సంతానం.
తరూషశ్చ పృషధ్రశ్చ దశమో వసుమాన్స్మృతః
మనోర్వైవస్వతస్యైతే దశపుత్రాః పరన్తప
ఆదిత్యా వసవో రుద్రా విశ్వేదేవా మరుద్గణాః
అశ్వినావృభవో రాజన్నిన్ద్రస్తేషాం పురన్దరః
ఈ మన్వంతరములో వసు రుద్రా ఆదిత్య అశ్వనీ దేవతలు. పురంధరుడు వీరికి ఇంద్రుడు
కశ్యపోऽత్రిర్వసిష్ఠశ్చ విశ్వామిత్రోऽథ గౌతమః
జమదగ్నిర్భరద్వాజ ఇతి సప్తర్షయః స్మృతాః
కశ్యప అత్రి విశ్వామిత్రాదులు సప్త ఋషులు
అత్రాపి భగవజ్జన్మ కశ్యపాదదితేరభూత్
ఆదిత్యానామవరజో విష్ణుర్వామనరూపధృక్
ఈ మన్వంతరములో కూడా కశ్యపునికీ అధితికీ వామనుడిగా అధితి పుత్రులందరిలో చిన్నవాడై వామన రూపములో అవతరించహడు
సఙ్క్షేపతో మయోక్తాని సప్తమన్వన్తరాణి తే
భవిష్యాణ్యథ వక్ష్యామి విష్ణోః శక్త్యాన్వితాని చ
జరిగిన ఆరు జరుగుతున్న ఒక్క మన్వంతరం సంక్షేపముగ చెప్పాను. రాబోయే వాటిని గురించీ చెబుతాను. అవి పరమాత్మ శక్తితో కూడి ఉన్నవి
వివస్వతశ్చ ద్వే జాయే విశ్వకర్మసుతే ఉభే
సంజ్ఞా ఛాయా చ రాజేన్ద్ర యే ప్రాగభిహితే తవ
విశ్వ కర్మ ఇద్దరు పుత్రికలు సౌజ్ఞ్య చాయా సూర్యునికి భార్యలూ అని చెప్పాను ఇంతకుముందే. వీరు కాకుండా సౌజ్ఞ్యే వడవ (ఆడ గుర్రం) రూపములో వచ్చింది. ఆమెను మూడవ భార్యగా స్వీకరించాడు.సౌజ్ఞ్యకు యమ యమి శ్రాద్ధ దేవుడు.
తృతీయాం వడవామేకే తాసాం సంజ్ఞాసుతాస్త్రయః
యమో యమీ శ్రాద్ధదేవశ్ఛాయాయాశ్చ సుతాన్ఛృణు
సావర్ణిస్తపతీ కన్యా భార్యా సంవరణస్య యా
శనైశ్చరస్తృతీయోऽభూదశ్వినౌ వడవాత్మజౌ
చాయకు సావర్ణి తపతి, తపతి సంవర్ణి యొక్క భార్య. మూడవ వాడు శని. వడవకు అశ్వనీ దేవతలు.
అష్టమేऽన్తర ఆయాతే సావర్ణిర్భవితా మనుః
నిర్మోకవిరజస్కాద్యాః సావర్ణితనయా నృప
తత్ర దేవాః సుతపసో విరజా అమృతప్రభాః
తేషాం విరోచనసుతో బలిరిన్ద్రో భవిష్యతి
ఎనిమిదవ మన్వంతరములో సావర్ణి మనువు. వారి పుత్రులు నిర్మోక విరజ ఇత్యాదులు. సుతపాదులు దేవతలు. విరోచనుడి సుతుడైన బలి ఇంద్రుడు అవుతాడు
దత్త్వేమాం యాచమానాయ విష్ణవే యః పదత్రయమ్
రాద్ధమిన్ద్రపదం హిత్వా తతః సిద్ధిమవాప్స్యతి
విష్ణువు యాచిస్తే ఆయనకు త్రైలోక్య రాజ్యం ఇచ్చి ఇంద్ర పదవి వదిలిపెట్టి సిద్ధిని పొందుతాడు. శ్రీమన్నారాయణుని చేత ప్రీతి చే బంధించబడతాడు. స్వామి ఈయనకు సుతలాధిపత్యం ఇస్తాడు
యోऽసౌ భగవతా బద్ధః ప్రీతేన సుతలే పునః
నివేశితోऽధికే స్వర్గాదధునాస్తే స్వరాడివ
స్వరాట్టుగా ఇప్పటికీ ఉన్నాడు
గాలవో దీప్తిమాన్రామో ద్రోణపుత్రః కృపస్తథా
ఋష్యశృఙ్గః పితాస్మాకం భగవాన్బాదరాయణః
సుతలం కల్పాంతం వరకూ ఉంటుది. బ్రహ్మకు మూడు పూటలా ఉంటుంది సుతలం, ఒక పూటే ఉంటుంది స్వర్గం. వేయి మహా యుగాలు. 284 యుగాలకు ఒక్కో ఇంద్రుడూ మారుతాడు.ఒక మనువు ఉండేది 71 మహాయుగాలు. 14 మనువులు బ్రహ్మకు ఒక్క పూటలో ఉంటారు. ఈ ఏడుగురూ అష్టమ మన్వంతరములో సప్తఋషులు
ఇమే సప్తర్షయస్తత్ర భవిష్యన్తి స్వయోగతః
ఇదానీమాసతే రాజన్స్వే స్వ ఆశ్రమమణ్డలే
వీరంతా వారి వారి ఆశ్రమాలలో ఇప్పటికీ ఉన్నారు. సరస్వతి యందు సార్వభౌమ అనే పేరుతో అవతరించి ఇంద్రపదవి బలి చక్రవర్తికి ఇస్తాడు.
దేవగుహ్యాత్సరస్వత్యాం సార్వభౌమ ఇతి ప్రభుః
స్థానం పురన్దరాద్ధృత్వా బలయే దాస్యతీశ్వరః
నవమో దక్షసావర్ణిర్మనుర్వరుణసమ్భవః
భూతకేతుర్దీప్తకేతురిత్యాద్యాస్తత్సుతా నృప
తొమ్మిదవ మనువు పేరు తక్షసా వర్ణి. వీరంతా వారి పుత్రులు. మారీచి గర్భాదులు దేవతలు. ఇంద్రుని పేరు అద్భుతః. అంబుధారయందు వృషభ రూపములో పరమాత్మ అవతరిస్తాడు. ఈయన మూడు లోకాలనూ పరిపాలిస్తాడు. పదవ వాడు బ్రహ్మ సావర్ణి, ఉపశ్లోకుని కుమారుడు. హవిశ్మత్ మొదలైన వారు సప్తఋషులు
పారామరీచిగర్భాద్యా దేవా ఇన్ద్రోऽద్భుతః స్మృతః
ద్యుతిమత్ప్రముఖాస్తత్ర భవిష్యన్త్యృషయస్తతః
ఆయుష్మతోऽమ్బుధారాయామృషభో భగవత్కలా
భవితా యేన సంరాద్ధాం త్రిలోకీం భోక్ష్యతేऽద్భుతః
దశమో బ్రహ్మసావర్ణిరుపశ్లోకసుతో మనుః
తత్సుతా భూరిషేణాద్యా హవిష్మత్ప్రముఖా ద్విజాః
హవిష్మాన్సుకృతః సత్యో జయో మూర్తిస్తదా ద్విజాః
సువాసనవిరుద్ధాద్యా దేవాః శమ్భుః సురేశ్వరః
ఇంద్రుని పేరు శంభుః
విష్వక్సేనో విషూచ్యాం తు శమ్భోః సఖ్యం కరిష్యతి
జాతః స్వాంశేన భగవాన్గృహే విశ్వసృజో విభుః
విషూచి యందు జన్మించిన పరమాత్మ విశ్వక్సేనుడి పేరుతో,ప్రజాపతి ఇంటిలో పుట్టిన ఈయన , ఇంద్రునితో సఖుడిగా ఉంటాడు
మనుర్వై ధర్మసావర్ణిరేకాదశమ ఆత్మవాన్
అనాగతాస్తత్సుతాశ్చ సత్యధర్మాదయో దశ
విహఙ్గమాః కామగమా నిర్వాణరుచయః సురాః
ఇన్ద్రశ్చ వైధృతస్తేషామృషయశ్చారుణాదయః
వీరు దేవతలు. వైధృడు ఇంద్రునిగా ఉంటాడు. ఆర్యకునికి ధర్మ సేతువుగా పరమాత్మ అవతరిస్తాడు.
ఆర్యకస్య సుతస్తత్ర ధర్మసేతురితి స్మృతః
వైధృతాయాం హరేరంశస్త్రిలోకీం ధారయిష్యతి
భవితా రుద్రసావర్ణీ రాజన్ద్వాదశమో మనుః
దేవవానుపదేవశ్చ దేవశ్రేష్ఠాదయః సుతాః
పన్నెండవ మనువు పేరు రుద్ర సావర్ణి.
ఋతధామా చ తత్రేన్ద్రో దేవాశ్చ హరితాదయః
ఋషయశ్చ తపోమూర్తిస్తపస్వ్యాగ్నీధ్రకాదయః
ఋత ధామ ఇంద్రుడు,హరితాదులు దేవతలు.
స్వధామాఖ్యో హరేరంశః సాధయిష్యతి తన్మనోః
అన్తరం సత్యసహసః సునృతాయాః సుతో విభుః
పన్నెండవ మనువు పేరు రుద్ర సావర్ణి.
మనుస్త్రయోదశో భావ్యో దేవసావర్ణిరాత్మవాన్
చిత్రసేనవిచిత్రాద్యా దేవసావర్ణిదేహజాః
దేవాః సుకర్మసుత్రామ సంజ్ఞా ఇన్ద్రో దివస్పతిః
నిర్మోకతత్త్వదర్శాద్యా భవిష్యన్త్యృషయస్తదా
పదమూడవ మౌవు పేరు దేవసావర్ణి. సుకర్ణాదులు దేవతలు. దివస్పతి ఇంద్రుడు
దేవహోత్రస్య తనయ ఉపహర్తా దివస్పతేః
యోగేశ్వరో హరేరంశో బృహత్యాం సమ్భవిష్యతి
పరమాత్మ అంశ యోగేశ్వరుడు.
మనుర్వా ఇన్ద్రసావర్ణిశ్చతుర్దశమ ఏష్యతి
ఉరుగమ్భీరబుధాద్యా ఇన్ద్రసావర్ణివీర్యజాః
పధ్నాల్గవ వాడు ఇంద్ర సావర్ణి
పవిత్రాశ్చాక్షుషా దేవాః శుచిరిన్ద్రో భవిష్యతి
అగ్నిర్బాహుః శుచిః శుద్ధో మాగధాద్యాస్తపస్వినః
ఇంద్రుని పేరు శుచి.
సత్రాయణస్య తనయో బృహద్భానుస్తదా హరిః
వితానాయాం మహారాజ క్రియాతన్తూన్వితాయితా
హరి బృహద్భాను రూపములో అవతరిస్తాడు సత్రాయణునికి. అప్పటివరకూ లోపించిన సకల వైదిక కర్మలను ఈయన ఉద్ధరిస్తాడు.
రాజంశ్చతుర్దశైతాని త్రికాలానుగతాని తే
ప్రోక్తాన్యేభిర్మితః కల్పో యుగసాహస్రపర్యయః
త్రికాలములలో ఉండే పధ్నాలుగు మంది మనువుల చరిత్ర చెప్పాను. ఈ పధ్నాలుగు మంది ఒక వెయ్యి మహా యుగాలు ఉంటారు. (నాలుగు వేల యుగాలు)