Followers

Saturday, 26 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై నాలగవ అధ్యాయం


          ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై నాలగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఏకదా దేవయాత్రాయాం గోపాలా జాతకౌతుకాః
అనోభిరనడుద్యుక్తైః ప్రయయుస్తేऽమ్బికావనమ్

పౌర్ణమీ ద్వాదశీ, మరియూ కొన్ని మాసాల్లో కొన్ని రోజులలో దేవయాత్ర అని ఊరివారు మర్రి లేదా రావి చెట్టు వద్దకు వెళ్ళి స్వామికి ఆరాధన చేసుకుని అక్కడే భోజనం చేసి, ఆడి పాడి వచ్చేవారు. అలాంటి దేవ యాత్ర సందర్భములో గోపాలకురందరూ ఉత్సాహముతో అంబికా వనానికి వెళ్ళి సరస్వతీ నదిలో స్నానం చేసి శంకరున్ని పార్వతీదేవితో కలసి భక్తితో ఆరాధించారు.

తత్ర స్నాత్వా సరస్వత్యాం దేవం పశుపతిం విభుమ్
ఆనర్చురర్హణైర్భక్త్యా దేవీం చ ణృపతేऽమ్బికామ్

పండుగ అంటే గోవులకూ విప్రులకూ మంచి భోజనం పెట్టి సత్కరించడమే. అలాగే వీరు కూడా పరమాత్మ ప్రీతి కొరకు గోబ్రాహ్మణులకు భోజనం పెట్టారు.

గావో హిరణ్యం వాసాంసి మధు మధ్వన్నమాదృతాః
బ్రాహ్మణేభ్యో దదుః సర్వే దేవో నః ప్రీయతామితి

ఊషుః సరస్వతీతీరే జలం ప్రాశ్య యతవ్రతాః
రజనీం తాం మహాభాగా నన్దసునన్దకాదయః

సరస్వతీ నది తీరములో తీర్థాన్ని పుచ్చుకుని వ్రతముతో ఆ రాత్రి అక్కడే ఉన్నారు నంద సునందాదులు

కశ్చిన్మహానహిస్తస్మిన్విపినేऽతిబుభుక్షితః
యదృచ్ఛయాగతో నన్దం శయానమురగోऽగ్రసీత్

అపుడు ఒక పెద్ద పాము వచ్చి పడుకున్న నందున్ని మింగ యత్నించింది

స చుక్రోశాహినా గ్రస్తః కృష్ణ కృష్ణ మహానయమ్
సర్పో మాం గ్రసతే తాత ప్రపన్నం పరిమోచయ

అప్పుడు కృష్ణా నన్ను కాపాడు అన్నాడు.. అప్పుడు బాలురందరూ లేచి రాళ్ళతో మిగతా వాటితో ఆ పామును కొడుతున్నారు. ఆ పాము మాత్రం విడిచిపెట్టలేదు.

తస్య చాక్రన్దితం శ్రుత్వా గోపాలాః సహసోత్థితాః
గ్రస్తం చ దృష్ట్వా విభ్రాన్తాః సర్పం వివ్యధురుల్ముకైః

అలాతైర్దహ్యమానోऽపి నాముఞ్చత్తమురఙ్గమః
తమస్పృశత్పదాభ్యేత్య భగవాన్సాత్వతాం పతిః

ఇదంతా స్వామి చూచి తన పాదముతో ఆ సర్పాన్ని స్పృశించాడు

స వై భగవతః శ్రీమత్పాదస్పర్శహతాశుభః
భేజే సర్పవపుర్హిత్వా రూపం విద్యాధరార్చితమ్

అతను సకల్ విద్యాధర అధినాయకత్వ రూపాన్ని పొందాడు.

తమపృచ్ఛద్ధృషీకేశః ప్రణతం సమవస్థితమ్
దీప్యమానేన వపుషా పురుషం హేమమాలినమ్

అతన్ని స్వామి చూచి, అతడు నమస్కరిస్తుండగా అతని చరిత్ర ఏమిటో అడిగాడు.

కో భవాన్పరయా లక్ష్మ్యా రోచతేऽద్భుతదర్శనః
కథం జుగుప్సితామేతాం గతిం వా ప్రాపితోऽవశః

అసహ్యించుకునే పాము రూపం విద్యాధరుడవైన నీకు ఎలా వచ్చింది అనగా.

సర్ప ఉవాచ
అహం విద్యాధరః కశ్చిత్సుదర్శన ఇతి శ్రుతః
శ్రియా స్వరూపసమ్పత్త్యా విమానేనాచరన్దిశః

నా పేరు సుదర్శనుడు,నేను విద్యాధరున్ని, నా రూప భోగ సంపద చూచి గర్వించి నాకున్న విమానములో సంచరిస్తూ ఉండగా, అక్కడ అంగీరస మహామునులు కనపడగా,

ఋషీన్విరూపాఙ్గిరసః ప్రాహసం రూపదర్పితః
తైరిమాం ప్రాపితో యోనిం ప్రలబ్ధైః స్వేన పాప్మనా

వారు వికారముగ ఉన్నారని గర్వముతో నేను అపహాస్యం చేసాను. వారు "నీకు నీ రూపాన్నిస్తామని లోకులనదరూ అసహ్యించుకునే సర్ప రూపాన్ని నాకు శాప రూపములో అనుగ్రహించారు.

శాపో మేऽనుగ్రహాయైవ కృతస్తైః కరుణాత్మభిః
యదహం లోకగురుణా పదా స్పృష్టో హతాశుభః

వారు దయా పరులుకాబట్టి పేరుకు శాపం పెట్టినా అది నాకు అనుగ్రహముగా మారింది. సకల లోకనాధుని పాద స్పర్శ నాకు వారిశాపమే కలిగించింది. ఇలా అన్ని పాపాలూ నీ పాద స్పర్శతో పోయాయి.

తం త్వాహం భవభీతానాం ప్రపన్నానాం భయాపహమ్
ఆపృచ్ఛే శాపనిర్ముక్తః పాదస్పర్శాదమీవహన్

మహానుభావా నేను మిమ్ము శరణు వేడుతున్నాను. సకల లోకాధి దేవుడవైన నీకు నన్ను అనుగ్రహించు. ఏమిచేసినా పోని బ్రాహ్మణ శాపం కూడా నీ స్పర్శతో పోయి నేను తరించాను.   

ప్రపన్నోऽస్మి మహాయోగిన్మహాపురుష సత్పతే
అనుజానీహి మాం దేవ సర్వలోకేశ్వరేశ్వర

బ్రహ్మదణ్డాద్విముక్తోऽహం సద్యస్తేऽచ్యుత దర్శనాత్
యన్నామ గృహ్ణన్నఖిలాన్శ్రోతౄనాత్మానమేవ చ
సద్యః పునాతి కిం భూయస్తస్య స్పృష్టః పదా హి తే

ఏ పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తేనే ఉచ్చరించిన వారివే కాక విన్నవారి పాపాలను కూడా తొలగిస్తున్నపుడు ఆ పరమాత్మ పాద స్పర్శ సోకాకా ఇంక పాపాలు ఉంటాయా

ఇత్యనుజ్ఞాప్య దాశార్హం పరిక్రమ్యాభివన్ద్య చ
సుదర్శనో దివం యాతః కృచ్ఛ్రాన్నన్దశ్చ మోచితః

అని ఇలా పరమాత్మ  యొక్క అనుజ్ఞ్యను పొంది ఆయన ప్రదక్షిణం చేసి నమస్కరించి, సుదర్శనుడు స్వర్గానికి వెళ్ళాడు, ఆపద నుండి నందుడు కూడా విడివడ్డాడు.

నిశామ్య కృష్ణస్య తదాత్మవైభవం
వ్రజౌకసో విస్మితచేతసస్తతః
సమాప్య తస్మిన్నియమం పునర్వ్రజం
ణృపాయయుస్తత్కథయన్త ఆదృతాః

మళ్ళీ ఒక సారి పరమాత్మ వైభవాన్ని ఒక సారి చూచి ఆశ్చర్యం చెంది, తాము అనుకున్నది నిజమే అని నమ్మకం చేసుకుని వారందరూ వ్రజానికి వెళ్ళి రాని వారికి అక్కడ జరిగిన కథను వివరించారు.

కదాచిదథ గోవిన్దో రామశ్చాద్భుతవిక్రమః
విజహ్రతుర్వనే రాత్ర్యాం మధ్యగౌ వ్రజయోషితామ్

వేసవి కాలం రాత్రి పూట గోపికలూ బలారామ కృష్ణులూ మొదలైన గోపాలురూ దాగుడు మూతలు ఆడారు.

ఉపగీయమానౌ లలితం స్త్రీజనైర్బద్ధసౌహృదైః
స్వలఙ్కృతానులిప్తాఙ్గౌ స్రగ్వినౌ విరజోऽమ్బరౌ

గోపికలు చక్కగా అలంకరించుకుని స్వామి లీలలు గానం చేస్తున్నారు.

నిశాముఖం మానయన్తావుదితోడుపతారకమ్
మల్లికాగన్ధమత్తాలి జుష్టం కుముదవాయునా

చంద్రోదయం అవ్వగా, చంద్రుని వెన్నెలనూ మల్లికా సుగంధాలూ తుమ్మెదలూ మొదలైనవి గల వాతావరణములో వినే వారి అందరి మనసులకూ చెవులకూ మంగళం కలుగ చేస్తూ కృష్ణుని లీలలను పాడుతున్నారు.

జగతుః సర్వభూతానాం మనఃశ్రవణమఙ్గలమ్
తౌ కల్పయన్తౌ యుగపత్స్వరమణ్డలమూర్చ్ఛితమ్

గోప్యస్తద్గీతమాకర్ణ్య మూర్చ్ఛితా నావిదన్నృప
స్రంసద్దుకూలమాత్మానం స్రస్తకేశస్రజం తతః

ఏవం విక్రీడతోః స్వైరం గాయతోః సమ్ప్రమత్తవత్
శఙ్ఖచూడ ఇతి ఖ్యాతో ధనదానుచరోऽభ్యగాత్

కృష్ణ బలరాములు వేణు గానంచేస్తే వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ కలసి ఆడుతున్న సమయములో కుబేరుని సోదరుడు శంఖచూడుడు అక్కడకు వచ్చాడు.


తయోర్నిరీక్షతో రాజంస్తన్నాథం ప్రమదాజనమ్
క్రోశన్తం కాలయామాస దిశ్యుదీచ్యామశఙ్కితః

అతను వచ్చి ఈ గోపికా స్త్రీలలో కొందరిని తీసుకుని ఒక చోట రహస్యముగా దాస్తున్నాడు.


క్రోశన్తం కృష్ణ రామేతి విలోక్య స్వపరిగ్రహమ్
యథా గా దస్యునా గ్రస్తా భ్రాతరావన్వధావతామ్

అందరూ కృష్ణా రామా అని విలపిస్తున్నారు. గోవులను దొంగలెత్తుకు పోతుంటే ఎలా అంబారావాలు చేస్తూ పరిగెత్తుతాయో వారందరూ అలా అరిచారు.

మా భైష్టేత్యభయారావౌ శాలహస్తౌ తరస్వినౌ
ఆసేదతుస్తం తరసా త్వరితం గుహ్యకాధమమ్

కృష్ణ బలరాములు ఒక చెట్టును పెక్లించి వాన్ని పట్టుకోవడానికి వెళ్ళారు పరిగెత్తుకుని. బలరామకృష్ణులను చూచి శంఖచూడుడు పరిగెత్తి పారిపోయాడు ప్రాణాలు కాపాడుకోవడానికి.

స వీక్ష్య తావనుప్రాప్తౌ కాలమృత్యూ ఇవోద్విజన్
విషృజ్య స్త్రీజనం మూఢః ప్రాద్రవజ్జీవితేచ్ఛయా

తమన్వధావద్గోవిన్దో యత్ర యత్ర స ధావతి
జిహీర్షుస్తచ్ఛిరోరత్నం తస్థౌ రక్షన్స్త్రియో బలః

అవిదూర ఇవాభ్యేత్య శిరస్తస్య దురాత్మనః
జహార ముష్టినైవాఙ్గ సహచూడమణిం విభుః

శఙ్ఖచూడం నిహత్యైవం మణిమాదాయ భాస్వరమ్
అగ్రజాయాదదాత్ప్రీత్యా పశ్యన్తీనాం చ యోషితామ్


వాడు పరిగెత్తుతున్న ప్రతీ చోటికీ కృష్ణుడుకూడా వెంటపడి పరిగెత్తాడు. బలరాముడు మాత్రం స్త్రీల వద్ద కాపలాగా ఉన్నాడు. పరిగెత్తుతున్నవాడి వెంట కృష్ణుడు వెళ్ళాడు. అతనికి శిరోభాగమున అద్భుతమైన మణి ఉంది (అందుకే అతనికి ఆ పేరు). ముష్టి ఘాతముతో అతని శిరస్సు పగలగొట్టి ఆ మణిని తీసుకుని వచ్చాడు.
ఒక విలువైన వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు పెద్దలు ఎదురుగా ఉంటే వారికి సమర్పించాలి. అంచేత కృష్ణుడు ఆ మణిని గోపికలందరూ చూస్తుండగా ఆ మణిని బలరామునికి ఇచ్చాడు



                                                  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు  

Popular Posts