శ్రీశుక ఉవాచ
సత్యం సమీక్ష్యాబ్జభవో నఖేన్దుభిర్హతస్వధామద్యుతిరావృతోऽభ్యగాత్
మరీచిమిశ్రా ఋషయో బృహద్వ్రతాః సనన్దనాద్యా నరదేవ యోగినః
అది దాటి సత్య లోకం దగ్గరకు వెళ్ళి ఆ సత్య లోకాన్ని కూడా దాటిపోతోంది. బ్రహ్మ ఆసనాన్ని ఈ తేజస్సు తాకగా మరీచాది ఋషులు సనందాది యోగులూ
వేదోపవేదా నియమా యమాన్వితాస్తర్కేతిహాసాఙ్గపురాణసంహితాః
యే చాపరే యోగసమీరదీపిత జ్ఞానాగ్నినా రన్ధితకర్మకల్మషాః
వవన్దిరే యత్స్మరణానుభావతః స్వాయమ్భువం ధామ గతా అకర్మకమ్
వేదములూ ఉపవేదములూ నియమ యమాదులూ యోగముతో బాగా ప్రజ్వరిల్లే జ్ఞ్యానాగ్నితో పోగొట్టుకోబడిన కర్మ పాశాలుకలవారు ఏ మహానుభావున్ని స్మరించుకోవడం వలన సత్యలోకానికి వెళ్ళారో వారు ఆ పాదానికి నమస్కరించారు.బ్రహ్మ అర్ఘ్య జలముతో ఆ పాదాన్ని కడిగాడు
అథాఙ్ఘ్రయే ప్రోన్నమితాయ విష్ణోరుపాహరత్పద్మభవోऽర్హణోదకమ్
సమర్చ్య భక్త్యాభ్యగృణాచ్ఛుచిశ్రవా యన్నాభిపఙ్కేరుహసమ్భవః స్వయమ్
పరమాత్మ నాభి నుండి పుట్టిన్ బ్రహ్మ ఆ తీర్థాన్ని తీసుకున్నాడు
ధాతుః కమణ్డలుజలం తదురుక్రమస్య పాదావనేజనపవిత్రతయా నరేన్ద్ర
స్వర్ధున్యభూన్నభసి సా పతతీ నిమార్ష్టి లోకత్రయం భగవతో విశదేవ కీర్తిః
ఆ బ్రహ్మ యొక్క కమండల జలమే ఈ త్రివిక్రముని
బ్రహ్మాదయో లోకనాథాః స్వనాథాయ సమాదృతాః
సానుగా బలిమాజహ్రుః సఙ్క్షిప్తాత్మవిభూతయే
ఇదే ఆకాశగంగ అయ్యిది. అది ఆకాశము నుండి పడుతూ ఎలా ఐతే అంతటా వ్యాపించిన పరమాత్మ కీర్తి మూడులోకాల పాపాలనూ పోగొడుతుందో, ఆ ఆకాశగంగకూడా మూడులోకాల పాపాలను పోగొట్టిది,
ఈయనకు బ్రహ్మాది లోక వాసులందరూ, లోకనాధులందరూ తమ అనుచరులతో స్వామిని ఆరాధించారు.
తోయైః సమర్హణైః స్రగ్భిర్దివ్యగన్ధానులేపనైః
ధూపైర్దీపైః సురభిభిర్లాజాక్షతఫలాఙ్కురైః
కొందరు జలముతో కొందరు పూలతో గంధమూ ధూప దీప సుగంధ ద్రవ్యాలూ నాదములూ స్తోత్రములూ మొదలైన పరమాత్మ పరాక్రమాన్ని సూచించే స్తోత్రాలతో నృత్యాలతో శంఖ నాదాలతో పూజించారు. భల్లూక రాజు జాంబవంతుడు భేరీ శబ్దముతో ఆ పాదము చుట్టూ ప్రదక్షిణం చేసారు. జాంబవంతుడు పరమాత్మ విజయాన్ని అంతటా వ్యాపింపచేసాడు
స్తవనైర్జయశబ్దైశ్చ తద్వీర్యమహిమాఙ్కితైః
నృత్యవాదిత్రగీతైశ్చ శఙ్ఖదున్దుభినిఃస్వనైః
జామ్బవానృక్షరాజస్తు భేరీశబ్దైర్మనోజవః
విజయం దిక్షు సర్వాసు మహోత్సవమఘోషయత్
మహీం సర్వాం హృతాం దృష్ట్వా త్రిపదవ్యాజయాచ్ఞయా
ఊచుః స్వభర్తురసురా దీక్షితస్యాత్యమర్షితాః
అది చూసి బలిచక్రవర్తి అనుచరులు కోపముతో ఇలా అంటున్నారు.
న వాయం బ్రహ్మబన్ధుర్విష్ణుర్మాయావినాం వరః
ద్విజరూపప్రతిచ్ఛన్నో దేవకార్యం చికీర్షతి
ఇతను బ్రాహ్మణుడు కాడు. మాయావి. విష్ణువు. దేవ కార్యాన్ని చేYఅడానికి బ్రాహ్మణ రూపములో వచ్చాడు.
అనేన యాచమానేన శత్రుణా వటురూపిణా
సర్వస్వం నో హృతం భర్తుర్న్యస్తదణ్డస్య బర్హిషి
యజ్ఞ్యం చేస్తూ దండం వదిలిపెట్టిన యజమాని దగ్గర నుండి యాచకుని రూపముతో వచ్చి అంతా అపహరించాడు. మీరు అబద్దం ఎలాగూ చెప్పరు, మీరు బ్రాహ్మణుల యందు అధిక ప్రీతి కలవారు సత్య వ్రతులు దీక్షితులూ, మీరు అబద్దం చెప్పరు.మీరు శాంతులు. కాన యుద్ధం చేయరు.కానీ మేము చేస్తాము. అని బలిచక్రవర్తి అనుచరులు ఆయుధాలు తీసుకుని బయలుదేరారు వామనున్ని చంపాలని
సత్యవ్రతస్య సతతం దీక్షితస్య విశేషతః
నానృతం భాషితుం శక్యం బ్రహ్మణ్యస్య దయావతః
తస్మాదస్య వధో ధర్మో భర్తుః శుశ్రూషణం చ నః
ఇత్యాయుధాని జగృహుర్బలేరనుచరాసురాః
తే సర్వే వామనం హన్తుం శూలపట్టిశపాణయః
అనిచ్ఛన్తో బలే రాజన్ప్రాద్రవన్జాతమన్యవః
బలి చక్రవర్తి ఒప్పుకోకపోయినా కోపముతో బయలు దేరారు
తానభిద్రవతో దృష్ట్వా దితిజానీకపాన్నృప
ప్రహస్యానుచరా విష్ణోః ప్రత్యషేధన్నుదాయుధాః
విష్ణువు యొక్క అనుచరులు నవ్వుతూ వారిని అడ్డగించారు
నన్దః సునన్దోऽథ జయో విజయః ప్రబలో బలః
కుముదః కుముదాక్షశ్చ విష్వక్సేనః పతత్త్రిరాట్
జయన్తః శ్రుతదేవశ్చ పుష్పదన్తోऽథ సాత్వతః
సర్వే నాగాయుతప్రాణాశ్చమూం తే జఘ్నురాసురీమ్
గరుడాదులు అందరూ పది వేల ఏనుగుల బలము ఉన్న వారు, రాక్షస సైన్యాన్ని వారు సంహరించారు
హన్యమానాన్స్వకాన్దృష్ట్వా పురుషానుచరైర్బలిః
వారయామాస సంరబ్ధాన్కావ్యశాపమనుస్మరన్
అతని అనుచరులు రాక్షసులని వధిస్తున్నారని తెలుసుకుని శుక్రాచార్యుల శాపాన్ని స్మరించుకుని, వారిని యుద్ధం చేయవద్దని వారించాడు
హే విప్రచిత్తే హే రాహో హే నేమే శ్రూయతాం వచః
మా యుధ్యత నివర్తధ్వం న నః కాలోऽయమర్థకృత్
మీరు నా మాట వినండి.యుద్ధం చేయవద్దు. మనకు కాలం అనుకూలం కాదు. మన పని చేయదు కాలం ఇప్పుడు.
యః ప్రభుః సర్వభూతానాం సుఖదుఃఖోపపత్తయే
తం నాతివర్తితుం దైత్యాః పౌరుషైరీశ్వరః పుమాన్
సకలభూతాలకు సుఖ దుఃఖాలను కలిగించే పరమాత్మ సంకల్పాన్ని ప్రతికూలించుటకు మనకు శక్తి లేదు
యో నో భవాయ ప్రాగాసీదభవాయ దివౌకసామ్
స ఏవ భగవానద్య వర్తతే తద్విపర్యయమ్
ఆ పరమాత్మ మొదలు మనకు విజయాన్నీ దేవతలకు అపజయాన్నీ ఇచ్చాడు. ఇపుడు ఆయనే దానికి వ్యతిరేకముగా ఇస్తున్నాడు
బలేన సచివైర్బుద్ధ్యా దుర్గైర్మన్త్రౌషధాదిభిః
సామాదిభిరుపాయైశ్చ కాలం నాత్యేతి వై జనః
ఎన్ని సాధనాలు (బలం బుద్ధి మంత్రులూ ఔషధులూ దుర్గములూ మంత్రములూ సామాది ఉపాయాలు) ఉన్నా, దేన్ని గెలిచినా గెలవ వచ్చు గానీ కాలాన్ని గెలవలేరు
భవద్భిర్నిర్జితా హ్యేతే బహుశోऽనుచరా హరేః
దైవేనర్ద్ధైస్త ఏవాద్య యుధి జిత్వా నదన్తి నః
చాలా సార్లు ఈ హరి అనుచరులని మీరు గెలిచారు. అది దైవం వలన. దైవ సహకారం ఉండబట్టే గెలిచారు. ఇపుడు వారు మిమ్ము గెలుస్తున్నారు. దైవం ఇపుడు అటు వైపు ఉంది.
ఏతాన్వయం విజేష్యామో యది దైవం ప్రసీదతి
తస్మాత్కాలం ప్రతీక్షధ్వం యో నోऽర్థత్వాయ కల్పతే
మళ్ళీ దైవం మనకు అనుకూలం ఐనపుడు వీరిని గెలుద్దాము. కాలం కొరకు ఎదురు చూడండి
శ్రీశుక ఉవాచ
పత్యుర్నిగదితం శ్రుత్వా దైత్యదానవయూథపాః
రసాం నిర్వివిశూ రాజన్విష్ణుపార్షద తాడితాః
ఇలా భర్త యొక్క ఆజ్ఞ్యను విని రాక్షసులు భయపడి రసాతలానికి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు పరమాత్మ సంకల్పాన్ని తెలుసుకుని వరుణ పాశములతో బలి చక్రవర్తిని బంధించాడు
అథ తార్క్ష్యసుతో జ్ఞాత్వా విరాట్ప్రభుచికీర్షితమ్
బబన్ధ వారుణైః పాశైర్బలిం సూత్యేऽహని క్రతౌ
హాహాకారో మహానాసీద్రోదస్యోః సర్వతో దిశమ్
నిగృహ్యమాణేऽసురపతౌ విష్ణునా ప్రభవిష్ణునా
దానం చేసిన వారిని బంధించుట చూచి అందరూ హాహాకారాలు చేసారు. పరమాత్మ చేత అసురాధిపతి బంధించబడ్డాడు. అటువంటి బలి చక్రవర్తితో స్వామి ఇలా అన్నాడు. ఒక్క సంపదపోయింది కానీ అతనికి కీర్తీ ప్రజ్ఞ్యా (తెలివి) పోలేదు
తం బద్ధం వారుణైః పాశైర్భగవానాహ వామనః
నష్టశ్రియం స్థిరప్రజ్ఞముదారయశసం నృప
పదాని త్రీణి దత్తాని భూమేర్మహ్యం త్వయాసుర
ద్వాభ్యాం క్రాన్తా మహీ సర్వా తృతీయముపకల్పయ
నా పాదములతో మూడు పాదముల కొలవగలిగిన భూమిని ఇచ్చావు. మొత్తం భూమినీ ప్రపంచాన్నీ రెండు పాదాలతో ఆక్రమించాను. మూడవ పాదం నాకు ఇవ్వు.
యావత్తపత్యసౌ గోభిర్యావదిన్దుః సహోడుభిః
యావద్వర్షతి పర్జన్యస్తావతీ భూరియం తవ
నీరాజ్యం హద్దులు చెబుతున్నాను. ఎంత వరకూ కిరణాలతో సూర్యుడు తపింపచేస్తున్నాడో, చంద్రుడు తన కిరణాలను ప్రసరింపచేస్తున్నాడో ఎంత వరకూ పర్జన్యుడు వర్షాన్ని కురిపిస్తున్నాడో అంత వరకూ నీది
పదైకేన మయాక్రాన్తో భూర్లోకః ఖం దిశస్తనోః
స్వర్లోకస్తే ద్వితీయేన పశ్యతస్తే స్వమాత్మనా
ఆ మొత్తం నీ భూమికి ఒక్క అడుగు సరిపోయింది.భూ ఆకాశం అన్ని దిక్కులూ సరిపోయాయి. రెండో పాదముతో నీవు చూస్తుండగా సువర్లోకాన్ని ఆక్రమించాను.
ప్రతిశ్రుతమదాతుస్తే నిరయే వాస ఇష్యతే
విశ త్వం నిరయం తస్మాద్గురుణా చానుమోదితః
ఇస్తానని ఒప్పుకుని ఇవ్వకుంటే నరకములో నివాసము ఉంతుంది.దీనికి నీ గురువుగారు కూడా అంగీకరించారు కనుక నరకానికి వెళ్ళు.
వృథా మనోరథస్తస్య దూరః స్వర్గః పతత్యధః
ప్రతిశ్రుతస్యాదానేన యోऽర్థినం విప్రలమ్భతే
స్వర్గం కావాలన్న నీకోరిక వృధా.యాచకులకు ఇస్తానని మాట ఇచ్చావు.
విప్రలబ్ధో దదామీతి త్వయాహం చాఢ్యమానినా
తద్వ్యలీకఫలం భుఙ్క్ష్వ నిరయం కతిచిత్సమాః
నేనే శ్రీమంతుడని అనుకుని అడిగినదంతా ఇస్తా అని మాట ఇచ్చావు.ఈ అబద్ద ఫలం కొన్నేళ్ళు నీవు నరకాన్ని అనుభవించు